అతడితో నీనాగుప్తాకు గర్భం.. అయినా పెళ్లి చేసుకొందామని అనుకొన్నా.. ఆమెతో రిలేషన్‌పై ప్రముఖ డైరెక్టర్

బాలీవుడ్ ఇండస్ట్రీలో నీనా గుప్తా ఆత్మకథ సంచలనంగా మారింది. ఎలాంటి మొహమాటం లేకుండా నిక్కచ్చిగా కొందరి గురించి సచ్ కహో తో అనే పుస్తకంలో వివరించింది. రిచర్డ్స్‌తో తన ప్రెగ్నెన్సీ తర్వాత చోటుచేసుకొన్న కొన్ని సంఘటనలు వెల్లడించిన విషయం తెలిసిందే. తాను గర్బవతి అయినా తర్వాత దర్శకుడు సతీష్ కౌశిక్ పెళ్లి చేసుకొంటానని ముందుకొచ్చాడనే విషయంపై చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో సతీష్ కౌశిక్ స్పందించారు.

అలాంటి మానసిక స్థితిలో ....

అలాంటి మానసిక స్థితిలో ....

నీనా గుప్తా తన ఆత్మకథలో సతీష్ కౌశిక్ గురించి వెల్లడిస్తూ... పెళ్లికాకుండా తాను గర్బవతి అయిన సందర్భంలో మానసిక సంఘర్షణకు గురయ్యాను. ఆ సమయంలో నాకు అండగా నిలిచిన వారిలో దర్శకుడు, నటుడు సతీష్ కౌశిక్ కూడా ఉన్నారు. ఆయన నన్ను పెళ్లి చేసుకొంటానని కూడా చెప్పారు అని నీనా గుప్తా తన పుస్తకంలో పేర్కొన్నారు.

నా వద్దకు వచ్చి భోరున ఏడిస్తే...

నా వద్దకు వచ్చి భోరున ఏడిస్తే...

దర్శకుడు సతీష్ కౌశిక్ స్పందిస్తూ.. నీనా గర్భం దాల్చిన తర్వాత నన్ను కలిసింది. ఆ సమయంలో ఉద్వేగంతో కనిపించారు. నా వద్దకు వచ్చి భోరున ఏడ్చింది. దాంతో నేను కొంత ఎమోషనల్ అయ్యాను. ఆ సమయంలో ఆమె పరిస్థితి చూసి నేను అండగా ఉంటానని చెప్పాను. వీలైతే నేను పెళ్లి చేసుకొంటానని చెప్పాను అని వెల్లడించారు.

నీనా నాకు క్లోజ్ ఫ్రెండ్

నీనా నాకు క్లోజ్ ఫ్రెండ్

నీనా గుప్త ఆత్మకథలో తనను ప్రస్తావించడంపై సతీష్ కౌశిక్ స్పందిస్తూ.. 1975 నుంచి ఆమెతో నాకు అనుబంధం ఉంది. ఆమె నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. తాను గర్భవతి కావడంతో ఒంటరినై పోయానని బాధలో ఉండేది. తాను ఒంటరి కాకుండా ఉండటానికే నేను ఆమెను పెళ్లి చేసుకొంటాను అని చెప్పాను. నీనా విషయం నా భార్యకు కూడా తెలుసు. ఇందులో భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన విషయం ఏమీ లేదు అని సతీష్ కౌశిక్ అన్నారు.

ఆమెకు ప్రపోజ్ చేస్తే..

ఆమెకు ప్రపోజ్ చేస్తే..

పెళ్లి కాకుండా తల్లి కాబోతూ సమాజాన్ని ఎదురించడానికి సిద్దమైన నీనా గుప్తా ధైర్యాన్ని నేను ప్రశంసించాను. ఆమె కాన్ఫిడెన్స్ ముచ్చటపడటమే కాకుండా నీనాకు అండగా నిలిచాను. ఆమె ఆత్మకథలో నా గురించి ప్రస్తావించినందంతా.. ఆమెపై ఉన్న స్నేహభావం వల్లే. సమాజంలో ఒంటరిగా బతకడం ఇష్టం లేక నేను అలాంటి ఓదార్పు మాటలు చెప్పాను. దానినే నేను స్నేహం అంటాను. నేను పెళ్లి చేసుకొంటానని ఆమెకు ప్రపోజ్ చేసినప్పుడు.. కొంత వినోదం, గౌరవం, మద్దతు లాంటి మిశ్రమంగా భావోద్వేగాలు వ్యక్తమయ్యాయి అని సతీష్ కౌశిక్ పేర్కొన్నారు.

Recommended Video

Sushant Singh Rajput Biopic Motion Poster Viral సూసైడ్ or మర్డర్?
సతీష్ కౌశిక్ బాలీవుడ్ కెరీర్

సతీష్ కౌశిక్ బాలీవుడ్ కెరీర్

సతీష్ కౌశిక్ విషయానికి వస్తే.. నటుడు కావాలనే ఇంట్రెస్ట్‌తో జానే భీ దో యారో చిత్రంతో ఆయన బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. మిస్టర్ ఇండియా సినిమాలో క్యాలెండర్ పాత్రలో తన నటనతో మెప్పించారు. అలాగే దీవానా మస్తానా చిత్రంలో పప్పు పేజర్‌గా వినోదాన్ని పంచారు. రాం లఖన్, సాజన్ ఛలే ససురాల్ చిత్రాలకు బెస్ట్ కమెడియన్‌గా ఫిలింఫేర్ అవార్డు అందుకొన్నారు. అనిల్ కపూర్ నటించిన రూప్ కీ రాణి చోరంకా రాజా చిత్రంతో దర్శకుడిగా మారారు. ప్రేమ్, మిస్టర్ బేచారా, హమ్ ఆప్కే దిల్ మే రహ్తే హై, హమారా దిల్ ఆప్కే పాస్ హై, డర్నా జరూరీ హై, కర్జ్, కాగజ్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. పలు చిత్రాలకు నిర్మాతగా, స్క్రీన్ రైటర్‌గా వ్యవహరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X