Aarti Agarwal: ఆర్తి అగర్వాల్ మరణానికి కారణమదే.. అమ్మ రాజశేఖర్ నోట షాకింగ్ విషయాలు
Amma Rajasekhar: టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా వెలుగొంది.. ఆకస్మాతుగా దివికేగిసింది అలనాటి హీరోయిన్ ఆర్తి అగర్వాల్. ఈ అమ్మడు అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలో స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వ్యక్తిగతంగా మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ప్రేమ, పెళ్లి , బ్రేకప్ అంటూ ఎన్నో రూమర్స్ వినిపించాయి. ఆ తరువాత సినిమాల అవకాశాలు తగ్గిపోవడం. ఎవరు ఊహించని విధంగా ఆకస్మిక మరణం. అయితే.. ఆమె మరణంపై డైరెక్టర్, నటుడు అమ్మ రాజశేఖర్ పలు షాకింగ్ కామెంట్స్ చేశారు.
అందాల తార ఆర్తి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం 16 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ అమ్మడు అలా..16 వ ఏట 'పాగల్ పన్' అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో విక్టరీ వెంకటేష్‌కి జోడిగా 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అందమైన రూపం, కలువల్లాంటి కన్నులు, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఫస్ట్ మూవీ భారీ విజయం సాధించడంతో వరుస అవకాశాలు అందుకుంది.

ఈ తరుణంలోనే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, తరుణ్, మహేష్ బాబు, ప్రభాస్, బాలకృష్ణ, రవితేజ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. వరుస సినిమాలతో అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసింది ఆర్తి అగర్వాల్. కేవలం హీరోయిన్ గానే కాదు.. విలన్ పాత్రలో కూడా అదరగొట్టింది. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే ఆర్తి అగర్వాల్ ఆత్మహత్యయత్నం చేసింది.
ఆర్తీ అగర్వాల్ఓ హీరోతో ప్రేమాయణం సాగించిందని.. అతడితో వివాదం కారణంగానే సూసైడ్‌కు యత్నించిందని అప్పట్లో దీనిపై ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తరువాత మళ్లీ కమ్ బ్యాక్ చేసి.. వరుస సినిమాలతో సత్తా చాటుకుంది. అనంతర సమయంలోనే ఆర్తి అగర్వాల్.. 2007 లో ఉజ్వల్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ, రెండేళ్లకే భర్తకు విడాకులు ఇచ్చేసిందామె. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించింది. కానీ, ఆమె నటించిన సినిమాలు సక్సెస్ కాకపోవడం. సినిమాలు విడుదల కాకుండానే ఆగిపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి.
ఇలా పలు కారణాల వల్ల ఆర్తి డిప్రెషన్‌కు లోనై బాగా లావైపోయింది.దీంతో ఆమె బరువు తగ్గేందుకు కొన్ని సర్జరీలు కూడా చేయించుకుంది. ఈ క్రమంలోనే 2015 జూన్ 6న గుండెపోటుతో మరణించింది. అయితే.. తాజాగా డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అర్తి అగర్వాల్ మరణంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అమ్మ రాజశేఖర్ 2015 లో డైరెక్ట్ చేసిన రణం 2 సినిమాలో ఆర్తి అగర్వాల్ నటించారు.
రణం 2 సినిమాలో మెయిన్ క్యారెక్టర్ నటుడు శ్రీహరి. అయితే ఆయన అనారోగ్య కారణాలతో ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది. 6 నెలల గ్యాప్ తర్వాత షూటింగ్‌కి వచ్చిన ఆర్తి అగర్వాల్‌ని చూసి తాను షాక్ అయ్యాను. ఆర్తి అగర్వాల్ చాలా వెయిట్ గెయిన్ అయ్యారు. ఆ షూటింగులో కాస్ట్యూమ్ సెట్ కాలేదని ఆర్తి అగర్వాల్ బాగా ఏడ్చేసారు. ఆ విషయంలో ఇంక బయటకు రాలేనని ఆవేదన చెందారు అని చెప్పారని అమ్మ రాజశేఖర్ చెప్పారు.
అదే సంవత్సరం బరువు తగ్గడం కోసం చేయించుకున్న లైపోసక్షన్ సర్జరీ ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. ఆమె ప్రేమ, సూసైడ్ విషయంలో చాలా బ్యాడ్ అయ్యారు. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల విషయంలో చాలా బాధపడ్డారు. ఆ విషయాల్లో ఆర్తి అగర్వాల్ మానసికంగా చాలా బాధపడింది అని అమ్మ రాజశేఖర్ ఆమె మరణానికి దారి తీసిన విషయాలను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.


Click it and Unblock the Notifications











