నగ్నంగా నీ బాడీ చూపించు.. బికినీలో వద్దు.. యంగ్ హీరోయిన్‌తో డైరెక్టర్
చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా నిలదొక్కుకోవడం అంటే సులవైన పనికాదు. హీరోలకు కాస్తా వెసులుబాటు ఉన్నా.. హీరోయిన్లకు మాత్రం అడుగడుగునా సవాళ్లే ఎదురవుతుంటాయి. అన్ని ఛాలెంజ్ లను దాటుకొని వారు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నో చేధు అనుభవాలను కూడా దాటుకొని రావాల్సి ఉంటుంది. అయితే బాలీవుడ్ నటి నవీనా బోలే తనకు జరిగిన ఓ చేధు అనుభవాన్ని ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన ఒక డైరెక్టర్ ఎలా ప్రవర్తించాడో, సినిమా ఛాన్స్ కోసం వెళ్తే ఏం చేశాడో చెప్పే ప్రయత్నం చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
నవీనా బోసే వివరాలు..
టెలివిజన్ సిరీస్ లతో నవీనా బోలే నార్త్ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తొలుత మోడల్ గా కెరీయర్ ను మొదలు పెట్టింది. 1998 నుంచి హిందీ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. నవీనా బోలే బాలీవుడ్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ కర్రన్ జీత్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం 2017 మార్చిలో ఘనంగా జరిగింది. ీ దంపతులు ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చారు. ఆ తర్వాత 7 ఏళ్లకు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం నవీనా సింగిల్ గానే ఉంటోంది.

నవీనా బోసే టెలివిజన్..
నవీనా బోసే 1998 నుంచి హిందీ టెలివిజన్ సీరియల్స్ లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. తొలుత సీ.ఐ.డీ సిరీస్ తో అలరించింది. ఆ తర్వాత ష్.. ఫిర్ కోయి హై, సప్నా బాబుల్ కా.. బిడాయి, బాగో కేకే అయా, మిలే జబ్ హమ్ తుమ్, ఆదాలత్ సహా 20కి పైగా సీరియల్స్ లో నటించింది. మరోవైపు మ్యూజిక్ వీడియోల్లోనూ నటించి మెప్పించింది. దాంతో ఆడియెన్స్ లో మరింత క్రేజ్ దక్కించుకుంది. పలు వెబ్ సిరీస్ ల్లోనూ నటించింది. గతేడాది 2024లో విడుదలైన రసీలి రాటియన్ అనే వెబ్ సిరీస్ తో అలరించింది.
నగ్నంగా కనిపించమని అడగటంతో..
హిందీ టెలివిజన్ రంగంలో నవీనా బోలేకు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఎన్నో టీవీ సీరియల్స్, సిరీస్ ల్లో నటించి మెప్పించడం విశేషం. ఈ క్రమంలో ఎంతో మంది టెలివిజన్ నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్లతో కలిసి పనిచేసింది. అయితే ఒక సమయంలో మాత్రం నవీనా బోలేకు ఒక దర్శకుడితో చేధు అనుభవం జరిగిందని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆడిషన్ కు వెళ్తే తన దుస్తులను విప్పేసి కనిపించమని అడిగాడని చెప్పింది. దాంతో బికినీలో కనిపించడం తన వృత్తి వరకు ఓకేనని చెప్పిందంట.
ఆ తర్వాత కూడా అతను అడిగిన ఆడిషన్ తీరును తిరస్కరించినట్టు చెప్పుకొచ్చింది. వెంటనే వారి హౌజ్ నుంచి బయటికి వచ్చేశానని వెల్లడించింది. ఆ డైరెక్టర్ పేరును వెల్లడించలేదు. కానీ హిందీ టెలివిజన్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ అని ప్రచారం జరుగుతోంది. ఆయన 6 చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటుడిగానూ 4 చిత్రాల్లో నటించారు. మరోవైపు టెలివిజన్ లో 10ల సంఖ్యల్లో టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరించారు. ఇక హిందీ బిగ్ బాస్ సీజన్ 16లో కంటెస్టెంట్ గా అలరించాడు.


Click it and Unblock the Notifications











