రాత్రంతా హీరోయిన్‌కు చుక్కలు చూపించిన డైరెక్టర్.. అల్లు అర్జున్ ఎంట్రీతో మ్యాటర్ సెటిల్డ్

Bommarillu movie: సినీ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య గొడవలు సర్వసాధారణం. హీరో- హీరోయిన్ల మధ్య.. డైరెక్టర్స్- కథానాయికల మధ్య, నిర్మాతలు-దర్శకులు మధ్య కొన్ని సందర్భాల్లో వివాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఏ ఇద్దరి మధ్య అయినా సఖ్యత అనేది లేకపోతే గొడవకు దారి తీస్తాయి. అయితే పలువురు దర్శకుడు వారు అనుకున్నట్లు షాట్ పర్పెక్ట్ గా వచ్చే వరకు ఆర్టిస్టులను అస్సలు వదిలిపెట్టరు. ఎన్ని టేకులైనా చేపిస్తూనే ఉంటారు. సరిగా ఇదే ఈ సిచ్యూవేషనే ఓ స్టార్ హీరోయిన్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొందట.

ఓ డైరెక్టర్ నైట్ మొత్తం షూటింగ్ లో తెగ విసిగించేశాడట. ఒక్క షాట్ పర్పెక్ట్ గా రావడానికి ఏకంగా 35 టేకులు తీసుకున్నారంట. దీంతో ఆ హీరోయిన్ ఈ ఆఫర్ వద్దంటూ షూటింగ్ నుంచి పారిపోయిందట. ఈ క్రమంలో ఐకాన్ సార్ట్ అల్లు అర్జున్ వచ్చి.. ఆ హీరోయిన్ తో మాట్లాడి మ్యాటర్ సెట్ చేశాండట. ఈ బ్యూటీకి ఆ మూవీ మైల్ స్టోన్ గా మారింది. ఇంతకీ ఆ మూవీ ఎంటీ? ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు? అంతగా హీరోయిన్ టార్చర్ చేసిన డైరెక్టర్ ఎవరో మీరు కూడా ఓ లూక్కేయండి.

Director Bommarillu Bhaskar said Allu Arjun Request and convince Genelia to do Bommarillu movie

ఈ హీరోయిన్ ఎవరో కాదు. బాలీవుడ్ బ్యూటీ జెనీలియా. ఈ డైరెక్టర్ ఎవరో కాదు.. భాస్కర్ . అదేనండీ బొమ్మరిల్లు భాస్కర్. సిద్ధార్థ్ అండ్ జెనీలియా జంటగా నటించిన బొమ్మరిల్లు సినిమాను భాస్కర్ తెరకెక్కించారు. ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే మొదటి రోజే షూటింగ్ భాగంగా హీరోయిన్ కు డైరెక్టర్ చుక్కలు చూపించాడట. ఈ మూవీలో హైలెట్, యూత్ మొత్తాన్ని అట్రాక్ట్ చేసిన సీన్స్ ఉందిగా. అదే.. రాత్రి టైంలో హీరోహీరోయిన్ బయటకు వచ్చి.. చల్లనిలో ఐస్ క్రీమ్ తినే సీన్. ఆ సీన్ ను ముందుగా చిత్రీకరించారట. ఈ సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఈ విషయాలు స్వయంగా దర్శకుడు భాస్కరే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

దర్శకుడు భాస్కర్ మాట్లాడుతూ.. ' రాత్రి టైంలో హీరో హీరోయిన్ బయటకు వచ్చి చల్లనిలో ఐస్ క్రీమ్ తినే సీన్ ను ముందుగా చిత్రీకరించాం. ఆ సీన్ లో నైట్ ఎఫెక్ట్ కోసం రాత్రి 9 గంటలకు షూటింగ్ ప్రారంభించామని, హీరోయిన్ హీరోను ఐస్ క్రీమ్ తింటావా? అని అడగాలి. ఆ డైలాగ్ చేస్తున్నామని తెలిపారు. కానీ జెనీలియా మేం చెప్పినట్లు చేయడం లేదని, సరైన ఎక్స్ ప్రెషన్ రావట్లేదని, దీంతో మార్నింగ్ వరకు 35 టేక్స్ తీశామని వెల్లడించారు. దీంతో హీరోయిన్ జెనీలియాకు చాలా కోపం వచ్చిందని చెప్పాడు. ఏంటి? నేను రెండు డైలాగులు కూడా చెప్పలేనా? అంటూ షూట్ నుంచి వెళ్లిపోయిందని తెలిపాడు.

Director Bommarillu Bhaskar said Allu Arjun Request and convince Genelia to do Bommarillu movie

దీంతో అదే సమయంలో హ్యాపీ అనే మూవీలో కూడా జెనీలియా నటిస్తోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఆమెకు నచ్చచెప్పాడని, బొమ్మరిల్లు సినిమా చేయ్ అని కన్విన్స్ చేశారని వెల్లడించారు. ఇక జెనీలియా తిరిగి షూటింగ్ లో పాల్గొందట. ఇక రోజులు గడుస్తున్న కొద్ది దర్శకుడు అండ్ జెనీలియా మధ్య మంచి బంధం ఏర్పడిందని, చివరకు తనకు సారీ చెప్పిందని ఇంటర్వ్యూలో డైరెక్టర్ వివరించారు. లాస్ట్‌లో బొమ్మరిల్లు సినిమానే తన మొదటి సినిమా అని. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకోలేదంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడు టీమ్ అంతా చాలా సంతోషపడ్డామని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X