స్టార్ హీరోయిన్‌తో ధనుష్ రెండో పెళ్లి.. లీక్ చేసిన సీనియర్ డైరెక్టర్

చిత్ర పరిశ్రమకు చెందిన సెలబ్రెటీలలో తమ జీవిత భాగస్వామి నుంచి విడిపోయిన వారు, విడాకులు తీసుకున్న వారు లేదా జీవిత భాగస్వామి మరణించిన వారు తిరిగి జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. తమ మనసుకు బాగా దగ్గరైన వారితో జీవితం పంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. సింగర్ సునీత వంటి వారు రెండో పెళ్లి చేసుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. భర్త, పిల్లలతో ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా కొనసాగిస్తున్నారు. ఇలాంటి కథనాలు వచ్చినప్పుడల్లా మీడియా జనాలకు కనిపించే పేరు సీనియర్ నటి మీనా.

భర్త మరణంతో ఒంటరిగా మీనా

బాలనటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మీనా ఆ తర్వాత హీరోయిన్‌గా దక్షిణాదిలోని అందరు అగ్రనటుల సరసన నటించి స్టార్‌గా వెలుగొందారు. తన నవ్వు, అందంతో అప్పట్లో కుర్రాళ్లకు కలల రాకుమారిగా నిలిచారు. అవకాశాలు తగ్గుతున్న దశలో పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోయారు మీనా. బెంగళూరుకు చెందిన విద్యాసాగర్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని పెళ్లి చేసుకుని జీవితాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్న దశలో కొద్దినెలల క్రితం ఆమె భర్త కన్నుమూశారు. తనను ఎంతగానో ప్రేమించే భర్త మరణంతో మీనాను బాగా కృంగదీసింది. తన కుమార్తె నైనికయే జీవితంగా మీనా బతుకుతున్నారు.

Director Geetha Krishna Gave clarity on Meena 2nd Marriage with Kollywood Hero Dhanush

కూతురి కెరీర్ కోసం శ్రమిస్తోన్న మీనా

తన మాదిరిగానే నైనికను కూడా నటిగా చేయాలని మీనా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే ఇళయ దళపతి విజయ్ నటించిన తేరీలో ఆయనకు కుమార్తెగా ఈ చిన్నారి నటించి మెప్పించింది. ఇదే బాటలో ఆమెను నటనపరంగా మరింత రాటు దేల్చాలని మీనా భావిస్తున్నారు. అలాగే తన చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని కూడా ఆమె ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండస్ట్రీలోని పెద్దలు, మిత్రులు మీనాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయితే ఎక్కువ మంది మాత్రం మీనా రెండో పెళ్లి చేసుకుంటే మంచిదని అంటున్నారు.

ధనుష్‌‌తో మీనా పెళ్లంటూ గాసిప్స్

ఒంటరి తల్లి ఎదుర్కొనే ఇబ్బందుల దృష్ట్యా ఆమెను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే మీనా ఫలానా హీరోని పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియాలో రకరకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పేరు ఈ విషయంలో ఎక్కువగా వినిపిస్తోంది. తన భార్య ఐశ్వర్యకు విడాకులిచ్చి ధనుష్ ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. దాంతో మీనాకు ధనుష్‌కి కలిపి వార్తలు రాసేస్తున్నారు. ఆ విషయమై మీనా పలుమార్లు ఖండించినా ఈ పుకార్లకు చెక్ పడటం లేదు. తాజాగా సీనియర్ దర్శకుడు గీతా కృష్ణ.. మీనా రెండో పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Take a Poll

మీనా రెండో పెళ్లిపై దర్శకుడి వ్యాఖ్యలు

ఇటీవల ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సినిమా వాళ్లు సినిమాలలో కంటిన్యూ అవ్వకపోవడం ఉండదని, ఎవరొచ్చి ఆఫర్ ఇస్తారా? అని ఎదురుచూస్తారని గీతా కృష్ణ అన్నారు. కంటిన్యూ చేస్తున్న సమయంలోనే పెళ్లయ్యింది, ఆమె భర్త అనుకోకుండా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మీనా పెళ్లిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయని.. మీనా చిన్నప్పటి నుంచి పక్కా కమర్షియల్ అని, మంచి సినిమాలతో టాప్ రేంజ్‌కి వెళ్లిపోయిందని గీతా కృష్ణ తెలిపారు. ఆమె రెండో పెళ్లి జరిగితే జరగొచ్చని ఆయన అభిప్రాయపడ్డరు. మీనా పెళ్లి తర్వాత బాగా బరువు పెరిగారని అంటున్నారని.. కానీ వాణిశ్రీ వంటి వారు అద్భుతమైన క్యారెక్టర్లు చేశారని ఆయన చెప్పారు. కుటుంబ ప్రేక్షకుల్లో మీనాకు బ్రహ్మాండమైన ఇమేజ్ ఉందని, అయితే తల్లి పాత్రలు చేసేందుకు ఇష్టపడకపోవచ్చని గీతాకృష్ణ అభిప్రాయపడ్డారు.

More from Filmibeat

Read more about: geetha krishna meena dhanush
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X