‘చాలా మంది హీరోలపై అనుష్క వల.. ప్రభాస్ కాకుండా ఆ స్టార్ హీరోతో’

చిత్ర పరిశ్రమలో ఒకరి తర్వాత మరొకరు పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇంకొందరు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. కానీ ప్రభాస్, అనుష్కలు మాత్రం ఇంకా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గానే జీవితం గడిపేస్తున్నారు. ఇద్దరి మధ్యా ఏదో ఉందని ఏళ్లుగా ప్రచారం జరుగుతున్నా ప్రభాస్ కానీ, అనుష్క కానీ తమ మధ్య ఉన్న బంధం గురించి ఎప్పుడూ నోరు విప్పలేదు. ఇక ఏఐ రాకతో అనుష్క- ప్రభాస్‌లకు పెళ్లి జరిగి, పిల్లలు కూడా పుట్టినట్లుగా ఫ్యాన్స్ తెగ ఫోటోలు వైరల్ చేస్తున్నారు. కానీ ఎవ్వరూ ఖండించడం లేదు.

సూపర్‌తో టాలీవుడ్‌లో ఎంట్రీ

2005లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్‌తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు కన్నడ కస్తూరి అనుష్క శెట్టి. తొలినాళ్లలో అందాల ఆరబోతకే పరిమితమైన స్వీటీ జీవితాన్ని అరుంధతి చిత్రం మలుపు తిప్పింది. అరుంధతి, జేజమ్మగా రెండు క్యారెక్టర్లలో అద్భుతంగా నటించిన అనుష్క నాటి నుంచి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. పంచాక్షరి, నాగవల్లి, భాగమతి, రుద్రమదేవి చిత్రాలతో దక్షిణాదిలో లేడీ సూపర్‌స్టార్‌గా అవతరించారు.

Director Geetha Krishna made sensational comments Anushka Shetty

సైజ్ జీరోతో జీవితం తలక్రిందులు

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన హిస్టారికల్ బాహుబలిలో దేవసేనగా అనుష్క మరోసారి తన పవర్‌ఫుల్ యాక్టింగ్‌‌తో అలరించారు. అయితే సైజ్ జీరో చిత్రం ఆమె జీవితాన్ని తలక్రిందులు చేసింది. ఈ సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగారు అనుష్క. అయితే తిరిగి బరువు తగ్గేందుకు ఎంతో శ్రమించారు . కానీ ఫలితం మాత్రం శూన్యం. దీంతో వయసు, ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆమెకు సినిమాలలో ఆఫర్లు కూడా తగ్గాయి. అనివార్య కారణాల వల్ల ప్రస్తుతం సినిమాలు చేసినా చేయకపోయినా అనుష్క క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటితో పాటు ఓ మలయాళ చిత్రంలో చేస్తున్నారు స్వీటీశెట్టి.

ప్రభాస్ - అనుష్కలపై గాసిప్స్

45 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ ఈమె పెళ్లి మాట ఎత్తడం లేదు. పలుమార్లు అనుష్కకు పెళ్లి కుదిరినట్లుగా వార్తలు వచ్చినప్పటికీ అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. అయితే ప్రభాస్ - అనుష్కలు రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని దాదాపు పుష్కర కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని వీరిద్దరూ పలు వేదికలపై క్లారిటీ ఇచ్చారు. కానీ నేటికీ ప్రభాస్ పెళ్లి అనగానే .. అభిమానులకు తొలుత గుర్తొచ్చే పేరు అనుష్కనే.

అనుష్క అంటే వాళ్లకి పిచ్చి

దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో అనుష్క శెట్టిపై ఎన్నో గాసిప్స్ వైరల్ అయ్యాయి. పలువురు స్టార్స్‌తో ఆమెకు సంబంధం అంటగట్టారు. సుమంత్, గోపీచంద్, ప్రభాస్, సెంథిల్‌ పేర్లు అనుష్క బాయ్‌ఫ్రెండ్స్ లిస్ట్‌లో వినిపించాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు గీతా కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క అఫైర్లపై ఆయన మాట్లాడుతూ.. నిప్పు లేకుండా పొగ రాదన్నారు. నలుగురైదుగురు ప్రొడ్యూసర్లు అనుష్క అంటే పడి చస్తారని గీతా కృష్ణ ఆరోపించారు. ఓ ఎన్ఆర్ఐ, ఓ మాజీ ఎంపీ కూడా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు గీతాకృష్ణ. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X