ఆచార్య నుంచి కాజల్ అగర్వాల్ అవుట్.. అందుకే తీసేశాం అని కొరటాల శివ క్లారిటీ
మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ్ నటించిన ఆచార్య సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో చిత్ర యూనియ్ చాలా బిజీగా ఉంది. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ ఉందా లేదా అనే విషయంపై మొన్నటి వరకు అనేక రకాల అనుమానాలు వచ్చాయి. ఇక ఫైనల్ గా దర్శకుడు కొరటాల శివ ఆమె పాత్ర లేదు అంటూ అందుకు ఒక కారణం కూడా చెప్పడం జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే..

అత్యధిక థియేటర్స్ లో..
మొదటిసారి మెగాస్టార్ చిరంజీవి, అలాగే ఆయన తనయుడు రామ్ చరణ్ తో కలిసి చేసిన యాక్షన్ డ్రామా ఆచార్య ఈనెల 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. ఒక విధంగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే ఈ సినిమా అత్యధిక థియేటర్స్ లో విడుదల అవుతోంది. అంతేకాకుండా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేయడం విశేషం. మొదటి రోజు ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అర్థమవుతుంది.

మొదట అతిథి పాత్ర కోసం..
భరత్ అనే నేను సినిమా తర్వాత దర్శకుడు కొరటాల శివ చాలా గ్యాప్ తీసుకొని రామ్ చరణ్ తేజ్ తో ఒక సినిమా చేయాలి అని అనుకున్నాడు. అయితే అనుకోకుండా ఆ కాంబినేషన్ క్యాన్సిల్ కావడంతో మళ్లీ మెగాస్టార్ చిరంజీవి తో సినిమాను తెరపైకి తీసుకు వచ్చారు. ఇక రాసుకునే క్రమంలోనే రామ్ చరణ్ తేజ్ అయితే ఈ సినిమాలో సిద్దా పాత్రకు కరెక్టుగా సరిపోతాడు అని మళ్ళీ మార్చుకున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర మొదట కేవలం అతిధి పాత్రలోనే చూపించాలి అని అనుకున్నారు. కానీ తర్వాత మళ్లీ దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేసి. 40 నిమిషాల వరకు తీసుకు వచ్చాడు.

కాజల్ పాత్ర లేదు
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటించగా మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటించిన విషయం తెలిసిందే. ఇద్దరు హీరోయిన్స్ తో కూడా హీరోలకు సంబంధించిన సీన్స్ అద్భుతంగా వచ్చాయి అని ఇంతకు ముందు చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. కానీ ఇప్పుడు కాజల్ పాత్ర ఈ సినిమాలో అసలు లేనే లేదు అని తేల్చి చెప్పేశారు.

క్లారిటీ ఇచ్చిన కొరటాల
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా కాజల్ గురించి ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో కాజల్ పాత్ర అసలు సినిమాలో ఉందా లేదా అనే అనుమానాలు వచ్చాయి. ఇక ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీంతో కాజల్ పాత్ర సినిమాలో ఉందా లేదా అనే అనుమానాలు చాలానే వస్తున్నాయి. ఇక ఫైనల్ గా దర్శకుడు కొరటాల శివ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ చేస్తున్న క్యారెక్టర్ ను తీసేయ్యడానికి గల కారణం చెప్పాడు.

అవసరం లేదని..
మొదట స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కమర్షియల్ గా ఆలోచించి అంత పెద్ద స్టార్ హీరోకు ఒక మంచి స్టార్ హీరోయిన్ ఉంటే బావుంటుందని అనుకున్నాము అంటూ.. ధర్మస్థలిలో కాజల్ పాత్ర చాలా ఫన్నీగా డిజైన్ చేసుకున్నట్లు చెప్పారు. కానీ ఆ తరువాత ఆలోచిస్తే అంతగా అవసరం లేదని అనిపించిందని పైగా అంత పెద్ద స్టార్ ఇమేజ్ ఉన్న కాజల్ అగర్వాల్ ను కథకు అంతగా అవసరం లేనంత రేంజ్ లో చూపించడం కరెక్ట్ కాదని అనిపించి సీన్స్ తీసేసినట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications











