అనుష్క శెట్టి వల్ల వరుస ప్రమాదాలు.. 40 కేసులు నమోదు.. అసలు ఏమైందంటే?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కొన్నాళ్ల పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఊపూపింది. అగ్ర హీరోల అందరితో కలిసి నటించింది. మరోవైపు ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించి మెప్పింది. విభిన్న పాత్రల్లో పోషించి చిత్ర పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అయితే అనుష్క శెట్టి చేసిన సినిమా వల్ల 40 మంది పోలీసు కేసులు కూడా పెట్టే వరకు పరిస్థితి వచ్చిందంట. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఓ సందర్భంలో చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఎందుకు అంలాంటి పరిస్థితి వచ్చిందనే వివరాల్లోకి వెళితే...
టాలీవుడ్ లో అనుష్క శెట్టి గుర్తుండిపోయే చిత్రాలు..
కర్ణాటకకు చెందిన అనుష్క శెట్టి పూర్తిగా తెలుగు సినిమాల్లోనే నటిస్తూ వచ్చింది. కింగ్, అక్కినేని నాగార్జున అనుష్క శెట్టిని టాలీవుడ్ కు పరిచయం చేశారు. తొలుత 'సూపర్' అనే చిత్రంతో అనుష్క శెట్టి హీరోయిన్ గా తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. తొలి చిత్రంతోనే తన నటనతో ఆకట్టుకుంది. 2005 లో సూపర్ సినిమా విడుదలైంది. ఆ తర్వాత నుంచి ఇక్కడ వరుస బెట్టి సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అనుష్క శెట్టి నటించిన చిత్రాల్లో.. విక్రమార్కుడు, లక్ష్యం, డాన్, చింతకాయల రవి, అరుంధతి, బిల్లా, సింగం, వేదం, పంచాక్షరి, ఖలేజా, నాగవల్లి, రగడ, మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2, సైజ్ జీరో, భాగమతి, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వంటి చిత్రాలు చేసింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ వరుస పెట్టి సినిమాలు చేస్తోంది.

వేదం సినిమాతో 40 పోలీస్ కేసులు..
అనుష్క శెట్టి తన కెరీయర్ లో చాలా డేరింగ్ స్టెప్స్ ను తీసుకుంది. రోటీన్ కు భిన్నమైన పాత్రల్లో నటిస్తూ వచ్చింది. డిఫరెంట్ డిఫరెంట్ జొనర్లలో నటించేందుకు ఆసక్తి చూపించింది. ఈ క్రమంలోనే అనుష్క శెట్టి - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో వచ్చిన 'వేదం' చిత్రంలో వేష్య పాత్రలో కనిపించింది. అయితే ఆ పాత్రకు గాను అనుష్క శెట్టికి మంచి గుర్తింపు వచ్చింది. అదే స్థాయిలో కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో అనుష్క శెట్టి బోల్డ్ పోస్ ను హోర్డింగ్స్ లో పెట్టించామని క్రిష్ ఓ సందర్భంలో చెప్పారు. దాంతో వాహనదారులు అనుష్క లుక్ ను చూస్తూ ముందున్న వెహికిల్స్ కు డాష్ ఇచ్చారని చెప్పారు. అలా 40 మంది యాక్సిడెంట్స్ కు గురయ్యారని, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోనే తరుచూ కేసులు నమోదు అవుతుండటంతో వెంటనే ఆ హోర్డింగ్స్ ను తీయించేశామని చెప్పారు.
అది అనుష్క శెట్టి రేంజ్..
అనుష్క శెట్టి వేదం చిత్రంలో వేశ్య పాత్రతో కొద్దిపాటి విమర్శలను ఎదుర్కొంది. కానీ తన కెరీయర్ లో చాలా భిన్నమైన పాత్రలు పోషించేందుకు ముందుకు వచ్చింది. ఆ క్రమంలోనే అరుంధంతి, బాహుబలి, పంచాక్షరి, రుద్రమాదేవి, సైజ్ జీరో వంటి చిత్రాల్లో నటించి చెరగని ముద్ర వేసుకుంది. కొద్దికాలం తనకు సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టకపోయినా ఆమెకు ఏమాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. మరోవైపు తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకొని, తన సినిమాలను విజయ పథంలో నడిపించే స్థాయికి అనుష్క శెట్టి చేరుకుంది. స్టార్ హీరోలకు ఉండేంత రేంజ్ ను స్విటీ సంపాదించుకుంది.
ఘాటీతో ప్రేక్షకుల ముందుకు..
బాహుబలి 2 తర్వాత నుంచి అనుష్క శెట్టి పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది. తన దగ్గరకు వచ్చిన చిత్రాలకు నచ్చితేనే సైన్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో ప్రస్తుతం 'ఘాటీ' అనే చిత్రంతో సౌండ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. జూలై 11న విడుదల కాబోతోంది. అలాగే అనుష్క ఖతనర్ అనే మలయాళ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











