సాయి పల్లవి కోసం ఇండియన్ టాప్ డైరెక్టర్ వెయిటింగ్.. ఫిదా హీరోయిన్ రేంజ్ ఆ లెవెలా?
సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలం లోనే అందరి హీరోయిన్స్ కి కావాల్సిన ఫేమ్ వచ్చేయదు. అందుకు వారి టాలెంట్ తో పాటుగా అదృష్టం కూడా బాగా కలిసి రావాలి అంటారు. ఇక హీరోయిన్ అన్నాక ఆటా పాటా తో పాటుగా స్కిన్ షోలు కూడా చేస్తేనే అవకాశాలు అన్నట్టుగా కూడ కొన్ని అపోహలు ఉన్నాయి కానీ అలాంటివి లేకుండానే స్టార్ హీరోయిన్స్ గా నిలవొచ్చు అని చాలా తక్కువ మందే ప్రూవ్ చేసుకున్నారు.
అయితే అలాంటి వారిలో మొదట హోమ్లీ గా మొదలైనప్పటికీ ఇప్పుడు స్కిన్ షో చేస్తున్న హీరోయిన్స్ కూడా లేకపోలేరు. కానీ వారికి భిన్నంగా కెరీర్ స్టార్ట్ చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు కేవలం తన టాలెంట్ తోనే భారీ ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి అనే చెప్పాలి.

కాగా సాయి పల్లవి సౌత్ లో చాలా సినిమాల్లో కనిపించి ఇప్పుడు బాలీవుడ్ వరకు కూడా వెళ్లింది. అయితే ఇలా అన్ని భాషల్లో కూడా ఫుల్ గా బిజీగా ఉన్న సాయి పల్లవి క్రేజ్ ఎలా ఉందో మరోసారి ప్రూవ్ అయ్యింది అని చెప్పాలి. కాగా ఇండియన్ సినిమా దగ్గర ఒక టాప్ అండ్ తోప్ దర్శకుడు సైతం ఇప్పుడు సాయి పల్లవితో వర్క్ చేసేందుకు ఆసక్తి చూపడం విశేషం.
ఇండియన్ సినిమా దగ్గర తన హీరోయిన్స్ కి ఒక సెపరేట్ లీగ్ ని క్రియేట్ చేసిన దిగ్గజ దర్శకుడు మణిరత్నమే సాయి పల్లవి విషయంలో ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ఇండియన్ సినిమా లవర్స్ కి తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ ఆడియెన్స్ కి కూడా మణిరత్నం సినిమాల కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అలాగే తన సినిమాల్లో హీరోయిన్స్ ని ప్రెజెంట్ చేసే విధానంకి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కాగా అలాంటి దర్శకుడు సాయి పల్లవి వర్క్ కి పెద్ద అభిమానిని అని చెప్పడం వైరల్ గా మారింది. కాగా సాయి పల్లవి ఇప్పుడు వర్క్ చేస్తున్న ఎన్నో సినిమాల్లో తమిళ చిత్రం హీరో శివ కార్తికేయన్ తో చేస్తున్న యాక్షన్ సినిమా 'అమరన్' కూడా ఒకటి.
ఈ సినిమా ఈవెంట్ కి హాజరైన మణిరత్నం ఈ విషయాన్ని తెలిపారు. తాను సాయి పల్లవికి పెద్ద అభిమానిని అని ఆమెతో కలిసి వర్క్ చెయ్యాలి ఎప్పటికైనా చేస్తాను అంటూ మణిరత్నం కామెంట్స్ చేశారు. దీనితో సాయి పల్లవి విషయంలో ఈ కామెంట్స్ అటెన్షన్ ని తీసుకున్నాయి. మరి మణిరత్నం లాంటి లెజెండరీ దర్శకుని మన్ననలు పొందింది అంటే సాయి పల్లవి ఏ రేంజ్ పెర్ఫామర్ అనేది మనం అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ ఊహించని మ్యాజికల్ కలయిక ఎప్పటికి సాధ్యం అవుతుందో ఖచ్చితంగా కాలమే నిర్ణయించాలి. అలాగే వీరి కలయికలో సినిమా మంచి ఇంపాక్ట్ ని కూడా కలిగించే ఛాన్స్ ఉందని చెప్పాలి.


Click it and Unblock the Notifications











