Poorna వచ్చే జన్మలో హీరోయిన్ కడుపున పుడతానన్న డైరెక్టర్.. ఏడ్చేసిన పూర్ణ
ప్రముఖ హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఈ అందాల తార ప్రస్తుతం సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేస్తూ.. ఆకట్టుకుంటుంది. ఇటీవల గుంటూరు కారం సినిమాలో కనిపించి అలరించింది. ఇదిలా ఉంటే.. ఓ దర్శకుడు నటి పూర్ణ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనకు వచ్చే జన్మ ఉంటే.. పూర్ణ కడుపులో పుడతాను అంటూ వెల్లడించాడు. దీంతో హీరోయిన్ పూర్ణ ఎమోషనల్ అయి ఏడ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే....
హీరోయిన్ పూర్ణ అప్పట్లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ భామ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, అతిథి పాత్రల్లో నటిస్తుంది. అఖండ, దసరా, గుంటూరు కారం వంటి సినిమాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఢీ వంటి డ్యాన్స్ రియాల్టీషోల్లోనూ జడ్జిగా బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది. తన చలాకీ మాటలతో ఆకట్టుకుంటుంది. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అందాలను ఆరబోస్తుంది.

ఇటీవల మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం. ఇక ఈ సినిమాలోని కుర్చీ మడత పెట్టి పాటలో కాసేపు స్టెప్పులేసి.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే... పూర్ణ ప్రధాన పాత్రలో కోలీవుడ్ దర్శకుడు ఆదిత్య తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం డెవిల్. ఈ పేరుతో ఇప్పటికే కల్యాణ్ రామ్ సినిమా తీశాడు. అయితే ఆ సినిమాకు ఈ సినిమాకు సంబంధంలేదు. ఇది తమిళ చిత్రం. ఇప్పుడు ఈ సినిమా తెలుగులోకి డబ్బింగ్ కానుంది.
ఇక డెవిల్ చిత్రంలో విదార్థ్, పూర్ణ, అరుణ్, మిష్కిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ నటుడు, దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న డెవిల్ ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో తాజాగా చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా మాట్లాడిన మిస్కిన్ నటి పూర్ణపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మిస్కిన్ మాట్లాడుతూ... డెవిల్ చిత్రంలో పూర్ణ అద్భుతంగా నటించిందని చెప్పుకువచ్చాడు. అయితే తమ మధ్య ఏదో ఉందని కొందరు పుకార్లు పుట్టించడం బాధ కలిగించిందని తెలిపాడు. ఆమె నాకు తల్లిలాంటి వారని తమ రిలేషన్ పై క్లారిటీ ఇచ్చాడు. వచ్చే జన్మలో పూర్ణ కడుపున పుట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పుకువచ్చాడు.
మిస్కిన్ చెప్పిన మాటలు విన్న పూర్ణ... ఎమోషనల్ అయిపోయింది. కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే సందర్భంగా మాట్లాడిన పూర్ణ.. ' 'డెవిల్ నాకు కేవలం సినిమా మాత్రమే కాదు. నా జీవితానికి రిలేట్ అయిన ఒక ఎమోషన్ అంటూ వివరించింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











