కీర్తి సురేష్ తో రిలేషన్ షిప్.. మర్చిపోలేకపోతున్న టాప్ డైరెక్టర్
తెలుగు చిత్ర పరిశ్రమలో డైలాగ్ రైటర్ గా మొదలై ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా ఉన్నారు ఆయన. అతని దర్శకతంలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేషన్ ఒక బ్యూటీఫుల్ సినిమాలో నటించి హిట్ అందుకుంది. అయితే ఆయన తాజాగా జబర్దస్త్ వర్ష హోస్ట్ గా కొనసాగుతున్న కిస్సిక్ టాక్స్ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె పెళ్లి గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గ్గా మారింది. ఇంతకీ ఆయన ఎవరు అనే వివరాల్లోకి వెళితే...
కీర్తి సురేష్ తాజాగా ఫిల్మ్..
టాలీవుడ్ లో కొన్నాళ్లుగా యాక్టివ్ గా పనిచేస్తూ వస్తోంది హీరోయిన్ కీర్తి సురేష్. తొలుత చిన్న హీరోలతో తన కెరీర్ ను ప్రారంభించి ప్రస్తుతం స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పటికే మహానటి చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకం నేషనల్ అవార్డ్ ను కూడా సొంతం చేసుకుంది. మరోవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన 'సర్కార్ వారి పాట' చిత్రంలో నటించి మెప్పించింది. చివరిగా 'భోళా శంకర్'లో చిరుకు చెల్లిగా అలరించింది. ఇక తాజాగా సుహాస్ తో కలిసి ఉప్పు కప్పురంబు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం డైరెక్ట్ గా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుదల అవ్వడం విశేషం. జూలై 4 నుంచి ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

ఆ డైరెక్టర్ తో కీర్తి సురేష్ సినిమా..
నేను శైలజా, నేను లోకల్, అజ్ణాతవాసి, మహానటి వంటి చిత్రాల తర్వాత కీర్తి సురేష్ కు వరుసగా పెద్దగా సక్సెస్ రాలేదు. కానీ టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన 'రంగ్ దే' చిత్రంతో ప్రేక్షకుల నుంచి మంచి టాక్ దక్కించుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమాలో నితిన్ - కీర్తి సురేష్ జంటగా నటించారు. కీర్తికి మాత్రం టాలీవుడ్ లో మళ్లీ ఆపర్స్ మొదలయ్యాయి. అలా తొలిసారిగా వెంకీ అట్లూరితో రంగ్ దే సినిమాకు పనిచేసింది.
కీర్తి సురేష్ పై వెంకీ అట్లూరి కామెంట్స్..
టాలీవుడ్ లో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్నారు వెంకీ అట్లూరి. సార్, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలతో బ్లాక్ బాస్టర్ చిత్రాలను అందుకున్నారు. అయితే తాజాగా ఆయన జబర్దస్త్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న కిస్సిక్ టాక్స్ షోకు హాజరయ్యారు. ఈ సందర్బంగా తన సినిమాలు, రాబోయే సినిమాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో కీర్తి సురేష్ గురించి కూడా మాట్లాడారు.
కీర్తి సురేష్ తో మీకు ఉన్న రిలేషన్ షిప్ పై వర్ష ప్రశ్నించగా.. ఆమెకు నాకు మంచి స్నేహితురాలని, అన్నీ తనతో షేర్ చేసుకునే వాడినని చెప్పారు. కానీ ఇప్పుడు కీర్తి సురేష్ కు పెళ్లై పోయిందంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రోమోలో ఇంత వరకు చెప్పుకొచ్చారు. ఇక ఫుల్ ఎపిసోడ్ జూలై 5న బిగ్ టీవీలో ప్రసారం కానుంది. మరోవైపు వెంకీ అట్లూరి నెక్ట్స్ సినిమాను కోలీవుడ స్టార్ సూర్యతో చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఆ ప్రాజెక్ట్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.


Click it and Unblock the Notifications











