Disha patani నీ బికినీ ఫోటో కావాలి? నెటిజన్‌కు దిమ్మతిరిగే ఫోటోను పంపించిన దిశా పటానీ
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. పూరీ జగన్నాథ్ రూపొందించిన లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఇక్కడ విజయవంతం కాలేకపోయింది. అయితే సోషల్ మీడియాలో దిశ షేర్ చేసే ఫొటోలు తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆమెను పాపులర్ చేశాయి. సోషల్ మీడియాలో కోట్లాది మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న దిశ బికినీకి కొత్త నిర్వచనంలా నిలిచింది. జీరో సైజ్ బాడీతో పర్ఫెక్ట్ బికినీ భామగా మారింది. తాజాగా ఇన్‌స్టా ద్వారా ఫ్యాన్స్‌తో మాట్లాడిన దిశ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

బికినీ ఫొటో అడిగితే..
సోషల్ మీడియా ద్వారా అభిమానులతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండే దిశ వారు అడిగే పలు ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటుంది. అసభ్యకర ప్రశ్నలకు కూడా కోపం తెచ్చుకోకుండా తనదైన శైలిలో సమాధానాలిస్తుంటుంది. తాజాగా ఇన్‌స్టా చిట్‌చాట్ చేసిన దిశను ఒక వ్యక్తి.. `బెస్ట్ బికినీ ఫోటో షేర్ చేయండి` అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా దిశ.. ఒక జంతువుకు బికినీ వేసి ఉన్న ఫోటోను షేర్ చేసి దిమ్మ తిరిగి పోయే షాక్ ఇచ్చింది.

ఇన్‌స్టాలో సూపర్ ఫాలోయింగ్
హాట్ హాట్ ఫొటోలు, బికినీ వీడియోలతో రెచ్చిపోయే ఈ సుందరికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. వర్కవుట్ వీడియోస్‌తో పాటు తనకు సంబంధించి ప్రతీ అప్‌డేట్‌ను దిశ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. ఇప్పటికే ఆమెకు ఇన్‌స్టాలో 4కోట్ల 94 లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే 5 కోట్ల మార్కును దిశ చేరుకోబోతోంది.

టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణం
బాలీవుడ్ కండల వీరుడు టైగర్ ష్రాఫ్‌తో దిశ ప్రేమాయణం ఎన్నేళ్లగానో సాగుతోంది. టైగర్ కుటుంబ సభ్యులను కూడా దిశ పలుసార్లు కలిసింది. వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. అయితే ఒకరి సోషల్ మీడియా పోస్ట్‌లకు మరొకరు కామెంట్లు చేసుకుంటూ ఆ వార్తలకు పరోక్షంగా చెక్ పెట్టారు. లాక్‌డౌన్ సమయంలో వీరిద్దరూ ఒకే ఫ్లాట్‌లో కలిసి ఉన్నారు. అప్పట్లో అది సంచలనంగా మారింది.

అందాల ఆరబోతకు ల్యాండ్ మార్క్
ఒకవైపు సినిమాలు, మరోవైపు ప్రమోషన్లతో బిజీగా ఉండే దిశ సోషల్ మీడియాకు కూడా తగినంత సమయం కేటాయిస్తుంది. సోషల్ మీడియాలో ఆమె అందాల విందుకు హద్దనేదే ఉండదు. తరచుగా హాట్ హాట్ ఫొటోషూట్లలో పాల్గొంటూ వాటిని దిశ తన ఇన్‌స్టా ఖాతాలో అప్‌లోడ్ చేస్తుంటుంది. హాట్ వర్కవుట్ వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. ముఖ్యంగా బికినీ గర్ల్‌గా దిశకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఒక లో దుస్తుల కంపెనీకి దిశ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పని చేస్తోంది
Recommended Video


వరుస సినిమాలతో బిజీ..
సోషల్ మీడియాలో అందాల విందు చేస్తున్న దిశ ఆ క్రేజ్‌తో వరుస సినిమా ఆఫర్లు అందుకుంటోంది. బాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తోంది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ రూపొందిస్తున్న యాక్షన్ డ్రామా `యోధ` షూటింగ్‌ను దిశ ఇటీవలె పూర్తి చేసింది. ఇక, మోహిత్ సూరి దర్శకత్వంలో జాన్ అబ్రహమ్, అర్జున్ కపూర్‌లతో దిశ కలిసి నటించిన `ఏక్ విలన్-2` విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











