మరోసారి రెచ్చిపోయిన దిశా పటానీ: ఈ సారి అలా పడుకుని మామూలు రచ్చ కాదుగా!

గతంలో పోలిస్తే ఇప్పుడు దేశ వ్యాప్తంగా హైలైట్ అవ్వాలంటే చాలా మార్గాలే ఉన్నాయి. అందులో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం ఒకటి. ఇది వాడకంలోకి వచ్చిన తర్వాత చాలా మంది హీరోయిన్లు తమ తమ అందచందాలను ఎరగా వేస్తూ తరచూ వార్తల్లోనే ఉంటున్నారు. దీంతో ఫిల్మ్ మేకర్ల దృష్టిలో సైతం పడుతున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ ఒకరు.

ఇప్పటికే భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ భామ.. ఇంటర్నెట్‌ను తన అందాలతో ఊపి పడేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బీచ్‌లో బికినీతో దిగిన ఓ హాట్ పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ సెగలు రేపుతోన్న ఫొటోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

తెలుగు సినిమాతో జర్నీ మొదలు

తెలుగు సినిమాతో జర్నీ మొదలు

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే దిశా పటానీ మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టేసింది. ఆ రంగంలో తన అందచందాలతో అందరి ఫోకస్‌ను తిప్పేసుకుంది. అలాగే, చాలా బ్రాండ్లకు ప్రచారకర్తగానూ వ్యవహరించింది. ఇలా బిజీగా గడుపుతోన్న సమయంలోనే పూరీ - వరుణ్ కాంబినేషన్‌లో వచ్చిన 'లోఫర్'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఇది నిరాశనే మిగిల్చింది.

దిశా లైఫ్‌ను మార్చేన ధోనీ మూవీ

దిశా లైఫ్‌ను మార్చేన ధోనీ మూవీ

దిశా పటానీకి లోఫర్ మూవీ గ్రాండ్ ఎంట్రీని అందించలేకపోయింది. కానీ, ఆ వెంటనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంలో అత్యంత ముఖ్యమైన ప్రియాంక ఝా పాత్రను చేసింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు దిశాకు మంచి పేరు కూడా వచ్చింది. దీంతో ఆమె కెరీర్‌ ఒక్కసారిగా మారిపోయింది.

సినిమాలు, ఆల్బమ్‌లతో సందడి

సినిమాలు, ఆల్బమ్‌లతో సందడి

తక్కువ టైంలోనే బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిన దిశా పటానీ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. ఇప్పటికే 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి చిత్రాల్లో నటించింది. వీటితో పాటు మ్యూజిక్ ఆల్బమ్‌లు కూడా చేస్తోంది. ఇలా అన్నింట్లోనూ ఉంటూ ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటోంది.

ఆ స్టార్ హీరోతో ప్రేమాయణంతో

ఆ స్టార్ హీరోతో ప్రేమాయణంతో

కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను అవరోధిస్తోన్న దిశా పటానీ.. పర్సనల్ లైఫ్‌ను కూడా అదే రీతిలో ఎంజాయ్ చేస్తోంది. దీనికి కారణం ఆమె బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కొన్నేళ్లుగా లవ్ ట్రాక్ నడుపుతుండడమే. మొదట్లో సీక్రెట్‌గా డేటింగ్ నడిపిన ఈ జంట.. కొంత కాలంగా తరచూ టూర్లకు, పార్టీలకు వెళ్తూ లైఫ్‌ను విపరీతంగా ఎంజాయ్ చేస్తూ నిత్యం హైలైట్ అవుతోంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా

సుదీర్ఘ కాలంగా వరుస పెట్టి సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోన్న దిశా పటానీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ ఇందులో అప్‌డేట్లు ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. దీంతో ఆమె ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగింది.

ఎక్కువ శాతం గ్లామర్ ట్రీట్‌తోనే

ఎక్కువ శాతం గ్లామర్ ట్రీట్‌తోనే

సోషల్ మీడియాలో దిశా పటానీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ ఈ అమ్మడు ఇందులో తన అందచందాలను చూపిస్తూ తెగ సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా తరచూ ఈ స్టార్ హీరోయిన్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. అలాగే, బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న పిక్స్ కూడా వదులుతోంది. ఇలా ఎప్పుడూ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవుతోంది.

బీచ్‌లో బికినీతో అలా పడుకుని

బీచ్‌లో బికినీతో అలా పడుకుని

ఈ మధ్య కాలంలో దిశా పటానీ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బీచ్‌లో బికినీతో పడుకుని ఉంది. దీంతో పై నుంచి కింద వరకూ ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X