‘పుష్ప’లో బాలీవుడ్ బ్యూటీ: బన్నీతో పని చేయబోతున్నట్లు ముందే లీక్ చేసేసింది

తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. బడా నిర్మాత కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. తనలోని టాలెంట్‌తో చాలా తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్‌ తెరకెక్కించిన 'అల.. వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ ఇచ్చిన జోష్‌లోనే ప్రస్తుతం 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు. తాజాగా దీని గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.

'ఆర్య', 'ఆర్య2' వంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీల తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రమే 'పుష్ప'. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ చిత్రం.. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ డీ గ్లామర్‌ లుక్‌తో పక్కా మాస్ కుర్రాడిలా కనిపించబోతున్నాడు. ఇక, ఈ సినిమాలో అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉంటుందని చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రకటించింది. ఇందుకోసం మాజీ మిస్ ఇండియా ఊర్వశీ రౌటేలాను తీసుకున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో దీనిని దిశా పటానీ చేయబోతున్నట్లు స్వయంగా తెలిపింది.

 Disha Patani Clarity about Pushpa Song

ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా శుక్రవారం దిశా పటానీ మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె 'రాధే' సినిమాలోని తన డ్యాన్స్ గురించి ఎన్నో విషయాలు చెప్పింది. ఆ తర్వాత అల్లు అర్జున్ డ్యాన్స్ గురించి కూడా మాట్లాడింది. అదే సమయంలో తాను 'పుష్ప'లో స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు ముందే లీక్ చేసేసింది. ఇదిలా ఉండగా.. ఈ భారీ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X