దిశా పటాని ఒంటిపై చెప్పరాని చోట టాటూ.. ప్రభాస్ పేరు పచ్చబొట్టు వెనుక అసలు సీక్రెట్ రివీల్!
ఏ సినీ ఇండస్ట్రీలో అయినా కూడా పలువురు హీరో, హీరోయిన్ ల నడుమ డేటింగ్, ప్రేమాయణం వంటి వార్తలు తరచుగా వింటూనే ఉంటాం. కాగా ఇప్పుడు ఏ ఈవార్తలు అయితే ప్రతి చిన్న విషయం అయినా కూడా అభిమానుల్లో సోషల్ మీడియా ఫాలోవర్స్ లో కూడా మంచి కుతూహలం పెరిగిపోతూ ఉంటుంది. అయితే చాలా మంది బయట పడతారు కానీ ఇంకొందరు ఇంకా సీక్రెట్ గానే మైంటైన్ చేస్తూ వస్తున్నారు.
అయితే తాజాగా ఒక ఊహించని కాంబినేషన్ పై అభిమానుల్లో ఓ రేంజ్ టెన్స్ మూమెంట్స్ తో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చేసాయి. కాగా ఈ వార్తలే లేటెస్ట్ పాన్ ఇండియా హిట్ చిత్రం కల్కి 2898 ఎడి హీరో హీరోయిన్ లు ప్రభాస్ అలాగే దిశా పటాని లపై అని చెప్పాలి. కాగా ఈ ఇద్దరి కాంబినేషన్ ఓ రేంజ్ లో హిట్ అయ్యింది. ఇద్దరి కాంబినేషన్ లో ఉన్నవి కొన్న సన్నివేశాలే అయినప్పటికీ ఆడియెన్స్ కి బాగానే అనిపించాయి.

అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యింది అంతా హ్యాపీ గానే ఉన్నారు అనుకుంటున్నా సమయంలో దిశా పటాని, ప్రభాస్ లు డేటింగ్ లో ఉన్నారా అనే కొన్ని వార్తలు ఇప్పుడు ఒక్కసారిగా రాజుకున్నాయి. దీనికి గట్టి కారణం దిశా ఇచ్చిన కొన్ని హింట్ లు అని కూడా చెప్పవచ్చు. కాగా ఇటీవల కొన్ని ఫోటోలలో దిశా పటాని చేతిపై "పి డి" అనే రెండు ఆంగ్ల అక్షరాలు కనిపించాయి.
దీనితో ఇది డార్లింగ్ ప్రభాస్ అని మొదట్లో అనుమానం వచ్చింది కానీ రీసెంట్ గానే ఆమె తన టాటూ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో గెస్ చెయ్యండి అని పోస్ట్ చేయడంతో ఇక చాలా మంది అది డార్లింగ్ ప్రభాస్ అనే ఫిక్స్ అయ్యిపోయారు. దీనితో ఈ రచ్చ అలా నడుస్తున్న తరుణంలో దిశా పటాని ఈ పచ్చబొట్టు పై ఓపెన్ అయ్యింది.
దాని వెనుక ఎవరి పేరూ లేదని అది రీసెంట్ గా ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ 'వీడియో డేస్' జరుగగా అందులో కలిపి 'ప్రైమ్ డే' అనే పదం వేయించుకున్నాను అని తెలిపింది. అలాగే ఇది తాత్కాలిక పచ్చబొట్టే కానీ శాశ్వతంగా ఉండేది కాదు అని వీడియో వదిలింది. దీనితో ప్రభాస్, దిశా పటాని క్రేజీ కాంబినేషన్ డేటింగ్ లో ఉన్నారు, ప్రేమలో ఉన్నారు అని అనుకున్న అభిమానులకి చిన్నపాటి షాక్ లా ఇది తగిలింది అని చెప్పవచ్చు.
అయితే ప్రభాస్ విషయంలో ఇలాంటి వార్తలు రావడం కొత్తేమి కాదు కానీ బాలీవూడ్ హీరోయిన్ విషయంలో అయితే రెండో సారి అని చెప్పాలి. లాస్ట్ టైం అయితే తన బాలీవుడ్ చిత్రం "ఆదిపురుష్" చేస్తున్నపుడు ఆ సినిమా హీరోయిన్ కృతి సనన్ విషయంలో కూడా కొన్ని వార్తలు బాగా వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











