స్నానం చేస్తూ అలాంటి ఫోటో షేర్ చేసిన దిశా పటానీ.. గ్లామర్‌తో హీట్ పెంచేసిన లోఫర్ భామ
ఈ మధ్య కాలంలో హీరోయిన్లు సోషల్ మీడియా వేదికగా నడలు అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతున్నారు. అభిమానులను అలరించాలని అనుకుంటున్నారో లేక వరుస సినీ ఆఫర్లు క్యూ కడతాయి అని అనుకుంటున్నారో ఏమో కానీ మొత్తం మీద వారి అందాల ఆరబోతకు అడ్డే లేకుండా పోతోంది. ఆ హాట్ ఫోటో షూట్ ల దెబ్బకు కుర్రాళ్ళకు అయితే నిద్రలు కూడా పట్టడం లేదు. అలాంటి హీరోయిన్ల కోవలో దిశా పటానీ మొదటి వరుసలో నిలుస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో కాక రేపుతోంది. ఇంకెందుకు ఆలస్యం మనం కూడా చూసేద్దామా.

మంచి క్రేజ్
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన రాజ్ పుత్ ఫ్యామిలీలో జన్మించిన దిశా పటానీ చిన్న నాటి నుంచే సినిమాల మీద ఆసక్తి పెంచుకుంది. ఈ క్రమంలోనే ఆమె చాలా చిన్న వయసులోనే మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. మంచి అందం అంతకన్నా అద్భుతమైన శరీరాకృతి కూడా ఉండడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించి మంచి క్రేజ్ సంపాదించింది.

ప్రియాంక ఝా పాత్రలో
అయితే అలా అనేక యాడ్స్ లో కూడా మెరిసింది. ఈ క్రమంలోనే పూరీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన 'లోఫర్' సినిమాతో దిశా పటానీ హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. కానీ లోఫర్ మూవీ పెద్ద హిట్ కాకపోవడంతో దిశా పటానీకి టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఎం చేయాలా అని ఆలోచిస్తున్న క్రమంలో ఆమెకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni'సినిమాలో అత్యంత ముఖ్యమైన ప్రియాంక ఝా పాత్రలో నటించింది.

మ్యూజిక్ ఆల్బమ్‌లు కూడా
ఈ 'MS Dhoni' సినిమా సూపర్ హిట్ అవడంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. అలా క్రమంగా బాలీవుడ్‌లో స్థిరపడిపోయిన దిశా పటానీ వరుస సినిమాలతో తన సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి చిత్రాల్లో నటించి మెప్పిస్తోన్న ఆమె అవి మాత్రమే కాకుండా మ్యూజిక్ ఆల్బమ్‌లు కూడా చేస్తూ ప్రేక్షకులకు దగ్గర అవుతోంది.

బికినీ ఫోటోలు షేర్ చేస్తూ
వరుసగా సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సరే దిశా పటానీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా హాట్ బాంబ్ గా ఆమె పేరు తెచ్చుకుంది. తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలు మాత్రమే కాకుండా వీడియోలను సైతం షేర్ చేస్తోన్న దిశా ఎక్కువగా బికినీ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.

స్నానం చేస్తున్న పిక్ షేర్ చేసి
తాజాగా దిశా పటాని స్నానం చేస్తున్న ఫోటో పంచుకున్నారు. ఈ ఫోటోలను నటి తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. దీనితో పాటు, అతను తనతో అనేక సీల్ ఫిష్ ఫోటోలను కూడా పంచుకున్నాడు. మొదటి చిత్రంలో, ఆమె సముద్రంలో కనిపిస్తోంది. ఈ ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పాటు, బాలీవుడ్ నటులు కూడా లైకులు కొడుతూ ఆమె లుక్ గురించి కామెంట్ చేస్తూ ఆమెను ప్రశంసిస్తున్నారు. సీల్ తో తనని తాను పోల్చుకుంటూ ఆమె రచ్చ రేపింది.


Click it and Unblock the Notifications











