Don't Miss!
- News
పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
- Sports
వరల్డ్ కప్ ఫైనల్ ముందు అండర్-19 జట్టుకు సర్ప్రైజ్.. మోటివేట్ చేసిన నీరజ్ చోప్రా!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
Disha Patani హాట్ హాట్‌గా గ్లామర్ ట్రీట్.. అలాంటి డ్రస్‌లో అందాల కనువిందు.. సోషల్ మీడియాలో వైరల్‌గా
బాలీవుడ్‌లో అందం, అభినయంతో ఆకట్టుకొనే హీరోయిన్ ఎవరు అంటే ఠక్కున గుర్తొచ్చేది దిశా పటానీ. వెండితెర మీద నటన, గ్లామర్ పంట పండించడమే కాకుండా సోషల్ మీడియాలో అభిమానులకు అందాల విందుతో కనువిందు చూస్తూ ఆకట్టుకొంటున్నారు. అయితే ఇటీవల దిశా పటానీ తన సోషల్ మీడియాలో చేసిన పోస్టుతో మరోసారి దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చారు. దాంతో సోషల్ మీడియాలో ఆమె ప్రభావం ఏమిటో తెలియకనే తెలిసింది. ఆ వివరాల్లోకి వెళితే...

లోఫర్ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ
దిశాపటానీ కెరీర్ విషయానికి వస్తే టాలీవుడ్‌తోనే ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నించారు. లోఫర్ చిత్రంతో వరుణ్ తేజ్ సరసన నటించడమే కాకుండా ప్రేక్షకులకు తన అందాల విన్యాసాలతో రుచి చూపించారు. కానీ లోఫర్ చిత్రం పెద్దగా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయకపోవడంతో దిశా పటానీ అంతగా ఆఫర్లను సొంతం చేసుకోలేకపోయారు.

ఎంఎస్ ధోని చిత్రంతో పాపులారిటీ
అయితే లోఫర్ తర్వాత బాలీవుడ్‌లో ఆమె నటించిన ఎంఎస్ ధోని బయోపిక్ హిట్ అయింది. ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరి బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల కలెక్షన్లను కురిపించడం, దిశా పటానీ నటనకు మంచి మార్కులు పడటంతో ఆమె బాలీవుడ్‌కు పరిమితం అయ్యారు. దాంతో టాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చినా ఆసక్తి చూపడంల లేదు.

సోషల్ మీడియాలో 50 కోట్లకు చేరువగా
అయితే సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్లతో నటించిన దిశా పటానీ సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్‌ను మూటగట్టుకొన్నారు. ఇన్స్‌టాగ్రామ్‌లో ఆమెకు తిరుగులేని ఫాలోయింగ్ పెంచుకొన్నారు. తాజాగా ఆమెకు 47.8 మిలియన్ల ఫాలోవర్లు అంటే సుమారు 50 కోట్ల ఫాలోవర్స్ ఉండటం విశేషంగా మారింది. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్లలో ఒకరిగా రికార్డు సృష్టించింది.

దిమ్మ తిరిగే ఫోటోను షేర్ చేసి..
పవర్ ఫుల్ ఫాలోవర్స్ కలిగిన తన ఇన్స్‌టాగ్రామ్‌లో తన అందాలను పంచుతూ తరుచూ ఫోటోలను పోస్టు చేస్తుంటారు. తాజాగా అభిమానులకు నెటిజన్లకు దిమ్మ తిరిగే ఫోటో షేర్ చేసింది. అలా ఫోటోను షేర్ చేయగానే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంతో మంది అభిమానులకు ఆకట్టుకొన్నది. ఏకంగా తన ప్రియుడి టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణా ష్రాఫ్ కూడా లవ్ ఎమోజీని పెట్టి తన అభిమానాన్ని చాటుకొన్నారు.

సల్మాన్ మూవీ ప్రీమియర్ సందర్భంగా
దిశా పటానీ షేర్ చేసిన రెండు ఫోటోలు కొద్ది గంటల్లోనే 17 లక్షలకుపైగా లైక్స్‌ను సొంతం చేసుకొన్నది. సల్మాన్ చిత్రం అంతిమ్: ది ఫైనల్ ట్రూత్ అనే సినిమా ప్రీమియర్ సందర్భంగా కెమెరాలకు ఫోజిచ్చింది. శరీరాన్ని అత్తుకుపోయే డ్రస్‌ను ధరించి ఎద అందాలను బహిర్గతం చూసి ఫ్యాన్స్‌ను పిచ్చెక్కించింది. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అభిమానులు తమకు నచ్చిన హీరోయిన్‌పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Recommended Video
దిశా పటానీ సినీ కెరీర్ ఇలా..
ఇక దిశా పటానీ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల సల్మాన్ ఖాన్‌తో రాధే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం KTina అనే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఏక్ విలన్ రిటర్న్ అనే చిత్ర షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలు కూడా షూటింగ్ దశలోనే ఉండటం గమనార్హం.