ఇన్స్టాలో 50 మిలియన్ ఫాలోవర్స్.. మరో ఘాటు ఫోటో వదిలి ట్రీట్ ఇచ్చిన దిశా.. టాప్ లేకుండా అదొక్కటే ధరించి!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు దిశా పటానీ. ఈ అందాల ఆరబోతతో ఆమె స్టార్ హోదా దక్కించుకోవడానికి ముందే సోషల్ మీడియాలో స్టార్ హోదా సంపాదించింది. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఉండే ఆమె తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో 50 మిలియన్ ఫాలోవర్స్ ను సాధించింది. ఈ సందర్భంగా ఆమె తన హాట్ ఫోటో ఒకదానిని షేర్ చేసింది. ఆ ఫోటో సంగతి చూసేద్దామా?

బాలీవుడ్ కు చెక్కేసి

బాలీవుడ్ కు చెక్కేసి


ఉత్తరాఖండ్ లో పుట్టి పెరిగిన దిశా పటానీ చిన్నప్పటి నుంచి సినిమా మీద ఆసక్తి పెంచుకుంది. ముందు మోడలింగ్ మొదలు పెట్టిన ఆమె మోడల్‌గా ఫుల్ బిజీగా గడుపుతున్న సమయంలో సినిమా అవకాశం రావడంతో కెమెరా ముందుకొచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన 'లోఫర్' సినిమాతో సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని. తొలి సినిమాతోనే ఆడియన్స్ కన్ను తనపై పడేలా చేసుకున్న ఈ భామ ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కు చెక్కేసింది.

వార్తల్లో నిలబడేలా

వార్తల్లో నిలబడేలా


బాలీవుడ్ కి వెళ్లిన ఆమె ఎమ్‌ఎస్‌ ధోనీ, భాగీ సిరీస్‌, భారత్, వంటి చిత్రాలతో అభిమానులను అలరించింది. ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే ఆమె కొన్ని మ్యూజిక్ వీడియోస్ కూడా చేసింది. ఎప్పటికప్పుడు అందాలు ఆరబోయడం, తన లేలేత అందాలతో సోషల్ మీడియాను వేడెక్కించడంలో ముందు ఉండే దిశా పటానీ తన ఫ్రెష్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ చర్చలోనే ఉంటుంది. దానికి తోడు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణం కూడా ఆమెను వార్తల్లో నిలబడేలా చేస్తూ ఉంటుంది.

ప్ర‌త్యేక ఫొటోను పోస్టు చేసి

ప్ర‌త్యేక ఫొటోను పోస్టు చేసి


గ‌త కొన్నేళ్లుగా ఇన్ స్టాగ్రామ్ లో అత్య‌ధిక ఫాలోయ‌ర్ల‌ను క‌లిగి ఉన్న సెల‌బ్రిటీల్లో ఒక‌రిగా నిలుస్తోన్న దిశా పటానీ తాజాగా మ‌రో ఘ‌న‌త‌ను కూడా సొంతం చేసుకుంది. తాజాగా దిశా పటానీ ఇన్ స్టాగ్రామ్ ఫాలోయ‌ర్ల సంఖ్య 50 మిలియ‌న్ల మార్కును దాటేసింది. త‌న ఫాలోయ‌ర్ల సంఖ్య ఐదు కోట్ల‌ను దాటేయ‌డం ప‌ట్ల దిశ ఇప్పుడు గాల్లో తేలిపోతోంది. త‌న ఫాలోయ‌ర్ల సంఖ్య‌ 50 మిలియ‌న్ల మార్కును దాటిన సంద‌ర్భానికి కృత‌జ్ఞ‌త‌గా త‌న ప్ర‌త్యేక ఫొటోను పోస్టు చేసి ట్రీట్ ఇచ్చింది దిశ‌.

అడ్డు లేదన్నట్టు

అడ్డు లేదన్నట్టు


నిజానికి ఇన్ స్టాగ్రామ్ లో త‌ర‌చూ హాట్ హాట్ పిక్స్ ను పోస్టు చేయ‌డంలో దిశా ప‌టానీ అందరికంటే ముందుంటుంది. ఒకరకంగా వరుస సినిమాలు చేతిలో లేకపోయినా ఆ ఫోటోల కారణంగానే ఆమె ఫాలోయ‌ర్ల సంఖ్య రెగ్యుల‌ర్ గా పెరుగుతూ ఉంద‌ని చెప్పుకోవచ్చు. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో చేతినిండా అవ‌కాశాల‌తో, భారీ పారితోషికం పొందుతున్న హీరోయిన్ల‌లో ఒక‌రిగా ఉన్న దిశ ఫాలోయింగ్ కు ఎక్కడా అడ్డు లేదన్నట్టు దూసుకు పోతుంది.

50 మిలియన్ ఫాలోవర్స్

50 మిలియన్ ఫాలోవర్స్


తెలుగు హీరోయిన్లు సమంత, పూజా హెగ్డే, రష్మిక వంటి వారు 20 మిలియన్ల రేంజ్ లో ఉండగా బాలీవుడ్ భామలు మాత్రం ఆ విషయంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా 75 మిలియన్ ఫాలోవర్స్ దగ్గర ఉండగా శ్రద్ధా కపూర్ 70 మిలియన్, దీపిక పదుకోన్ - 65 మిలియన్, కత్రినా -63 మిలియన్, అలియా -62 మిలియన్, ఇప్పుడు దిషా పటాని -50 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించింది.

అందాలు ఆరబోస్తూ


ఇక ఈ ఫాలోవర్స్ వచ్చిన సంతోషంలో దిశా పటానీ ఒక అద్భుతమైన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫోటోలో ఆమె ఎద అందాలు ఆరబోస్తూ కనిపించింది. ఈ ఫోటో షేర్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X