టైగర్ ష్రాఫ్‌తో బ్రేకప్.. యంగ్ సింగర్‌తో దిశా పటానీ రొమాన్స్!

బాలీవుడ్‌లో పాపులర్ లవ్ కపుల్ ఎవరైనా ఉన్నారా? అంటే ఠక్కున గుర్తుకు వచ్చే జంట టైగర్ ష్రాఫ్, దిశా పటానీ. కొన్నేళ్లుగా వారిద్దరు చేసిన లవ్ జర్నీ మీడియాలోను, బాలీవుడ్ ఇండస్ట్రీలోను, సోషల్ మీడియాలోను హల్‌చల్ రేపింది. చాలా సంవత్సరాలుగా వారిద్దరు సహజీవనం చేశారు. కలిసి వర్కవుట్స్ చేశారు. జంటగా రెస్టారెంట్స్‌లో సందడి చేశారు. దాదాపు వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనేంతగా ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి కనిపించింది. తీరా కట్ చేస్తే టైగర్ ష్రాఫ్‌, దిశా పటానీ బ్రేకప్ చెప్పుకోవడం.. మరొకరితో ఆమె మూవ్ ఆన్ కావడం జరిగిపోయింది. అయితే దిశా పటానీ పీకల్లోతు ప్రేమ బ్రేకప్ కావడం వెనుక కారణం ఏమిటనే వివరాల్లోకి వెళితే..

టైగర్ ష్రాఫ్, దిశా పటానీ మధ్య ప్రేమ 2016లో మొదలైంది. దాదాపు 6 సంవత్సరాలపాటు వారిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. విదేశాల్లో వెకేషన్స్ చేశారు. భాగీ 2 సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా ప్రమోషన్స్‌లో ఆ ఇద్దరి కెమిస్ట్రీ క్యూట్‌గా కనిపించింది. అంతే కాకుండా టైగర్ కుటుంబంతో ఆమె మమేకమయ్యారు. ష్రాఫ్ ఫ్యామిలీ అంతా దిశాకు క్లోజ్ అయ్యారు. అది చూసిన వారంతా వారిద్దరూ బాలీవుడ్‌లో ముచ్చటైన దాంపత్య జంటగా మిగిలిపోతారని భావించారు.

Disha Patani New love Interest Talwiinder Singh

కానీ కారణం ఏమిటో తెలియదు గానీ.. టైగర్ ష్రాఫ్, దిశా పటానీ మధ్య విభేదాలు చోటు చేసుకొన్నాయి. స్నేహితులు, సన్నిహితులు వారి మధ్య ఉన్న అపోహలను తగ్గించి వారిని కలిపేందుకు ప్రయత్నించారు. కానీ వారి సయోధ్య ఫలించలేదు. దాంతో కొంతకాలంగా టైగర్ ష్రాఫ్, దిశా పటానీ ఇద్దరూ వేర్వేరుగా ఉంటూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో కలిసిన దాఖలాలు కూడా కనిపించలేదు.

అయితే 2022 సంవత్సరం నుంచి దిశా పటానీ, టైగర్ ష్రాఫ్ తమ అఫైర్ విషయంలో మౌనంగా ఉన్నారు. వారిద్దరూ విడిపోవడానికి ప్రధాన కారణం పెళ్లి వ్యవహారమే. దిశా పటానీ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకు రావడం.. దానికి టైగర్ ష్రాఫ్ సిద్దంగా లేకపోవడమే వారిద్దరి బ్రేకప్‌ జరిగింది. అయితే గత నాలుగేళ్లుగా తన ప్రియుడి రెస్పాన్స్ కోసం దిశా మౌనంగా ఎదురు చూసింది. టైగర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తన దారిని తాను వెతుక్కొన్నది.

టైగర్ ష్రాఫ్‌కు దూరమైన దిశా పటానీ ఓ పెళ్లిలో మాస్క్ మ్యాన్, పంజాబీ సింగర్ తల్విందర్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఇద్దరిని సన్నిహితం చేసింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. దాంతో రెగ్యులర్‌గా వారిద్దరూ కలుసుకోవడం, ఒకరిని మరొకరు అర్ధం చేసుకోవడానికి డేటింగ్ చేశారు. ఆ తర్వాత వారిద్దరూ అఫైర్‌ను ముందుకు కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నారు. దాంతో శాశ్వతంగ టైగర్ ష్రాఫ్‌కు దిశా గుడ్ బై చెప్పేసింది.

Disha Patani New love Interest Talwiinder Singh

ఇటీవల ఉదయ్‌పూర్‌లో తల్విందర్ సింగ్ నిర్వహించిన ఈవెంట్‌కు దిశా పటానీ హాజరైంది. ఎప్పడూ ఓ రకమైన మాస్క్‌తో కనిపించే ఆయనతో కలిసి షికారు చేసింది. మ్యూజిక్ కాన్సర్డ్ తర్వాత ఇద్దరు కలిసి జంటగా కనిపించారు. అంతేకాకుండా చేతిలో చేయి వేసుకొని ప్రేమ పక్షుల్లా విహరించారు. దాంతో తల్విందర్ సింగ్‌తో దిశా పటానీ అఫైర్‌కు అధికారికంగా ముద్ర పడింది.

దిశా పటానీ కెరీర్ విషయానికి వస్తే.. 2025 సంవత్సరంలో ఆమె నటించిన సినిమాలు రిలీజ్ కాలేదు. 2024 సంవత్సరంలో యోధా, కల్కి 2898 ఏడీ, కంగువా చిత్రాల్లో నటించింది. 2026 లో ఓ రోమియోలో అతిథి పాత్రలో కనిపించింది. అలాగే హోలీ గార్డ్స్ సాగా అనే చిత్రంలోను నటించింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న వెల్కమ్ టు ది జంగిల్, అవారాపన్ 2 సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X