మరోసారి హాట్ సెల్ఫీతో షాకిచ్చిన దిశా పటానీ: ఏకంగా మేకప్‌ రూమ్‌లో అలా చూపిస్తూ!

గతంలో సినిమాల్లో నటించడం ద్వారానే హీరోయిన్లు తమ అభిమానుల దృష్టిలో పడడంతో పాటు టచ్‌లో ఉంటూ ఉండేవారు. అయితే, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీని ద్వారా చాలా మంది భామలు తమ ఫ్యాన్స్‌తో అన్ని విషయాలూ షేర్ చేసుకుంటున్నారు. అదే సమయంలో తమ అందచందాలను చూపిస్తూ మజాను పంచుతున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఒకరు. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ స్టార్‌గా హవాను చూపిస్తోన్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే దిశా తాజాగా ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఈ పిక్‌పై మీరూ లుక్కేయండి మరి!

అలా మొదలు.. తెలుగులో ఎంట్రీ

అలా మొదలు.. తెలుగులో ఎంట్రీ

చిన్న వయసులోనే దిశా పటానీ మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో ఆరంభంలోనే అందరినీ మాయ చేసిన ఈ బ్యూటీ.. విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో ఎన్నో బ్రాండ్‌లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. ఇలాంటి సమయంలోనే పూరీ జగన్నాథ్ ఆమెను గుర్తించి వరుణ్ తేజ్ నటించిన ‘లోఫర్' సినిమాతో పరిచయం చేశాడు.

బయోపిక్‌తో దిశా కెరీర్ మారిందిగా

బయోపిక్‌తో దిశా కెరీర్ మారిందిగా

‘లోఫర్' మూవీతో దిశా పటానీకి సరైన ఆరంభం దక్కలేదు. దీంతో ఆమె తెలుగు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. సరిగ్గా అలాంటి సమయంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘MS Dhoni' చిత్రంలో కీలక పాత్రను చేసింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆమె కెరీర్‌‌కు ఊపును తీసుకుని వచ్చిందనే చెప్పాలి.

స్టార్ హీరోయిన్‌గా.. వరుస ఆఫర్లతో

స్టార్ హీరోయిన్‌గా.. వరుస ఆఫర్లతో

చాలా కాలంగా దిశా పటానీ బాలీవుడ్‌లో వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. ఇప్పటికే ‘కుంగ్‌పూ యోగా', ‘వెల్‌కం టు న్యూయార్క్', ‘భాగీ 2', ‘భారత్', ‘మలాంగ్', ‘భాగీ 3', ‘రాధే' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. వీటిలో గ్లామర్‌తో పాటు అద్భుతమైన నటనతో ప్రశంసలను దక్కించుకుంది. తద్వారా ఆమె స్టార్ హీరోయిన్‌తో పాటు ఆఫర్లనూ పట్టేస్తోంది.

ఆ హీరోతో ప్రేమాయణం సాగిస్తూ

ఆ హీరోతో ప్రేమాయణం సాగిస్తూ


సినిమాల మీద సినిమాలు చేస్తూ హవాను చూపిస్తోన్న దిశా పటానీ.. పర్సనల్ లైఫ్‌ను కూడా అదే రీతిలో ముందుకు తీసుకెళ్తోంది. దీనికి కారణం ఆమె బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తుండడమే. మొదట్లో సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపిన ఈ జంట.. కొంత కాలంగా తరచూ టూర్లకు, పార్టీలకు వెళ్తూ లైఫ్‌ను కెమెరాలకు చిక్కి.. ఇప్పుడు డైరెక్ట్ అయిపోయింది.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

ఒకవైపు సినిమాలు, మరోవైపు మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోన్న దిశా పటానీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తరచూ అప్‌డేట్లు ఇస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. దీంతో ఆమె ఫాలోవర్ల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది.

గ్లామర్ ట్రీట్‌తో దిశా రచ్చ చేస్తూ

గ్లామర్ ట్రీట్‌తో దిశా రచ్చ చేస్తూ

దిశా పటానీ సుదీర్ఘ కాలంగా బోల్డుగా ఉంటూ సోషల్ మీడియాలో యమ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన ప్రియుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అలాగే తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా ఇంటర్నెట్‌ను దిశా పటానీ తన గ్లామర్‌తో ఊపేస్తోంది.

Recommended Video

RRR లో మల్లి..ఎవరీ చిట్టితల్లి? Twinkle Sharma లైఫ్ మలుపు తిప్పిన యాడ్ | Filmibeat Telugu
ఘాటు సెల్ఫీని షేర్ చేసిన భామ

ఘాటు సెల్ఫీని షేర్ చేసిన భామ


స్టార్ హీరోయిన్ దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె మేకప్ రూమ్‌లో అద్దం ముందర స్టైలిష్ డ్రెస్ ధరించి కనిపించింది. తద్వారా ఈ భామ ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది తక్కువ సమయంలోనే తెగ వైరల్ అయిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X