సల్మాన్ స్లో మోషన్ ఎఫెక్ట్.. దిశాపటానీకి నడుము పట్టేసిందట,, మోకాలికి గాయం.. వారం బెడ్‌పైనే!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన భారత్ చిత్రం రోజు రోజుకు భారీ అంచనాలు పెంచుతున్నది. ఇటీవల విడుదలైన సినిమా మోషన్ పోస్టర్‌తో అభిమానుల్లో క్రేజ్ పెరిగింది. తాజాగా రిలీజ్ చేసిన స్లో మోషన్ పాట సామాజిక, యూటూబ్ మాధ్యమాల్లో హిట్‌గా మారింది. విభిన్నమైన స్టెప్పులు, స్లో మోషన్‌లో డ్యాన్స్, పాటలో ఉపయోగించిన క్యాస్టూమ్స్ ప్రత్యేక ఆకర్షణగా మారాయి. మంచి ప్రజాదరణను ఆకట్టుకొంటున్న పాటకు ముందు పడిన కష్టాలను హీరోయిన్ దిశా పటానీ ఇలా వెల్లడించారు. ఆమె ఏం చెప్పారంటే..

సాంగ్‌కు ముందు ప్రాక్టీస్‌లో

సాంగ్‌కు ముందు ప్రాక్టీస్‌లో

స్లో మోషన్ పాట కోసం చాలా రిహార్సల్ చేశాం. పాటను అందంగా తీర్చి దిద్దడానికి జిమ్నాస్టిక్ ప్రాక్టీస్ చేశాం. ఈ పాటలో కొన్ని స్టంట్స్ కూడా ఉన్నాయి ఆ ప్రాక్టీస్ సందర్బంగా నా మోకాలికి గాయమైంది. పాట షూట్‌కు వారం ముందు నా నడుము పట్టేసింది. దాంతో ఓ వారం పాటు బెడ్‌పైనే రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది అని దిశా పటానీ చెప్పారు.

బెడ్‌కే పరిమితం అయ్యాను

బెడ్‌కే పరిమితం అయ్యాను

ప్రాక్టీస్‌లో గాయం కారణంగా నేను సరిగా నడువలేకపోయాను. కేవలం బెడ్‌కే పరిమితం అయ్యాను. ఆ సమయంలో చాలా బాధను అనుభవించాను. పాట షూటింగ్ సందర్భంగా గాయాల వద్ద ఐస్ పెట్టుకొంటూ షూట్ చేశాను. అలా కష్టపడుతూ, బాధ పడుతూ స్లో మోషన్ పాటను పూర్తి చేశాను అని దిశా పటానీ చెప్పింది.

 పడిన కష్టానికి ఫలితం

పడిన కష్టానికి ఫలితం

ప్రస్తుతం స్లో మోషన్ పాటకు వస్తున్న రెస్సాన్స్ చూస్తుంటే అప్పుడు పడిన కష్టాలు మరిచిపోయాను. రిలీజైన వెంటనే ఈ పాట పెద్ద హిట్ కావడం చాలా సంతోషంగా ఉంది. పడిన కష్టానికి ఫలితం దక్కిందనే ఫీలింగ్ రెండింతలైంది. నా కెరీర్‌లో ఇదో చక్కటి అనుభూతి. ఓ మంచి గుర్తుగా మిగిలిపోతుంది అని దిశా పటానీ పేర్కొన్నది.

ఇలాంటి మాస్ పాటలంటే

ఇలాంటి మాస్ పాటలంటే

నా గాయాల బాధకు తోడు ఈ పాట షూటింగ్ అంతా రాత్రిళ్లు జరిగింది. తెల్లవారుజాము వరకు షూట్ చేయడం చాలా కష్టంగా ఉండేది. కానీ మాస్ సాంగ్ కావడంతో బాధను ఇట్టే మరిచిపోయేదాన్ని. ఇలాంటి పాటలంటే నాకు ఇష్టం. నాకు ఈ పాటలో నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది దిశా పటానీ ఆనందాన్ని వ్యక్తం చేసింది.

సల్మాన్ ఖాన్ సహకారం మరువలేనిది

సల్మాన్ ఖాన్ సహకారం మరువలేనిది

గాయాల బాధ నుంచి ఉపశమనం కలుగడానికి సల్మాన్ ఖాన్ మరో కారణం. సెట్స్‌లో చాలా సపోర్ట్ చేశారు. నేను కంఫర్ట్‌గా ఉండేందుకు సల్మాన్ తన వంతు సహకారం అందించారు. అతడి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సూపర్‌స్టార్ అయినప్పటికీ.. ప్రతీ షాట్‌కు న్యాయం చేసేందుకు ప్రయత్నించడం చూస్తే అతడి డెడికేషన్ ఏమిటో అర్ధమైంది అని దిశా పటానీ అన్నారు.

జూన్ 5న విడుదల

భారత్ చిత్రం అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందింది. 2014లో రిలీజైన దక్షిణ కోరియా చిత్రం ఆడ్ టు మై ఫాదర్ అనే సినిమాకు ఇది రీమేక్. కత్రినా కైఫ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని అతుల్ అగ్నిహోత్రి, భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రం రంజాన్ సందర్భంగా జూన్ 5న రిలీజ్ కానున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X