ఆయన చేసిన పనికి అలిసిపోయిన హీరోయిన్.. వైరలవుతోన్న పోస్ట్
'లోఫర్' భామ దిషా పటానీ ఎంతగా ఫేమస్సో అందరికీ తెలిసిందే. సినిమాల పరంగా ఎంత క్రేజ్ తెచ్చుకుందో.. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో అంతకంటే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకుంది. హీటెక్కించే బికీని ఫోటోలను షేర్ చేస్తూ.. కెల్విన్ క్లెయిన్ అనే లోదుస్తుల బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ పోస్ట్ చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

సల్మాన్‌తో కలిసి నటించిన దిషా..
సల్మాన్ ఖాన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన చిత్రం భారత్. ఈ చిత్రంలో సల్మాన్ గెటప్‌లు ఎంతగా ఫేమస్ అయ్యాయో.. పాటలు కూడా అంతే ఫేమస్ అయ్యాయి. సల్మాన్ చిత్రాలంటే.. మ్యూజిక్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమాలోని పాటలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

స్లో మోషన్ అంటూ దిషా స్టెప్పులు..
భారత్ సినిమాలో స్లో మోషన్ అనే పాటకు సల్మాన్ ఖాన్, దిషా పటానీ స్టెప్పులేశారు. ఈ పాట సోషల్ మీడియాలను ఓ ఊపు ఊపేసింది. సల్మాన్ వేసే స్టెప్పులు సోషల్ మీడియాలో సన్సేషన్ క్రియేట్ చేస్తాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటలో దిషా కూడా రెచ్చిపోయి స్టెప్పులేసింది.

మరో సారి జోడిగా..
భారత్ సినిమా అనుకున్నంతగా విజయం సాధించకపోయినా.. వసూళ్లలో దుమ్ములేపింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌కు కూడా మంచి క్రేజే ఏర్పడింది. తాజాగా ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ నటించబోతోన్న రాధే సినిమాలో దిషాను హీరోయిన్‌గా ఎంచుకున్నారు. దీంతో మరోసారి సల్లూ భాయ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది.

ప్రాక్టీస్‌లో గాయపడి అలిసిపోయిన హీరోయిన్..
ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభుదేవా నేతృత్వంలో డ్యాన్స్ చేయడమంటే ఆషామాషి విషయం కాదు. ఆయనలా స్టెప్పులేయం ఎవరి వల్లా కాదు. ఇక ఆయన నేర్పిస్తుంటే.. డ్యాన్స్ నేర్చుకునే ప్రాసెస్‌లో ఒళ్లు హూనం కావాల్సిందే. తాజాగా రాధే సినిమా కోసం ప్రాక్టీస్ చేస్తోన్న దిషా పరిస్థతి కూడా అంతే. డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి చేసి మోకాళ్లకు దెబ్బతగిలాయని తెలిపింది. ఈ మేరకు దిషా ఓ పిక్‌ను పోస్ట్ చేస్తూ.. ప్రభు సర్ స్టెప్స్ నా మోకాళ్లను గాయపరిచాయి.. అంటూ అలసిపోయినట్టుగా గోడకు ఆనుకుని కూర్చుని ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











