For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బికినీ సైజ్ తగ్గించిన హీరోయిన్: ఆ పార్ట్స్ ఫోకస్ అయ్యేలా దారుణంగా!

  |

  దిశా పటానీ అంటే తెలుగులో పెద్దగా తెలికపోవచ్చు. కానీ లోఫర్ సినిమా హీరోయిన్ అంటే అందరు గుర్తుపడతారు. అంతేకాకుండా MS Dhoni చిత్రంలో హీరో లవర్ గా నటించి ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. ఇక లోఫర్ సినిమా తర్వాత తెలుగు తెరకు కనుమరుగైపోయిన దిశా పటానీ బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఆమె నటించిన హిందీ చిత్రాలు హిట్టు కావడంతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే సినిమాల్లో, సోషల్ మీడియాలో తనదైన హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తున్న దిశా పటానీ హాట్ బ్యూటీగా పాపులర్ అవుతోంది. నిత్యం బోల్డ్ పిక్స్ తో అలరించే దిశా తాజాగా మరోసారి మరింత బోల్డ్ గా ఫొటోలు షేర్ చేసింది.

  మోడలింగ్ రంగంలో రాణించి..

  మోడలింగ్ రంగంలో రాణించి..

  సాధారణంగా సినీ హీరోయిన్స్ అందరూ మోడలింగ్ రంగంలో రాణించిన తర్వాతే సినిమాల్లో కథానాయికలుగా తీసుకోబడతారు. అలాంటి వారిలో హాట్ బ్యూటి దిశా పటానీ ఒకరు. మోడలింగ్ రంగంలో తన అందచందాలతో మెస్మరైజ్ చేసింది ఈ బ్యూటి. అతి తక్కువ కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అనేక బ్రాండ్స్​కు అడ్వర్టైజ్​మెంట్​ చేసింది. అందులో ముఖ్యంగా ఇంపీరియల్ బ్లూ యాడ్ తో పాపులర్ అయింది.

  లోఫర్ తో టాలీవుడ్ ఎంట్రీ..

  లోఫర్ తో టాలీవుడ్ ఎంట్రీ..

  ఇంపీరియల్ బ్లూ లిఫ్ట్ యాడ్ లో చీర కట్టుకుని తన సొగసుతో ఆకట్టుకుంది నిశా కళ్ల బ్యూటి దిశా పటానీ. దీంతో ఆమెకు సినిమాలో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తెలుగులో లోఫర్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగా ప్రిన్ వరుణ్ తేజ్ కు సరసన జోడి కట్టింది. ఈ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది దిశా పటానీ.

  ధోనీ బయోపిక్ లో..

  ధోనీ బయోపిక్ లో..

  తన అందచందాలను ఒలకబోసిన లోఫర్ సినిమా అంతగా బాక్సాఫీస్ వద్ద ఆడలేకపోయింది. ఈ సినిమా పరాజయంతో తెలుగులో దిశా పటానీ అంతగా క్లిక్ కాలేదు. చేసేది లేక బాలీవుడ్ బాట పట్టింది దిశా పటానీ. అక్కడ మాత్రం వరుస ఆఫర్లతో రావడంతో తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇక మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంతో బాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

  క్యూట్ స్మైల్ కు ఫిదా..

  క్యూట్ స్మైల్ కు ఫిదా..

  దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. 'మహేంద్ర సింగ్ ధోని' పాత్రలో నటించిన 'MS Dhoni' చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో దిశా పటానీకి మంచి పేరు వచ్చింది. ఇందులో తన నటనకు క్యూట్ స్మైల్ కు యూత్ ఫిదా అయింది. దీంతో బాలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలోనే స్టార్ అయింది దిశా పటానీ. ఫలితంగా వరుసగా 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి సినిమాలు చేసింది.

  ఆకట్టుకోని గ్లామర్..

  ఆకట్టుకోని గ్లామర్..

  బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోయిన దిశా పటానీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది. ఇక ఇటీవల ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో దిశా పటానీతోపాటు తారా సుతారియా మరో హీరోయిన్ గా అలరించగా.. జాన్ అబ్రహం, అర్జున్ కపూర్ హీరోలుగా యాక్ట్ చేశారు. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిశా పటానీ, తారా సుతారియా బీభత్సంగా గ్లామర్ షో ఒలకబోశారు. అదిరిపోయే హాట్ సీన్లతో దిశా పటానీ అలరించిన సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేదు.

   చాలా కాలం తర్వాత..

  చాలా కాలం తర్వాత..

  టాలీవుడ్ కి దూరంగా ఉన్న దిశా పటానీ చాలా కాలం తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబో మూవీ ప్రాజెక్ట్ కె సినిమాలోనూ నటిస్తోంది. ఈ సినిమా ఆమెకు తెలుగులో అవకాశాలు తీసుకొస్తుందో వేచి చూడాలి. ఇలా బాలీవుడ్ లో అనేక చిత్రాలతో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న దిశా పటానీ.. అక్కడ స్టార్ హీరోగా వెలుగొందుతోన్న టైగర్ ష్రాఫ్‌తో చాలా కాలంగా లవ్ ట్రాక్ నడుపుతోంది.

  ఇసుక తిన్నెల్లో అలాంటి పోజు..

  ఇసుక తిన్నెల్లో అలాంటి పోజు..

  ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలతో మెస్మరైజ్ చేసే దిశా పటానీ తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది. ఈ ఫొటోలో బికినీ సైజ్ తగ్గిచి కనువిందు చేసింది. బీచ్ లో టూ పీస్ బికినీ వేసుకున్న దిశా పటానీ అందాలు మెస్మరైజ్ చేస్తున్నాయి. అలాగే స్విమ్మింగ్ పూల్ లో దిగిన పిక్ లో తన బ్యాక్ అందాలు చూపరలను ఆకట్టుకుంటున్నాయి. ఇసుక తిన్నెల్లో దిశా పటానీ అందాలు చూసిన నెటిజన్స్ ఆమెను పొగుడుతూ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

  English summary
  Bollywood Beauty Disha Patani Latest Hot Pics In Two Piece Bikini At Beach And Swimming Pool Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X