మెగా హీరోయిన్‌ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్‌లో సినీ పరిశ్రమ!

బాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లలో దిశా పటానీ ఒకరు. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన యాక్టింగ్ చేస్తూ వరుస ఆఫర్లను పట్టుకుంటోన్న ఈ అమ్మడు.. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో తన గ్లామర్ షోతో ఎంతో మంది అభిమానులను సైతం సంపాదించుకుంది. ఇలా దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దిశా పటానీ ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. పాకిస్థాన్‌కు చెందిన కొందరు ఆమెను టార్గెట్ చేశారు. ఆ వివరాలు మీకోసం!

Photos: Leaked Shocking Pictures of Indian Celebs

మెగా హీరో సినిమాతో సినీరంగ ప్రవేశం

మెగా హీరో సినిమాతో సినీరంగ ప్రవేశం

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన చిత్రం 'లోఫర్'. మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ద్వారానే దిశా పటానీ సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఇందులో తన అందచందాలతో ఆకట్టుకున్న ఆమె.. యాక్టింగ్ పరంగానూ మెప్పించింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా పడడంతో దిశాకు నిరాశనే ఎదురైంది.

కెరీర్‌ను నిలబెట్టిన మహేంద్ర సింగ్ ధోనీ

కెరీర్‌ను నిలబెట్టిన మహేంద్ర సింగ్ ధోనీ


మొదటి సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. ఆ వెంటనే వచ్చిన 'MS Dhoni' మాత్రం దిశా పటానీకి కెరీర్‌ను నిలబెట్టింది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక ఝా అనే పాత్రను పోషించింది. ఇందులో ఆమె కనిపించేది కొద్ది సమయమే అయినా.. అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

మ్యూజిక్ ఆల్బమ్స్.. సినిమాలతో క్రేజ్

మ్యూజిక్ ఆల్బమ్స్.. సినిమాలతో క్రేజ్


'MS Dhoni' తర్వాత దిశా పటానీ వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఆ తర్వాత ఆమె వరుసగా జాకీ చాన్‌ చిత్రం 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. వీటితో పాటు 'బేఫికర్', 'హర్ గూంట్ మైన్ స్వాగ్' అనే మ్యూజిక్ అల్బమ్‌లలోనూ చేసింది. ప్రస్తుతం సల్మాన్ 'రాధే'లో చేస్తోంది.

Recommended Video

Sushant Singh Rajput కూడా Uday Kiran లాగా నే ! ఇద్దరిలో ఒక కామన్‌ పోలిక...!!
బాలీవుడ్ యాక్షన్ హీరో ప్రేమలో పడింది

బాలీవుడ్ యాక్షన్ హీరో ప్రేమలో పడింది

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. తన పర్సనల్ లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది దిశా పటానీ. ఇందులో భాగంగానే బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది. మొదట్లో సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపిన ఈ ఇద్దరూ.. ఈ మధ్య బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తూ బాగా హైలైట్ అవుతున్నారు.

హీరోయిన్ దిశా పటానీ ప్రాణాలకు ముప్పు

హీరోయిన్ దిశా పటానీ ప్రాణాలకు ముప్పు

వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న దిశా పటానీ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే ఎన్నో గ్లామరస్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు కాల్స్ చేసినట్లు ఓ న్యూస్ బాలీవుడ్ సర్కిళ్లలో తెగ చక్కర్లు కొడుతోంది.

పాకిస్థాన్ నుంచి కాల్స్.. ఏకంగా పోలీసులకే

పాకిస్థాన్ నుంచి కాల్స్.. ఏకంగా పోలీసులకే

తాజా సమాచారం ప్రకారం.. దిశా పటానీకి కొందరు వ్యక్తులు చంపుతామని బెదిరింపు కాల్స్ చేస్తున్నారట. అదే సమయంలో ఆమె నివసిస్తున్న ఏరియా పోలీస్ స్టేషన్‌కు సైతం కాల్ చేసి దిశాను ఎవరూ కాపాడలేంటూ వార్నింగ్ ఇస్తున్నారట. దీంతో ఆ కాల్స్‌ ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించారట పోలీసులు. సిగ్నల్స్ ఆధారంగా అవి పాకిస్థాన్ నుంచి వస్తున్నట్లు గుర్తించారని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X