సూర్యతో దిశా పటాని రొమాన్స్.. కంగువ కోసం ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ అంటే?
Kanguva Movie: ఈ ఏడాది సౌత్ ఇండియన్ మూవీ లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో కంగువ ఒకటి. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీలో తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్నారు. హీరో సూర్య సరసన దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే. ఈ మూవీలో నటించడం కోసం హీరోయిన్ దిశా పటానీ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎంత ఎన్ని కోట్ల పారిదోషికం తీసుకుంటుందో మీరు కూడా ఓ లూక్కేయండి.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) కంగువ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విడుదల తేదీ దగ్గర అవుతున్న కొద్దీ దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ చిత్రంగా దర్శకుడు శివ తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ మూవీ నవంబరు 14న రిలీజ్ కానున్న స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు.

మరోవైపు సూర్య 44కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించాడు. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కినట్లు సమాచారం. ఓ గిరిజన యోధుడైన కంగువ 1678 నుంచి ప్రస్తుత కాలానికి వస్తాడు.ఇంతకీ ఆ మిషన్ ఏంటి? ఆ కాలం నుంచి ఈ కాలానికి టైమ్ ట్రావెల్ ఎలా చేశాడు? అనే నేపథ్యంలో భూత,భవిష్యత్తు,వర్తమాన కాలాలతో కథ ఎలా సాగబోతుందోననేదని కంగువ మూవీ.
దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. సూర్య కంగువ మూవీలో దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. సూర్య కంగువ మూవీతో దిశా పటానీ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ కోసం సూర్య తన రెమ్యునరేషన్‌ను దాదాపు ఇరవై కోట్ల వరకు తగ్గించుకున్నట్లు సమాచారం. అంటే.. కేవలం హీరో సూర్య .. రూ. 28 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలిసింది . గతంలో స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో సూర్య చేసిన 24 మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్ కావడంతో ఆ నష్టాలను భర్తీ చేయడానికి హీరో సూర్య తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు.. కంగువ మూవీ కోసం దిశా పటానీ కూడా భారీ మొత్తంలో పారిదోషకం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కంగువలో నటించినందుకు నటి దిశా పటానీ రూ. 5 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కల్కి మూవీ కంటే.. దాదాపు 3 కోట్ల రూపాయాలు ఎక్కువనే దిశా పటానీ తీసుకున్నట్లు చెబుతోన్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీలో ఓ పాటలో దిశా పటాని వేసుకున్న డ్రెస్‌పై అభ్యంతరాలు వచ్చాయి. దీంతో సెన్సాబోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సాంగ్‌లో సూర్యతో దిశా పటాని వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











