మతి పోయింది.. ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు.. సర్వం కోల్పోయా: దిశా పటాని
హాట్ హాట్ అందాలతో 'లోఫర్' భామ దిశా పటానికి వార్తల్లో నిలవడం కొత్తేమీకాదు.. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలను ఆరబోస్తూ వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావడం ఈ అమ్మడి అసలు స్వరూపం. అయితే ఈ సారి గ్లామర్ పరంగా కాకుండా, తన వ్యక్తిగత విషయాన్ని చెప్పి వార్తల్లో నిలిచింది దిశా. ఓ సందర్భంలో తనకు గాయం కావడం కారణంగా సర్వం కోల్పోయానని చెప్పి ఆశ్చర్యానికి గురిచేసిందీ హాట్ బ్యూటీ. ఇంతకీ ఆమెకు ఏం జరిగింది? ఆమె కోల్పోయిందేంటి? వివరాల్లోకి పోతే..

శరీరాకృతి కోసం ప్రత్యేక శ్రద్ద
సినిమాల సంగతి ఎలా ఉన్నా జిమ్ములకు పోవడం, జిమ్నాస్టిక్స్ చేయడం లాంటి వాటి ద్వారా శరీర సౌష్టవాన్ని కాపాడుకుంటూ వస్తుంది దిశా పటాని. ఈ నేపథ్యంలోనే శరీరాకృతి కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటూ జిమ్నాస్టిక్స్ చేస్తున్న సమయంలో పొరపాటున తలకు బలమైన గాయం అయిందని చెప్పింది దిశా పటాని.

మతి పోయింది.. ఆరు నెలల పాటు
తనకు 20 ఏళ్ల వయసు రాకముందే జిమ్నాస్టిక్స్ నేర్చుకునేందుకు కుస్తీ పడుతున్నానని, అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్ లో కూడా ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాని పేర్కొంది దిశా పటాని. అయితే కొద్దీ రోజుల క్రిందట జిమ్నాస్టిక్స్ చేస్తుండగా తలకు గాయం కావడంతో మతి పోయిందని, దాదాపు ఆరు నెలల పాటు థన్ జీవితంలో ఏం జరిగిందో కూడా గుర్తులేదని ఆమె చెప్పుకొచ్చింది. గాయం కారణంగా ఆ సమయంలో సర్వం కోల్పోయానని దిశా పటాని చెప్పింది.
హీరో ప్రేమలో దిశా.. డేటింగ్ వ్యవహారం
ఇక బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్‌తో దిశా పటాని సాగించిన ప్రేమాయణం గురించి అందరికీ తెలుసు. పార్టీలు, ఫంక్షన్లు ఇలా పలు కార్యక్రమాల్లో వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకు తిరగడాలపై బాలీవుడ్ లో పెద్ద చర్చే నడుస్తోంది. కాకపోతే ఈ ఇద్దరూ, తాము స్నేహితులమే తప్ప తమ మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ లేదని పేర్కొన్నారు. ఈ లోగా దిశా డేటింగ్ వ్యవహారం మలుపు తిరిగిందనే వార్తలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఓ యంగ్ పొలిటీషియన్‌తో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి.

సినిమాలు చేస్తూనే.. లో- దుస్తులకు పాపులారిటీ
ఇటీవలే సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన 'భారత్' సినిమాలో నటించింది దిశా పటాని. ఈ సినిమా షూటింగ్‌లో కూడా దిశా జిమ్నాస్టిక్ విన్యాసాలు చేస్తుండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దిశా ఆదిత్య రాయ్ కపూర్ సరసన 'మళంగ్' సినిమాలో నటిస్తోంది. అలాగే కాల్విన్ క్లెయిన్ లో- దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా పాపులారిటీ తెస్తోంది.


Click it and Unblock the Notifications











