ఎరుపెక్కిన దిశా పటానీ అందాలు: బికినీలో ఇంటర్నెట్‌ను హీటెక్కిస్తోంది!
టాలీవుడ్ మూవీ 'లోఫర్' ద్వారా హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టిన ముంబై బ్యూటీ దిశా పటానికి ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డీలా పడటంతో మళ్లీ తెలుగులో అవకాశాలు దక్కలేదు. తర్వాత బాలీవుడ్లో చేసిన ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించలేదు. కెరీర్ ఎలాఉన్న అందాల ప్రదర్శనలో మాత్రం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది.
తాజాగా దిశా పటానీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసిన బికినీ పిక్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎరుపు రంగు బికినీ ధరించి ఇంటర్నెట్‍లో హీట్ పుట్టించింది. కొందరు కుర్రాళ్లు అమ్మడు అందాన్ని పొగిడేస్తున్నా.... మరీ బక్క పలుచగా ఉన్నావంటూ విమర్శలు చేస్తున్నారు.

ఈ ముంబై బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 13 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫోటో పోస్టు చేసిన కొన్ని గంటట్లోనే 882,291 లైక్స్ వచ్చాయి. కొందరు సెక్సీగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తూనే ఇది మన కల్చర్ కాదంటూ సెటైర్లు వేయడం గమనార్హం.
దిశా నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.... ప్రస్తుతం ఆమె సల్మాన్ ఖాన్ మూవీ 'భారత్' లో ట్రాపేజ్ ఆర్టిస్ట్(సర్కస్ కళాకారిణి)గా కనిపించబోతున్నారు. పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 1960 నాటి పోర్షన్‌లో సల్మాన్‌కు జోడీగా కనిపించబోతోంది. ఈ చిత్రంలో కత్రినా కైఫ్, సునీల్ గ్రోవర్, నోరా ఫతేహి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.
త్వరలో దిశా తమిళ దర్శకుడు సుందర్.సి తెరకెక్కించబోయే 'సంఘమిత్ర'లో కూడా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. రూ. 400 కోట్ల బడ్జెట్‌తో రూపొందే ఈ మూవీ రెండు భాగాలుగా ఉంటుందిన సమాచారం.


Click it and Unblock the Notifications











