నేను ప్రతీ రాత్రిని ఆ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాను.. అదే నా బెడ్రూమ్ సీక్రెట్
టాలీవుడ్‌లో లోఫర్ చిత్రంతో అడుగుపెట్టిన దిషా పఠానీ.. కుర్రకారుకు బాగానే దగ్గరైంది. అయితే తెలుగులో మరో అవకాశం రాకపోయేసరికి బాలీవుడ్‌కు చెక్కేసింది. అయితే అక్కడ ప్రేమాయణం నడుపుతూ.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణం..
చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఈ భామ పేరు తెలియని వారెవరూ ఉండరు. టైగర్ ష్రాఫ్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి.. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియాలో వైరల్ అయింది. ఏ వేడుకలో చూసినా వీరిద్దరే ముఖ్యంగా కనిపించేవారు. చేతులో చేయి వేసుకుని గిరగిర తిరిగేవారు.

బ్రేకప్ అయినట్లు వార్తలు..
అయితే పెళ్లి పీఠల వరకు వెళ్తుందనుకున్న వీరి ప్రయాణం.. ఫ్రెండ్‌షిప్ దగ్గరే ఆగిపోయినట్లు తెలుస్తోంది. తమ ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదని కుంబబద్దలు కొట్టారు. అయితే ఎప్పటిలాగే కలుస్తున్నారు. మంచి స్నేహితులమేనని చెప్పుకునే వీరి బంధం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

యాడ్‌లతో ఫేమస్..
బాఘీ2, భారత్ సినిమాలతో హిట్టు తన గ్లామర్‌తో నెట్టుకొస్తున్న ఈ భామ.. సోషల్ మీడియాలో నెటిజన్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది. కెల్విన్ క్లెయిన్ అనే బ్రాండెడ్ లో దుస్తులను ధరించి.. హాట్ ఫోటో షూట్‌లతో మత్తెక్కిస్తూ ఉంటుంది. సినిమాల కంటే.. ఈ బ్రాండ్ దుస్తులను ధరించి తన అందాలను ప్రదర్శించడంలో ఎక్కడా లేని ఫాలోయింగ్ వచ్చేసింది.

అదే బెడ్రూమ్ సీక్రెట్..
తాజాగా మరో బ్రాండ్ వస్తువులకు అంబాసిడర్‌గా మారినట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన యాడ్ షూటింగ్, ఫోటో షూట్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ పోస్ట్ చేస్తూ... నేను ప్రతీ రాత్రిని పోర్టికో ఇండియా అనే బెడ్స్‌తో సెలబ్రేట్ చేసుకుంటానని అదే నా బెడ్రూమ్ సీక్రెట్ అంటూ.. ఓ హాట్ ఫోటోను షేర్ చేసింది.


Click it and Unblock the Notifications











