సముద్రంలో బికినీతో రెచ్చిపోయిన దిశా పటానీ.. అందాల విందుకు ఫ్యాన్స్ ఫిదా!

ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశంలో వార్తల్లో నిలుస్తూ ఉండే దిశా పటాని మళ్లీ వార్తల్లోకెక్కింది. స్విమ్మింగ్ పూల్ లో బికినీతో రచ్చ చేస్తున్న ఒక ఫోటోను ఆమె తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.. హాట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఆ ఫోటోకి ఇప్పుడు కామెంట్ల వరద కురుస్తోంది.

మోడల్ గా మొదలుపెట్టి

మోడల్ గా మొదలుపెట్టి


మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దిశా పటాని తక్కువ సమయంలో తన హాట్ బాడీతో క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయింది.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఈ భామ యాక్టింగ్ పరంగా కూడా అలరించింది. కానీ సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. వెంటనే ఆలస్యం చేయకుండా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ భామ అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంది.

వారానికి ఒక సారయినా

వారానికి ఒక సారయినా


అయితే బాలీవుడ్ కి వెళ్ళాక అక్కడ చేతినిండా సినిమాలు ఉన్నా ఎప్పుడూ వార్తల్లో ఉండాలి అనుకుంటుందో ఏమో తెలియదు కానీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో కనీసం వారానికి ఒక్కసారైనా బికినీ ఫోటో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పటి ఫోటోలు కాకపోయినా ఎప్పటికప్పుడు తీసుకువచ్చి వాటిని షేర్ చేసి ఆమె అభిమానులను అలరిస్తుంది.

నలభై నాలుగు మిలియన్ల ఫాలోవర్స్

నలభై నాలుగు మిలియన్ల ఫాలోవర్స్


రెండేళ్ల క్రితం వచ్చిన సల్మాన్ ఖాన్ భారత్ సినిమాలో హీరోయిన్ గా మెరిసిన ఆమె మొన్నటి సినిమాలో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో మొత్తం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి అని అంటున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ కలిగి ఉన్న ఈ భామ ఇంస్టాగ్రామ్ లో అయితే ఏకంగా నలభై నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకుని రచ్చ చేస్తోంది.

రహస్య ప్రేమ

రహస్య ప్రేమ


అయితే బాలీవుడ్ లో సూపర్ స్టార్ హోదా దక్కించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న టైగర్ ష్రాఫ్ తో ఈ భామ ప్రేమలో పడింది. నిజానికి ఇద్దరూ కలిసి భాగీ 2 అనే సినిమాలో జంటగా నటించారు. ఆ సినిమా కోసం పనిచేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో కొన్నాళ్ళ పాటు రహస్యంగా కొనసాగించారు. అనేక సందర్భాల్లో ఫోటోలు సైతం బయటకు వచ్చినా వీళ్ళిద్దరూ ప్రత్యక్షంగా ఎప్పుడూ తమ ప్రేమ బంధాన్ని ఒప్పుకున్నది లేదు. తాజాగా లాక్ డౌన్ లో వీళ్ళిద్దరూ కలిసి ముంబై పోలీసులకు చిక్కడంతో చర్చనీయాంశంగా మారిన సంగతి గుర్తుండే ఉంటుంది.

Recommended Video

Seeti Maar From Radhe Released - Allu Arjun Reacts | Filmibeat Telugu
బికినీలో ఫోజులు

బికినీలో ఫోజులు


ఇక ఈ భామ తాజాగా షేర్ చేసిన బికినీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. త్రో బ్యాక్ పేరుతో సముద్రంలో బికినీతో ఉన్న ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. దీంతో ఆమె ఫోటోకి పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా వెల్లువలా వచ్చిపడున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X