బికినీతో కుర్రాడి కోరిక తీర్చిన దిశా పటానీ: హాట్ పిక్ అడగ్గానే ఇలా.. అసలు ట్విస్ట్ తెలిస్తే!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది హీరోయిన్లు దీని ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. అదే సమయంలో తమ అందచందాలను చూపిస్తూ కుర్రకారును హుషారెత్తిస్తున్నారు. తద్వారా ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడడంతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ ఒకరు. ఇప్పటికే జాతీయ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న ఈ భామ.. వరుస సినిమాలతో సత్తా చాటుతోన్నా సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ నెటిజన్ కోరిక మేరకు దిశా పటానీ బికినీ ఫొటోను షేర్ చేసింది. అయితే, ఇందులోనే ఓ ట్విస్ట్ ఉంది. అదేంటో మీరూ చూడండి!

అలా మొదలైన దిశా ప్రయాణం

అలా మొదలైన దిశా ప్రయాణం

హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే దిశా పటానీ మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తన అందచందాలతో అందరి ఫోకస్‌ను తన వైపు లాక్కుంది. అలాగే, చాలా బ్రాండ్లకు ప్రచారకర్తగానూ వ్యవహరించింది. ఇలా బిజీగా గడుపుతోన్న సమయంలోనే పూరీ - వరుణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘లోఫర్'తో హీరోయిన్‌గా పరిచయమైంది. కానీ, ఆమెకిది నిరాశనే మిగిల్చింది.

కెరీర్‌కు బ్రేకిచ్చిన ఎంఎస్ ధోనీ

కెరీర్‌కు బ్రేకిచ్చిన ఎంఎస్ ధోనీ

లోఫర్ మూవీతో దిశా పటానీకి సరైనా ఆరంభం దక్కలేదు. దీంతో ఆమె టాలీవుడ్‌కు టాటా చెప్పేసింది. ఈ పరిస్థితుల్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘MS Dhoni' చిత్రంలో ప్రియాంక ఝా అనే పాత్రను చేసిందామె. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు దిశాకు మంచి పేరువచ్చింది. దీంతో ఆమె కెరీర్‌ మారిపోయింది.

అన్నింట్లోనూ ఉంటూ సందడి

అన్నింట్లోనూ ఉంటూ సందడి

చాలా తక్కువ సినిమాలతో బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిన దిశా పటానీ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. ఇప్పటికే ‘కుంగ్‌పూ యోగా', ‘వెల్‌కం టు న్యూయార్క్', ‘భాగీ 2', ‘భారత్', ‘మలాంగ్', ‘భాగీ 3', ‘రాధే' వంటి చిత్రాల్లో నటించింది. వీటితో పాటు మ్యూజిక్ ఆల్బమ్‌లు కూడా చేస్తోంది. ఇలా అన్నింట్లోనూ ఉంటూ ప్రేక్షకులకు మజాను పంచుతూనే ఉంది.

స్టార్ హీరోతో లవ్ ట్రాక్‌తో బిజీ

స్టార్ హీరోతో లవ్ ట్రాక్‌తో బిజీ

వరుసగా సినిమాలు, ఆల్బమ్‌లు చేస్తూ సత్తా చాటుతోన్న దిశా పటానీ, పర్సనల్ లైఫ్‌ను కూడా అదే రీతిలో ఎంజాయ్ చేస్తోంది. దీనికి కారణం ఆమె బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కొన్నేళ్లుగా లవ్ ట్రాక్ నడుపుతుండడమే. మొదట్లో సీక్రెట్‌గా డేటింగ్ నడిపిన ఈ జంట.. కొంత కాలంగా తరచూ టూర్లకు, పార్టీలకు వెళ్తూ లైఫ్‌ను విపరీతంగా ఎంజాయ్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

అందులో మాత్రం ఫుల్ బిజీగా

అందులో మాత్రం ఫుల్ బిజీగా


వరుస ఆఫర్లతో కెరీర్‌ పరంగా ఎంతో సందడి చేస్తూ బిజీ బిజీగా గడుపుతోన్న దిశా పటానీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోన్న విషయం తెలిసిందే. తరచూ ఇందులో అప్‌డేట్లు ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. దీంతో ఆమె ఫాలోవర్లు కూడా పెరుగుతూ ఉన్నారు.

అందాలు ఆరబోస్తోన్న భామ

అందాలు ఆరబోస్తోన్న భామ

దిశా పటానీ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ గురించి తెలిసిందే. స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ ఈ అమ్మడు ఇందులో తన అందచందాలను చూపిస్తూ తెగ సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా తరచూ ఈ స్టార్ హీరోయిన్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. అలాగే, బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న పిక్స్ కూడా వదులుతోంది. ఇలా ఎప్పుడూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూనే ఉంది.

Recommended Video

Salman Khan Kisses Disha Patani | 32ఏళ్ల సినీ కెరీర్ లో ఇదే ఫస్ట్ టైం || Filmibeat Telugu
బికినీ పిక్ అడగ్గానే షేర్ చేసి

బికినీ పిక్ అడగ్గానే షేర్ చేసి

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో దిశా పటానీ నెటిజన్లతో చిట్ చాట్ చేసింది. ఇందులో ఒక కుర్రాడు.. ‘బికినీ ధరించిన పిక్' షేర్ చేయమని ఆమెను కోరాడు. దీంతో వెంటనే ఓ జంతువుకు బికినీ ధరించి ఉన్న ఫొటోను షేర్ చేసింది. తద్వారా సదరు నెటిజన్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇక, దిశా పటానీ టైమింగ్‌కు అందరూ ఫిదా అవుతూ పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X