మళ్ళీ రెచ్చిపోయిన దిశా పటానీ: ఈ సారి సైడ్ లుక్ లో అంతా కనిపించేలా హాట్ ఫోజ!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత కొంత మంది హీరోయిన్లు ఎక్కడా తగ్గడం లేదు. వరుస సినిమా అవకాశాలు వస్తున్నా సరే ఎందుకో తెలియదు కానీ ఇంటర్నెట్‌లో అందాలు ఆరబోస్తూ చర్చనీయాంశంగా మారుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ అయితే దేశానికి బికినీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతోంది. తెలుగు సినిమాతో తెరంగ్రేటం చేసిన ఈ బ్యూటీ.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ హాట్ ట్రీట్ ఇస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా దిశా బికినీలో ఉన్న లుక్ ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ లుక్కేయండి

తెలుగు సినిమాతో తెరంగ్రేటం
చదువుకునే రోజుల్లోనే నటన మీద ఆసక్తితో ముందు మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది దిశా పటానీ. అక్కడ తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ దిశా ఎన్నో వ్యాపార ప్రకటనల్లో నటించడంతో పాటు చాలా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు అంబాసీడర్‌గా కూడా వ్యవహరించింది. అనుకోకుండా వరుణ్ తేజ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' సినిమాతో హీరోయిన్ అవకాశం దక్కించుకుని వెండితెరకు పరిచయం అయింది.

కెరీర్ మార్చేసిన ఎంఎస్ ధోని
అయితే ఈ సినిమా ఆమెకి మాత్రం కలిసి రాలేదు. దీంతో ఆమె బాలీవుడ్ తలుపు తట్టింది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఎంఎస్ ధోని' సినిమాలో ధోని లవర్ అయిన ప్రియాంక ఝా అనే పాత్రను పోషించింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆమె కెరీర్ కి కూడా సినిమాలో ఆమె పాత్ర చనిపోయినా అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

బాలీవుడ్‌లో ఫుల్ బిజీ..
అలా బాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టిలో పడి మంచి అవకాశాలు అందుకుంది. అలా దిశా పటానీ జాకీ చాన్ చిత్రం 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించింది. ఆయా సినిమాల్లో కేవలం తన గ్లామర్ ట్రీట్ ఇవ్వడమే కాదు తనదైన అద్భుతమైన నటనతో అందరి ప్రశంసలను దక్కించుకుంది. అలా ఒకరకంగా బాలీవుడ్‌లో కోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా రచ్చ చేస్తోంది.
సైడ్ లుక్ లో
ఈ మధ్య వరుసగా సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న దిశా పటానీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు, వీడియోలతో రచ్చ చేస్తూ తనకు సంబందించిన అనేక అప్‌డేట్లు ఇస్తుంటుంది. తాజాగా దిశా పటానీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆమె బికినీలో తన ఫోటోను షేర్ చేసింది, అందులో ఆమె చాలా బోల్డ్‌గా కనిపిస్తోంది. ఆమె ఫోటో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో ఆమె సైడ్ లుక్ లో రచ్చ రేపుతోంది.

సినిమాల విషయానికి వస్తే
దిశా సినిమాల గురించి చెప్పాలంటే ఆమె త్వరలో 'ఏక్ విలన్ రిటర్న్స్' చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమెతో పాటు జాన్ అబ్రహం, అర్జున్ కపూర్ మరియు తారా సుతారియా నటించనున్నారు. మోహిత్ సూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కాకుండా, దిశా పటాని సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి 'యోధ' చిత్రంలో కూడా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











