హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. భారీ చిత్రం ఆగిపోయినట్లేనా!

తమిళ సినీ వర్గాల్లో సంఘమిత్ర చిత్రం అత్యంత ఆసక్తి రేపింది. జానపథ కథతో ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించాలని భావించారు. మొదటగా ఈ చిత్రాన్ని శృతి హాసన్ ని హీరోయిన్ అనుకున్నారు. శృతి హ్యాండ్ ఇవ్వడంతో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానిని ఎంపిక చేసుకున్నారు. ఇక ఈ చిత్రం పట్టాలెక్కడం ఖాయం అని అంతా భావిస్తున్న తరుణంలో భారీ షాక్ తగిలింది. ఈ చిత్రం ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి.

ఇంత వరకు ప్రీ ప్రొడక్షన్ పనులే మొదలు కాకపోవడం దీనికి కారణం. దిశాపటాని తాజా వ్యాఖ్యలు కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూరేలా చేస్తున్నాయి. తాజగా ఓ ఇంటర్వ్యూ లో దిశా పటాని మాట్లాడుతూ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ప్రస్తావించింది. సౌత్ లో ఓ భారీ చిత్రానికి సైన్ చేశా. కానీ అది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు అని సంఘమిత్ర చిత్రాన్ని ఉద్దేశించి కామెంట్స్ చేసింది.

Disha patani shocking comments on Sangamithra movie

శృతి హాసన్ ఈ చిత్రం కోసం కొన్ని రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకుంది కూడా. కానీ అనుకోని కారణాల వలన ఈ చిత్రం నుంచి తప్పుకుంది. ఆ తరువాత దిశాని ఎంపిక చేశారు. భారీ పోరాట సన్నివేశాలు, గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని నిర్మించాలని భావించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X