సల్మాన్ ఖాన్ సరసన వరుణ్ తేజ్ హీరోయిన్!
Recommended Video

కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం భారత్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా జహీర్ అబ్బాస్ దర్శత్వంలో తెరకెక్కుతోంది. బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం మొదట అందాలతార ప్రియాంక చోప్రాని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ నిక్ జోనస్ తో వివాహ కార్యక్రమాల్లో ఉన్న ప్రియాంక ఈ చిత్రం నుంచి తప్పుకుంది.
ప్రియాంక స్థానంలోకి కత్రినా కైఫ్ వచ్చింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రియల్ లైఫ్ లో కూడా వీరిద్దరూ కొంతకాలం ప్రేమికులుగా ఉన్నారు. విడిపోయిన తరువాత కూడా స్నేహితులుగా కొనసాగుతన్నారు.

ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం మరో హీరోయిన్ కు అవకాశం ఉంది. ఆ రోల్ కోసం దిశా పటానిని ఎంపిక చేసుకున్నట్లు చిత్ర దర్శకుడు జహీర్ అబ్బాస్ ప్రకటించారు. దిశా పటాని కూడా బాలీవుడ్ మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. సల్మాన్ ఖాన్ చిత్రంలో నటించనుండడం ఆమెకు మంచి అవకాశం అని చెప్పొచ్చు. దిశా పటాని మొదట టాలీవుడ్ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన ఏకైక తెలుగు చిత్రం వరుణ్ తేజ్ నటించిన లోఫర్.


Click it and Unblock the Notifications











