అండర్ వేర్లో హీరోయిన్... రెక్కలు కట్టుకుని వాలిపోయిన ఫ్యాన్స్!
Recommended Video

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కొన్ని రోజులుగా బికినీ ఫోటోలతో సోషల్ మీడియాలో వేడి రాజేస్తున్న సంగతి తెలిసిందే. కాల్విన్ క్లెయిన్ అనే లింగరీ బ్రాండ్ ప్రమోట్ చేస్తున్న ఈ హీరోయిన్ ఆ బ్రాండ్ అండర్ వేర్ ధరించిన ఫోటోలు పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
తాజాగా ఢిల్లీలోని డిఎల్ఎఫ్ మాల్‌లో కొత్తగా కాల్విన్ క్లెయిన్ అండర్‌వేర్ స్టోర్ ప్రారంభం సందర్భంగా దిశా పటానీ హాజరయ్యారు. తాను వస్తున్న విషయాన్ని ముందే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనౌన్స్ చేయడంతో పాటు ఆ బ్రాండ్ అండర్ వేర్ ధరించి... ఓ హాటో ఫోస్ట్ చేశారు.

బికినీ ఫోటోతో అభిమానులకు ఆహ్వానం
ఢిల్లీ డిఎల్ఎఫ్ మాల్‌లో నా ఫేవరెట్ కాల్విన్ క్లెయిన్ అండర్ వేర్ స్టోర్ ప్రారంభించడానికి వస్తున్నాను. అక్కడ మీ అందరినీ చూడటానికి ఆశ పడుతున్నాను... అంటూ బికినీ ఫోటోతో దిశా పాటానీ తన అభిమానులను ఆహ్వానించింది.
రెక్కలు కట్టుకుని వాలిపోయిన ఫ్యాన్స్
దిశా పటానీ బికినీ పోస్ట్ ఎఫెక్టుతో ఆమెను చూసేందుకు ఢిల్లీ డిఎల్ఎఫ్ మాల్‌కు భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. తన కోసం ఇంత మంది రావడంపై ఆనందం వ్యక్తం చేస్తూ దిశా ఓ వీడియోను షేర్ చేశారు.

సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్
దిశా పటానీ పోస్ట్ చేసిన కాల్విన్ క్లెయిన్ బికినీ పోస్టులకు అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బికినీ ఫోటోకు 1.5 మిలియన్ పైగా లైక్స్ రాగా, స్టోర్ ఓపెనింగ్ వీడియోను దాదాపు 10 లక్షల మంది వీక్షించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను దాదాపు కోటి యాభై లక్షల మంది ఫాలో అవుతున్నారు.

దిశా పటానీ
దిశా పటానీ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె అలి అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భారత్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె రాధా సర్కస్ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ హీరో. 2019 ఈద్‌కు ఈ మూవీ విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











