బికినీకి కొత్త దిశ.. అందాల ఆరబోతతో ఉర్రూతలూగిస్తున్న పటాని!

మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ 2015లో రూపొందించిన లోఫర్ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన కథానాయిక దిశా పటానీ తెలుగులో అనుకున్నంత విజయవంతం కాలేకపోయింది. ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో దిశను తెలుగులో ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆమె బాలీవుడ్‌పైనే పూర్తిగా దృ‌ష్టి సారించింది. బాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుని అనతి కాలంలోనే మంచి గుర్తింపు దక్కించుకుంది.

 సోషల్ మీడియాలో అందాల విందు

సోషల్ మీడియాలో అందాల విందు

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ దిశ తనదైన శైలిలో రచ్చ చేస్తుంటుంది. నెట్టింట ఆమె చేసే అందాల ప్రదర్శనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా జీరో సైజ్ బాడితో ఆమె బికినీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయింది. బికినీ ధరించి దిశ చేసే అందాల విందు ఓ రేంజ్‌లో ఉంటుంది. తన హాట్ హాట్ ఫొటోలతో దిశ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన సినిమా, ఫోటో షూట్స్, విహార యాత్రలకు సంబంధించిన పోటోలను దిశ ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంటుంది.

ఫిట్‌నెస్ ఫ్రీక్

ఫిట్‌నెస్ ఫ్రీక్


సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ దిశ తన ఫిట్‌నెస్ విషయంలో ఏ మాత్రం రాజీపడదు. ట్రైనర్ సాయంతో దిశ గంటల కొద్ది వ్యాయామం చేస్తూ జిమ్‌లో చెమటోడుస్తుంటుంది. యోగా కూడా దిశ దినచర్యలో భాగమే. వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను కూడా దిశ అభిమానులతో పంచుకుంటుంది. పర్‌ఫెక్ట్ జీరో సైజ్ బాడీ మెయింటైన్ చేస్తుండడంతో ఓ ప్రముఖ లో దుస్తుల కంపెనీ తన బ్రాండ్ అంబాసిడర్‌గా దిశను నియమించుకుంది. ఆ లోదుస్తులతో దిశ చేసే అందాల విందు సోషల్ మీడియాలో మంటలు రేపుతుంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

దిశ పటానీ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు దిశ నేరుగా అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. వారు అడిగే హాట్ ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిస్తుంటుంది. కొందరు అసభ్యకర ప్రశ్నలు వేసినా కోపం తెచ్చుకోకుండా కూల్‌గానే ఆన్సర్లు చెబుతుంటుంది. ఇలా సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ లోఫర్ భామ ఇంటర్నెట్‌ మీడియాకు హీటెక్కించింది.

తాజాగా వైట్ బికినీతో హల్‌చల్

తాజాగా వైట్ బికినీతో హల్‌చల్


తాజాగా దిశా పటానీ తన సోషల్ మీడియా ఖాతాల్లో బికినీ పోటోలను పోస్ట్ చేసింది. వైట్ బికినీలో అందాలు ఆరబోస్తూ అభిమానులకు దిశ కనువిందు చేసింది. అద్దం ముందు నిల్చుని జీరో సైజ్ బాడితో ఉన్న దిశ చాలా చాలా అందంగా ఉంది. ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి లైకులు, కామెంట్లు భారీగా వస్తున్నాయి. అయితే దిశా ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

 సినిమాలతో బిజీ బిజీ

సినిమాలతో బిజీ బిజీ


బాలీవుడ్ అగ్ర హీరోలతో ఆడిపాడుతున్న దిశ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ రూపొందిస్తున్న యాక్షన్ డ్రామా యోధ షూటింగ్‌ను దిశ ఇటీవలె పూర్తి చేసింది. ఇక, మోహిత్ సూరి దర్శకత్వంలో జాన్ అబ్రహమ్, అర్జున్ కపూర్‌లతో దిశ కలిసి నటించిన ఏక్ విలన్-2 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అలాగే మరొకొన్ని సినిమాలు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే వాటి గురించి అధికారిక ప్రకటనలు రాబోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X