అరాచకమైన హాట్ ఫొటోను వదిలిన దిశా పటానీ: అబ్బో బికినీలో శృతి మించి.. ఇలా చూస్తే తట్టుకోగలరా!

గతంలో సినిమాల్లో నటిస్తేనే హీరోయిన్లంతా ప్రేక్షకులను, ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉండేవాళ్లు. అయితే, ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మూవీలు వచ్చినా రాకపోయినా నిత్యం సందడి చేస్తూనే ఉన్నారు. తద్వారా ఫాలో అయ్యే వాళ్లకు మజాను పంచుతున్నారు. ఈ జాబితాలోకే వస్తుంది బాలీవుడ్ హాట్ హీరోయిన్ దిశా పటానీ. ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న ఈ బ్యూటీ.. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ అందాల విందు చేస్తూ తెగ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా దిశా పటానీ ఓ హాట్ బికినీ ఫొటోను షేర్ చేసింది. తద్వారా ఇంటర్నెట్‌ను విపరీతంగా షేక్ చేసి పడేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం? ఆ పిక్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి!

తెలుగు సినిమాతోనే కెరీర్ మొదలు

తెలుగు సినిమాతోనే కెరీర్ మొదలు

చిన్న వయసులోనే దిశా పటానీ మోడలింగ్ రంగంలోకి అడగు పెట్టింది. అందులో పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో అందరినీ తన వైపునకు తిప్పుకుంది. అదే సమయంలో నేషనల్, ఇంటర్నేషనల్ సంస్థలకు చెందిన ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరిస్తూ వ్యాపార ప్రకటనల్లోనూ నటించింది. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'లోఫర్' అనే సినిమాతో హీరోయిన్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఈ మూవీ ఆమెకు నిరాశనే మిగిల్చింది. కానీ, నటిగా మంచి పేరును సంపాదించింది. దీని తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదామె.

ఆ చిత్రంతో మారిపోయిన దిశ కెరీర్

ఆ చిత్రంతో మారిపోయిన దిశ కెరీర్

మొదటి చిత్రం 'లోఫర్' సరిగా ఆడకపోవడంతో దిశా పటానీకి మంచి స్టార్ట్ లభించలేదు. దీంతో ఆమె పని అయిపోయినట్లే అని అంతా అనుకున్నారు. కానీ, సరిగ్గా అలాంటి సమయంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంలో అత్యంత ముఖ్యమైన ప్రియాంక ఝా పాత్రను పోషించింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆమె కెరీర్‌ మారిపోయింది. ఇందులో దిశా కనిపించింది కాసేపే అయినా మంచి పేరును సంపాదించుకుంది. ఫలితంగా బాలీవుడ్‌లో ఆమె పేరు మారుమ్రోగిపోయింది.

బాలీవుడ్‌లో స్టార్.. అందరితో చేస్తూ

బాలీవుడ్‌లో స్టార్.. అందరితో చేస్తూ


బాలీవుడ్‌లో మొదటి చిత్రమే సక్సెస్ అవడంతో దిశా పటానీకి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే ఆమె వరుసగా 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. వీటిలో అందచందాలతో పాటు అద్భుతమైన నటనతో ప్రశంసలను దక్కించుకుంది. తద్వారా ఈ బ్యూటీ బాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయి సత్తా చాటుతోంది. సినిమాలే కాదు.. 'బేఫికర్', 'హర్ గూంట్ మైన్ స్వాగ్' అనే మ్యూజిక్ అల్బమ్‌లలోనూ చేసి అలరించింది.

ఆ స్టార్ హీరోతో లవ్వాట.. ఎంజాయ్

ఆ స్టార్ హీరోతో లవ్వాట.. ఎంజాయ్

బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ చాలా కాలంగా ఫుల్ ఫామ్‌లో కనిపిస్తోంది దిశా పటానీ. అదే సమయంలో తన పర్సనల్ లైఫ్‌ను కూడా తెగ ఎంజాయ్ చేస్తోంది. దీనికి కారణం ఈ సుందరాంగి బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తోండడమే. మొదట్లో సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపిన ఈ జంట.. ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇందులో భాగంగానే తరచూ టూర్లకు, పార్టీలకు వెళ్తూ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు, పెళ్లి వార్తలతోనూ వీళ్లిద్దరూ హైలైట్ అవుతున్నారు.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా


కొంత కాలంగా సినిమాల మీద సినిమాలు.. మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోన్న దిశా పటానీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే ఒకింత ఎక్కువగానే తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో తరచూ అప్‌డేట్లు ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. అలాగే, తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటోందీ హీరోయిన్. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

ఎక్కువగా అలాంటివే వదులుతూ

ఎక్కువగా అలాంటివే వదులుతూ


మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే దిశా పటానీ మామూలు అప్‌డేట్లతో సరిపెట్టుకోదు. తన వ్యక్తిగత విషయాలను వెల్లడించడంతో పాటుగా ఎంతో బోల్డుగా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో చాలా కాలంగా రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన ప్రియుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న.. వీకెండ్‌లను కలిసి జరుపుకుంటోన్న.. సీక్రెట్‌గా మీట్ అయిన వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలతో తెగ హాట్ టాపిక్ అవుతోంది. అలాగే తనకు సంబంధించిన హాట్ హాట్ పిక్స్, వీడియోలను సైతం వదులుతూ దిశా ఇంటర్నెట్‌ను తెగ షేక్ చేసేస్తోంది.

Recommended Video

Seeti Maar From Radhe Released - Allu Arjun Reacts | Filmibeat Telugu
బికినీలో అందాల విందు చేసింది

బికినీలో అందాల విందు చేసింది


ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ ఉండే స్టార్ హీరోయిన్ దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్యాగ్రౌండ్‌లో సముద్రం కనిపించేలా బికినీ ధరించి నిల్చుని ఉంది. ఇందులో ఆమె అందాలు మొత్తం కనువిందు చేస్తున్నాయి. అంతేకాదు, ఘాటు ఫోజుతో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ అందరినీ మాయ చేసేస్తుంది. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి ఎవరూ ఊహించని రీతిలో స్పందన వస్తోంది. దీంతో దిశా పటానీ షేర్ చేసిన ఈ పిక్ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X