మళ్లీ రెచ్చిపోయిన దిశా పటానీ: ఈ సారి బట్లలేమీ లేకుండానే యమ ఘాటుగా!
చూపు తిప్పుకోకుండా చేసే అందం.. అద్భుతమైన నటన.. అన్నింటికీ మించి గ్లామర్ ట్రీట్ ఇస్తూ చాలా కాలంగా బాలీవుడ్‌లోనే తన మార్కును చూపిస్తూ దూసుకుపోతోంది హాట్ బ్యూటీ దిశా పటానీ. ఏమాత్రం అంచనాలు లేకుండానే హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ సమయంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకుని విశేషమైన గుర్తింపును అందుకుంది. అలాగే, ఫాలోయింగ్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకుంది. ఫలితంగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ దిశా పటానీ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా లుక్కేయండి!

తెలుగు సినిమాతో మొదలైంది
టీనేజ్‌లోనే దిశా పటానీ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తన అందచందాలతో అందరినీ మాయ చేసిన ఈ భామ.. ఇండియా మొత్తం తెలిసేంత పెద్ద మోడల్‌గా ఎదిగిపోయింది. దీంతో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కంట్లో పడడంతో వరుణ్ తేజ్‌తో తెరకెక్కించిన 'లోఫర్' సినిమాతో ఆమెను పరిచయం చేశాడు. కానీ, ఇది అంతగా ఆడలేదు.

బయోపిక్‌తో కెరీర్ మారిందిగా
'లోఫర్' మూవీతో దిశా పటానీకి గ్రాండ్ స్టార్ట్ దక్కలేదు. దీంతో ఆమె టాలీవుడ్‌కు టాటా చెప్పేసింది. సరిగ్గా అలాంటి సమయంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంతో బాలీవుడ్ ఆఫర్‌ను అందుకుంది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆమెకు గుర్తింపును.. మరిన్ని అవకాశాలను తీసుకుని వచ్చింది.

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా
దిశా పటానీ బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఫలితంగా ఇప్పటికే 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. వీటిలో గ్లామర్‌తో పాటు అద్భుతమైన నటనతో ప్రశంసలను అందుకుంది. తద్వారా బాలీవుడ్‌లో హవాను చూపిస్తూ ముందుకు సాగుతోంది.

స్టార్ హీరోతో డేటింగ్ చేస్తోంది
సినిమాల పరంగా ఎంతో ఫామ్‌లో ఉన్న బాలీవుడ్ భామ దిశా పటానీ.. స్టార్ హీరో టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణం సాగిస్తోన్న విషయం తెలిసిందే. ఆరంభంలో అతడితో సీక్రెట్‌గా వ్యవహారం నడిపిన ఈ భామ.. ఆ తర్వాత విషయం బయటకు రావడంతో ఓపెన్ అయిపోయింది. ఇక, అప్పటి నుంచి అతడితో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే పెళ్లికి సైతం రెడీ అయిపోతోంది.

అక్కడ మాత్రం ఫుల్ బిజీగానే
వరుస పెట్టి సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్‌లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోన్న దిశా పటానీ.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తరచూ ఏవో కొన్ని అప్‌డేట్లు ఇస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుని ఫాలోవర్ల సంఖ్య కూడా పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తూ రచ్చ
సుదీర్ఘ కాలంగా దిశా పటానీ బోల్డుగా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన ప్రియుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అలాగే తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తద్వారా ఇంటర్నెట్‌ను తన అందాలతో దిశా పటానీ షేక్ చేసేస్తోంది.

హాట్ ఫొటోను షేర్ చేసేసింది
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బట్టలు లేకుండా కేవలం లోదుస్తులను మాత్రమే ధరించి ఫొటోకు ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె అందాలు మొత్తం కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











