ఘాటైన అందాలతో ఒంట్లో వేడి పుట్టిస్తున్న లోఫర్ బ్యూటీ.. దిశా పటానీ లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్
పూరి జగన్నాథ్ హీరోయిన్లంటే మార్కెట్‌లో ఓ క్రేజ్ ఉంటుంది. హీరోలకు ఎలా అయితే సపరేట్ మ్యానరిజం, యాటిట్యూడ్ ఇచ్చి స్క్రీన్ మీద నిలబెడతాడో.. హీరోయిన్లకు సైతం అంతే స్థాయిలో క్యారెక్టరైజేషన్ ఇస్తాడు. స్క్రీన్ మీద ప్రత్యేకంగా చూపిస్తుంటాడు. పూరి జగన్నాథ్ తన హీరోయిన్లను ఎంత అందంగా చూపిస్తాడో.. నటనకు కూడా అంతే స్కోప్ ఇస్తుంటాడు. అలాంటి పూరి దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో దిశా పటానీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా దిశా పటానీ వదిలిన ఫోటోల వివరాల్లోకి వెళితే..

లోఫర్ బ్యూటీ..
వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాలో దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. సినిమా అంతగా ఆడకపోయిన పాటలు, పిక్చరైజేషన్, దిశా పటానీ అందాలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. కానీ దిశా పటానీకి మాత్రం తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు.

బాలీవుడ్‌లో ఆఫర్లు..
దిశా పటానీ ఆ తరువాత బాలీవుడ్‌లో సెటిలైంది. ఇక్కడి వర్షం సినిమాను అక్కడ భాఘీ అని తీయగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందులో టైగర్ ష్రాఫ్, దిశా పటానీ నటించి హిట్ కొట్టేశారు. అలా ఈ ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. అది ప్రేమగా మారింది.

పెళ్లి రూమర్లు..
టైగర్ ష్రాఫ్, దిశా పటానీ మధ్య ప్రేమ వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్న ఈ జంట ఎక్కడికి వెళ్లినా జంటగా కనిపిస్తున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని గాసిప్స్ వినిపిస్తుంటాయి. ఆ మధ్య ఈ ఇద్దరూ విడిపోయారని, కేవలం స్నేహితులుగానే కంటిన్యూ అవుతున్నారంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. ఇలాంటి వార్తల మధ్య దిశా పటానీ వదలిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అందాల ప్రదర్శన..
దిశా పటానీ అందాల ప్రదర్శన పీక్స్‌లో ఉంటుంది. ఆమె లో దుస్తులు వేసుకుని చేసే ప్రదర్శన ఇచ్చే యాడ్స్ మూములుగా ఉండవు. కెల్విన్ క్లైన్ లో దుస్తులు వేసుకుని ఆమె చేసే ఎక్స్ పోజింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ మధ్య కాస్త తగ్గించినట్టు అనిపించినా మళ్లీ అందాల ఆరబోతను మొదలుపెట్టేసింది.

షాక్ అయిన టైగర్ సోదరి..
టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్‌తో దిశాకు మంచి రిలేషన్ ఉంది. కరోనా సమయంలో ఈ ముగ్గురూ కలిసి ఒకే రూంలో ఉన్నారంటూ కథనాలు వచ్చాయి. అయితే తాజాగా దిశా షేర్ చేసిన ఫోటోలను చూసి టైగర్ సోదరి అవాక్కైనట్టుంది. ఒంట్లో వేడిపుట్టిస్తున్నావ్ అన్నట్టుగా అర్థం వచ్చే ఎమోజీలను షేర్ చేసింది.


Click it and Unblock the Notifications











