Divi Vadthya గోవా ట్రిప్‌లో హాట్ హాట్‌గా.. పొట్టి దుస్తుల్లో బీచ్‌ను హీటెక్కించిన బిగ్‌బాస్ బ్యూటీ

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో అందాల భామ దివి వద్యా జీవితాన్నే మార్చివేసింది. కొన్ని వారాలపాటు బిగ్‌బాస్ తెలుగు 4లో తన అందచందాలతో ఆకట్టుకొన్న దివి బుల్లి తెర ప్రేక్షకులనే కాకుండా సెలబ్రిటీలను, సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. ఇక బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దివి కెరీర్ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగిపోయింది. వరుసగా సినిమాలతో బిజీగా ఉంటూనే తాజాగా గోవాలో తన అందచందాలతో మరోసారి దివి ఆటకొట్టుకొన్నది. బిగ్‌బాస్ బ్యూటీ దివి వద్యా గురించి వివరాల్లోకి వెళితే..

Recommended Video

Bigg Boss నుండి వచ్చాక కెరీర్ ఉండదు అంటారు.. కానీ Divi Vadthya విషయం లో ఇది తప్పు
మహర్షి సినిమా తర్వాత బిగ్‌బాస్‌లోకి

మహర్షి సినిమా తర్వాత బిగ్‌బాస్‌లోకి

దివి వద్యా మోడలింగ్ ద్వారా తన కెరీర్ ఆరంభించింది. మోడల్‌గా రాణిస్తున్న సమయంలోనే కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన మహర్షి చిత్రం ద్వారా నటిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు 4లో రాణించిన తర్వాత క్రేజీ సెలబ్రిటీ‌గా మారిపోయింది. ఆ తర్వాత వరుసు అవకాశాలను దక్కించుకొంటూ.. వెబ్ సిరీస్, సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు.

 బిగ్‌బాస్ తర్వాత హాట్ హాట్‌గా

బిగ్‌బాస్ తర్వాత హాట్ హాట్‌గా

బిగ్‌బాస్ తెలుగు 4 తర్వాత దివి వద్యా నటించిన క్యాబ్ స్టోరీస్ ఓటీటీలో రిలీజైంది. ఇటీవల నయీం డైరీస్ అనే చిత్రంలో అతిథి పాత్రలో హాట్ హాట్‌గా నటించింది. దివి అందాల ఆరబోత వివాదాస్పదంగా మారింది. నయీం డైరీస్‌లో మోతాదు మంచి గ్లామర్‌ను ఒలకబోసిందనే విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంకా ఇటీవల పలు చిత్రాల్లో నటించగా.. అవి రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి.

బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ ఆఫర్..

బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ ఆఫర్..

ఇక తెలుగులో తొలిసారి ప్రవేశపెడుతున్న బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలో పాల్గొంటున్నట్టు దివి వద్యా పేరు వినిపించింది. అయితే నిర్వాహకులు సంప్రదించినప్పటికీ.. దివి వారి ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటం కారణంగా బిగ్‌బాస్ ఓటీటీ ఆఫర్‌ను తిరస్కరించినట్టు తెలిసింది. దాంతో బిగ్‌బాస్ ఓటీటీ ఫస్ట్ సీజన్‌లో దివి కనిపించే అవకాశాలు లేవని సినీ వర్గాలు వెల్లడిస్తున్నారు.

 సోషల్ మీడియాలో హల్‌చల్

సోషల్ మీడియాలో హల్‌చల్

సోషల్ మీడియాలో దివి వద్యా తన బ్యూటీఫుల్ ఫోటోలు పెడుతూ ట్రెండింగ్‌గా మారుతున్నది. ఇటీవల కాలంలో కురచ దుస్తులు, పొట్టి పొట్టి డ్రస్సులతో అందాలను యదేచ్ఛగా ఆరబోస్తున్నది. ఆమె హాట్ హాట్ ఫోటోలు ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో దివి అందాలను చూస్తూ అభిమానులు, నెటిజన్లు ఘాటైన కామెంట్లు సంధిస్తున్నారు.

 గోవా బీచుల్లో ఫోటోలు హాట్ హాట్‌గా

గోవా బీచుల్లో ఫోటోలు హాట్ హాట్‌గా


కరోనావైరస్ ధర్డ్ వేవ్ శాంతించడంతో దివి వద్యా గోవాలో విహారయాత్రతో సోషల్ మీడియాను వేడెక్కించింది. గోవా బీచుల్లో అర్ధనగ్నంగా దిగిన ఫోటోలు నెటిజన్లు విశేషంగా ఆకర్షించాయి. డెనిమ్ షార్ట్స్, టీషర్ట్‌లో కనిపిస్తూ దిగిన ఫోటోలను ఆమె తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేయగా వైరల్ అయ్యాయి. ఆమె ఫోటో స్టిల్స్ స్టన్నింగ్‌గా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

చిరంజీవి గాడ్‌ఫాదర్‌ చిత్రంలో

చిరంజీవి గాడ్‌ఫాదర్‌ చిత్రంలో

దివి వద్యా సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్‌ఫాదర్ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. బిగ్‌బాస్ తెలుగు 4 ఫైనల్‌కు అతిథిగా హాజరైన చిరంజీవి తన సినిమాలో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తన హామీని నిలబెట్టుకొని గాడ్‌ఫాదర్ చిత్రంలో మంచి పాత్రను ఇవ్వడం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X