పుష్ప 2లో బిగ్ బాస్ పిల్లకు పెద్ద రోల్.. ఠాగూర్ సినిమాను గుర్తు చేసేలా!
టాలీవుడ్ నుంచి చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే పాన్ ఇండియా రేంజ్‌లో ప్రభావాన్ని చూపిస్తున్నారు. అలాంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతలా అతడు తనదైన నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకోవడంతో పాటు 'పుష్ప ది రైజ్' చిత్రంతో నేషనల్ స్టార్ అయ్యాడు. దీంతో మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమే 'పుష్ప ది రైజ్'. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'పుష్ప ది రూల్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని రూపొందిస్తున్నారు.

సెన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'పుష్ప ది రూల్' మూవీకి సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎంతో జోష్‌తో జరుపుతోంది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేసి ఆగస్టు 15న విడుదల చేయాలని ఏర్పాట్లు చేశారు. కానీ, దీన్ని డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు.
'పుష్ప ది రూల్'పై ఉన్న హైప్‌కు అనుగుణంగానే దీని నుంచి అప్‌డేట్లు కూడా వస్తున్నాయి. ఇలా ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ వీడియోకు, మొదటి పాటకు అదిరిపోయే స్పందన కూడా వచ్చింది. దీనికితోడు ఈ చిత్రం నుంచి తరచూ ఏదో ఒక వార్త బయటకు వస్తోంది. ఇలా తాజాగా ఇందులో కీలక పాత్రను చేస్తున్న దివి వాధ్యా రోల్ గురించి న్యూస్ లీకైంది.

హై రేంజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'పుష్ప ది రూల్' మూవీలో బిగ్ బాస్ ఫేం దివి వాధ్యా జర్నలిస్ట్ పాత్రను చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె పుష్ప రాజ్ గురించి కీలక సమాచారం సేకరిస్తుందట. ఆమెకు అంతలా దర్శకుడు ప్రాధాన్యం ఇచ్చాడని తెలిసింది. ఒకరకంగా చెప్పాలంటే దివి సీన్స్ 'ఠాగూర్'లో ప్రకాశ్ రాజ్ పాత్రను గుర్తు చేసేలా ఉంటాయని తెలిసింది. దీంతో ఆమె రోల్‌పై ఆసక్తి పెరిగిపోతోంది.
ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











