For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Divi Vadthya చీరకట్టుతో అదరగొట్టిన బిగ్‌బాస్ బ్యూటీ.. తెల్లచీరలో తకధిమి అంటూ .. లేటెస్ట్ ఫొటోషూట్ వైరల్

  |

  బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోతో బుల్లితెర, సినీ ప్రేక్షకులకు చేరువైన దివి వద్యా ఆ తర్వాత తెలుగు వినోద పరిశ్రమలో అద్బుతంగా రాణిస్తున్నది. పలు చిత్రాల్లో తనదైన అందం, అభినయంతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది. వరుస ఆఫర్లను అందుకొంటూ కెరీర్ గ్రాఫ్‌ను పైపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. సమయం చిక్కితే ఫోటోషూట్లతో అభిమానులకు, ప్రేక్షకులకు గ్లామర్ ట్రీట్ పంచుతున్నది. తాజా చీరకట్టులో ఫోటోషూట్‌తో దివి వద్యా ఏ రేంజ్‌లో హీట్ ఎక్కించింది? దివ వద్యా వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలు ఎలా ఉన్నాయనే విషయంలోకి వెళితే..

  ఎంటెక్ తర్వాత మోడలింగ్

  ఎంటెక్ తర్వాత మోడలింగ్

  దివి వద్యా ఎంటెక్ పూర్తి చేసిన తర్వాత వినోద పరిశ్రమలోకి రావాలని గట్టిగా నిర్ణయించుకొన్నారు. అయితే తన తల్లిదండ్రులు పెళ్లి చేసి పంపించాలని అనుకొన్నప్పుడు తన మనసులోని కోరికను వారి ముందు పెట్టడం, ఆమె అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగుపెట్టేందుకు అంగీకరించారు. ఆ నేపథ్యంలో దివి తొలుత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు.

  బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌తో

  బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌తో

  దివి వద్యా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంలో దర్శకుడు కొరటాల శివ అవకాశం ఇవ్వడంతో సినీ ఎంట్రీ జరిగిపోయింది. ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 4వ సీజన్‌లోకి రావడంతో ఎవరీ బ్యూటీ అంటూ ఆమె గురించి వెతకడం ప్రారంభించారు. ఇక బిగ్‌బాస్ తెలుగు 4తో దివి వద్యా తన ప్రతిభతో, తన అందంతో ప్రేక్షకుల్లో ఆకట్టుకోవడంతో ఆమె భారీగా ఫాలోవర్స్ సంపాదించుకొన్నారు.

  దివి వద్యాకు చిరంజీవి ఆఫర్

  దివి వద్యాకు చిరంజీవి ఆఫర్

  బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షోలో కనిపించిన తర్వాత సాధారణ ప్రేక్షకులనే కాకుండా మెగాస్టార్ చిరంజీవి లాంటి ప్రముఖులను ఆకట్టుకొన్నారు. దివి అందం, అభినయం చూసి ఏకంగా తన చిత్రంలో నటించే అవకాశాన్ని చిరంజీవి అందించారు. బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌ ఫినాలే సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చుకొన్న చిరంజీవికి ధన్యవాదాలు తెలుపుకొన్నారు. దాంతో దివి వద్యాకు మరింత పాపులారిటీ పెరిగింది. సోషల్ మీడియాలో తనకు ఉన్న ఫాలోయింగ్‌ను మరింత పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నది.

  హాట్ ఫోటోషూట్స్‌తో దివి వద్యా

  హాట్ ఫోటోషూట్స్‌తో దివి వద్యా

  సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా మారిపోయిన దివి వద్యా సమయం చిక్కినప్పుడు ఫోటోషూట్‌తో హాట్ హాట్‌గా కనిపిస్తుంటారు. తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఫోటోలు షేర్ చేస్తే వైరల్ అవ్వడం పరిపాటిగా మారుతున్నాయి. గతంలో పలు ఫోటోషూట్లతో తన బ్యూటీని ప్రేక్షకులకు, సినీ వర్గాలకు రుచి చూపించడం తెలిసిందే.

  తెల్ల చీరలో ఆకట్టుకొంటూ

  తెల్ల చీరలో ఆకట్టుకొంటూ

  తాజాగా సినిమా షూటింగులతో బిజీగా ఉంటూనే.. చీరకట్టులో తన అందాన్ని బయటపెట్టుకొన్నారు. తెల్లటి ఫ్లోరల్ చీరలో దివి వద్యా మరింత అందంగా కనిపించారు. సముద్ర తీరంలో చేసిన ఫోటోషూట్ ప్రస్తుతం మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్స్‌టాగ్రామ్‌లో ఫోటోలను షేర్ చేయగా.. అభిమానులు ఫిదా అయ్యారు. చీరకట్టు మీకు మరింత అందాన్ని తెచ్చిపెట్టిందంటూ నెటిజన్లు కామెంట్లు, లైక్‌లతో చెలరేగిపోతున్నారు.

  దివి వద్యా కెరీర్ ఇలా

  దివి వద్యా కెరీర్ ఇలా

  ఇక దివి వద్యా కెరీర్ విషయానికి వస్తే.. చిరంజీవితో గాడ్ ఫాదర్ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నది. అలాగే బిగ్‌బాస్ తెలుగు 5 విన్నర్ వీజే సన్నీతో కలిసి ఏటీఎం అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ దిల్ రాజు, హారీష్ శంకర్ పర్యవేక్షణ, నిర్మాణ సారథ్యంలో జరుగుతున్నది. ఈ వెబ్ సిరీస్‌కు చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. అలాగే లంబసింగి అనే చిత్రంలో నటిస్తున్నారు.

  English summary
  Bigg Boss Telugu fame, Actor Divi Vadthya latest photo shoot set fire in Social medida. She looks gorgeous in Summer Saree look. Netizens go gaga on her Photo shoot and beauty.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X