For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాకు అలాంటి యువకులే ఇష్టం.. మగాళ్లలో అదే చూస్తా.. ఆ విషయంలో తగ్గేది లేదు అంటూ దివి వద్యా

  |

  బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షోకు ముందు దివి వద్యా అంటే పెద్దగా అడ్రస్ తెలియని యువతి. ఒక్కసారి ఆ షోలకు అడుగు పెట్టిన తర్వాత చాలా మందికి కలల రాణిగా మారిపోయింది. అందం, అభినయంతో ఆకట్టుకొన్నది. తాజాగా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ టెలివిజన్ 2020 టైటిల్‌ను సొంతం చేసుకోవడంతో మరోసారి తానేంటో రుజువు చేసుకొన్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ..

  మహర్షి చిత్రంలో చిన్న పాత్రతో

  మహర్షి చిత్రంలో చిన్న పాత్రతో

  దివి వద్యా విషయానికి వస్తే.. బిగ్‌బాస్‌కు ముందు సినిమాల్లో చిన్న చిన్ప పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంలో ఓ పాత్రలో కనిపించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్‌లో చేరేటప్పటికి ఎవరీ అమ్మాయి అనే విధంగా క్రేజ్ సంపాదించుకొన్నది.

  బిగ్‌బాస్‌ షోలో మరింత క్రేజ్‌గా

  బిగ్‌బాస్‌ షోలో మరింత క్రేజ్‌గా

  బిగ్‌బాస్‌ తెలుగు 4లో చేరిన తర్వాత తనదైన శైలిలో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. మంచి హైట్.. ఎత్తుకు తగిన అందం.. నవ్వు ఆమె పర్సనాలిటీకి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. బిగ్‌బాస్‌లో ప్రయాణం కొద్ది వారాలే అయినప్పటికీ.. తనదైన ముద్రను ప్రేక్షకుల హృదయాల్లో వేసుకొన్నారు. ఏకంగా చిరంజీవి దృష్టిలో పడి మంచి ఆఫర్ కొట్టేశారు. తాజాగా హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గుర్తింపు పొందారు.

  నాకు ఎలాంటి యువకులంటే ఇష్టమంటే

  నాకు ఎలాంటి యువకులంటే ఇష్టమంటే

  నాకు పొడుగ్గా ఉండే యువకులంటే చాలా ఇష్టం. నా ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు. ఇక నేను పెళ్లి చేసుకొనే వ్యక్తి 6 అడుగుల 2 అంగుళాలు లేదా 6 అడుగుల 3 అంగుళాలు ఉండాలి. నేను ఎవరినైనా చూడగానే ముందు వారిలో చూసేది హైట్. రెండోది ఇంటెలిజెన్స్. ఆ రెండు లక్షణాలతోపాటు కష్టించి పనిచేసే గుణం ఉండాలి. కష్టసుఖాల్లో ఎప్పుడూ తోడు ఉండాలి అని దివి వద్యా పేర్కొన్నారు.

  అలా రిజెక్ట్ చేశారు అంటూ..

  అలా రిజెక్ట్ చేశారు అంటూ..

  నా హైట్ కారణంగా చాలా సార్లు నేను అవకాశాలను కోల్పోయాను. నీ ఎత్తు నీకు బలం, బలహీనత అని చాలా మంది చెప్పారు. బిగ్‌బాస్‌కు ముందు, తర్వాత ఆడిషన్స్‌లో చాలా మంది నన్ను రిజెక్ట్ చేశారు. ఇలాంటి సంఘటనలు దాటుకొంటూ కెరీర్‌ను డిజైన్ చేసుకొంటూ వెళ్లున్నాను.

  ఇంకా ప్రేమలో పడలేదు

  ఇంకా ప్రేమలో పడలేదు

  నేను ఇంకా ఎవరి ప్రేమలో పడలేదు. ఇంకా సింగిల్‌గానే ఉన్నాను. ప్రస్తుతం కెరీర్ మీదే నా దృష్టంతా. సినీ రంగంలో టాప్ స్థాయికి చేరుకోవాలనే కోరికతో ముందుకెళ్తున్నాను. రిలేషన్‌షిప్స్ లేనప్పుడు ప్రతీ ఒక్కరికి చాలా సమయం ఉంటుంది. క్రియేటివ్ ఫీల్డ్‌లో సమమం, మనకొంటూ కొంత స్పేస్ ఉండాలి. అప్పుడే మంచి నిర్ణయాలు తీసుకొని రాణించగలుగుతాం అని దివి వద్యా తెలిపారు.

  స్వయంకృషితో ఎదిగేందుకు ప్రయత్నం

  స్వయంకృషితో ఎదిగేందుకు ప్రయత్నం

  నేను చాలా తక్కవ ఆదాయం ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. ఓ దశలో పాకెట్ మనీ ఇచ్చే పరిస్థితుల్లో నా తల్లిదండ్రులు లేరు. స్వయంకృషితో ఎదిగేందుకు ప్రయత్నించాను. నాకు ఒకరి సానుభూతి పొందడం ఇష్టం లేదు. నీకు దృఢమైన సంకల్పం ఉంటే మనం కోరుకొన్న స్థానానికి వెళ్లగలమనే నమ్మకం ఉంది అని దివి వద్యా పేర్కొన్నారు.

  P Som Shekar, Ram Gopal Varma's Cousin Passes Away | Filmibeat Telugu
  సానుభూతి కోసం ప్రయత్నించను

  సానుభూతి కోసం ప్రయత్నించను

  బిగ్‌బాస్‌లో నాకు నేనుగా ఉండాలనుకోవడం పాజిటివ్‌గాను, నెగిటివ్ గాను మారింది. ఎక్కువ సార్లు వంటగదిలో చేతులు కాల్చుకొన్నాను. అయినా అలాంటి విషయాలను షేర్ చేసుకొని సానుభూతి పొందడానికి ప్రయత్నించలేదు. బిగ్‌బాస్ షోలో గుర్తింపు పొందడానికి ఆరాటపడలేదు. మనం చేసే పని గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉంటే.. ప్రపంచమే మన పని గురించి ఆలోచిస్తుంది అని దివి వద్యా పేర్కొన్నారు.

  English summary
  Divi Vadthya reveals she was sapiosexual.. Bigg Boss Beaty desired for men is like..!. Bigg Boss Telugu Season 4 fame and Cab stories heroine Divi Vadthya selected as Hyderabad Times Most Desirable Woman TV 2020 title. After this selection, her hot photos went viral in social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X