ఆ డైరెక్టర్ నాపై దారుణంగా.. సుడిగాలి సుధీర్‌ వల్లే.. హీరోయిన్ సంచలనం

తెలుగులో టాప్ కామెడీ షోగా దూసుకెళ్తున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తెలుగువారికి పరిచయమయ్యాడు సుడిగాలి సుధీర్. విజయవాడకు చెందిన సుధీర్... తొలుత మేజిక్ షోలు, చిన్నా చితకా ఈవెంట్స్‌ చేస్తూ కెరీర్ ప్రారంభించాడు. ఆపై జబర్దస్త్ కార్యక్రమంలో అడుగుపెట్టడంతో ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. ఇక్కడ గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్‌‌లతో కలిసి సుధీర్ చేసిన స్కిట్స్‌కు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. జబర్దస్త్‌తో వచ్చిన పాపులారిటీతో సుధీర్‌కు సినిమాలలో అవకాశాలు క్యూకట్టాయి. అంతేకాదు ఏకంగా సినిమాలలో హీరోగా నటించే స్థాయికి ఎదిగాడు. సుధీర్‌కు తెలుగునాట యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లు రాబడుతున్నాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటంతో పాటు వివాదాలకు దూరంగా ఉండే సుడిగాలి సుధీర్‌‌పై ఓ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆగిపోయిన సుడిగాలి సుధీర్ మూవీ
ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్న చిత్రం గోట్. ఇందులో ఆయన సరసన తమిళ నటి దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్నారు. టాలీవుడ్‌లో ఇదే ఆమె తొలి సినిమా. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, పోస్టర్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే బడ్జెట్‌ అంశాలు, పలు కారణాలతో నిర్మాతతో మనస్పర్ధల కారణంగా నరేష్.. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దాంతో సినిమా ఆగిపోయింది. అయితే అన్ని సమస్యలను సెటిల్ చేసిన నిర్మాతే.. డైరెక్టర్ మిగిల్చిన భాగాన్ని టేకప్ చేసి సినిమాను పూర్తి చేసినట్లుగా ఫిలింనగర్ టాక్. నవంబర్ 19న ఈ సినిమాలోని ఒడియమ్మా లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారని తెలియజేస్తూ ఓ ప్రోమోను వదిలింది చిత్ర యూనిట్.

Divya Bharathi sensational comments on Sudigali Sudheer and director Naresh Kupp

హీరోయిన్‌ని చిలక అంటూ
ఈ ప్రోమోపై నరేష్ కుప్పిలి స్పందిస్తూ.. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన దివ్యభారతిపై ఎక్స్ వేదికగా తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇదేం లేబర్ రా నువ్వు.. ఎడిట్‌లో తీసి పడేసిన షాట్స్‌తో నెక్ట్స్ సినిమా అంతా కాలం గడిపేలా ఉన్నావ్. అసలు సెకండ్ లీడ్ యాక్ట్రెస్ చేయాల్సింది. ఈ చిలకతో వదిలావ్.. పోనీ మంచి ట్యూన్‌ని ఏం చేశావ్ రా , స్టెప్పం కొట్టిన డప్పం వెయ్యనా. ఈ ఒక్క మాటతో రెండు చేతులు గుండెపై పెట్టుకుని... అంటూ నరేష్ ట్వీట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై దివ్యభారతి ఘాటుగా స్పందించారు.

హీరో వల్లే ఆ డైరెక్టర్ అలా
ఒక మహిళని చిలుక లేదా వేరే పదంతో పిలవడమంటే జోక్ కాదు. ఇది మహిళలపై నీకెంత ద్వేషముందో చెబుతోంది. ఇదే కాదు.. షూటింగ్ సెట్‌లోనూ ఇలాగే ప్రవర్తించేవాడు. పదే పదే ఆడవాళ్లని కించపరుస్తూ తన కళకు ద్రోహం చేశాడు. ఇంత జరుగుతున్నా ఈ వ్యవహారంలో హీరో (సుడిగాలి సుధీర్) మౌనంగా ఉండటం నాకు బాధగా ఉంది. ఆయన తీరు వల్ల డైరెక్టర్‌కి అలుసుగా మారింది. మహిళలు హేళనకు గురికాని ప్రదేశాలను నేను ఎంచుకుంటా. ప్రతి గొంతూ అవసరమైన చోట, గౌరవం విషయంలో రాజీపడలేని చోట. ఇది కేవలం ఒక ఎంపిక కాదు.. ఒక నటిగా, ఒక మహిళగా నా ప్రమాణం అని దివ్యభారతి రాసుకొచ్చారు.

సుడిగాలి సుధీర్‌ ఎలా స్పందిస్తారో?
దీంతో నరేష్ కుప్పిలి, దివ్యభారతి వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదాస్పదమైంది. గతంలో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ నటించిన పాగల్ సినిమాను డైరెక్ట్ చేసిన నరేష్.. ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా మధ్యలోనే వచ్చేశాడు. ఇప్పుడు తాజాగా గోట్ మూవీని మధ్యలోనే వదిలేయడం, హీరోయిన్ దివ్యభారతి సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ విషయం చర్చనీయాంశమైంది. అయితే మధ్యలో సుడిగాలి సుధీర్ పేరు తెరపైకి రావడంతో ఆయన ఎలా స్పందిస్తారన్నది హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X