‘ఇండస్ట్రీ నిండా మొసళ్లే... నా భర్తతో విడిపోవాలనే వాళ్ల ఆశ’

చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పరిస్ధితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలు పొందే గౌరవ మర్యాదలతో పోలిస్తే హీరోయిన్లకు పారితోషికం, ఇతర సౌకర్యాల విషయంలో అన్యాయం జరుగుతూనే ఉంది. దీనిపై ఎందరో నటీమణులు బయటపెట్టారు. ఇదే కాదు అవకాశాల పేరుతో అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూ.. హీరోయిన్ల జీవితాలను నాశనం చేసిన క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా ఎందరో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కీలక వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ నటి దివ్య ఖోస్లా కుమార్. ఈ వివరాల్లోకి వెళితే...

లవ్ టుడే అనే తెలుగు సినిమాతో 2004లో వెండితెరపై అడుగుపెట్టారు దివ్య ఖోస్లా. ఆ తర్వాత అబ్ తుమారే హవాలే వాటా సాథియో సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. సత్యమేవజయతే 2, యారియన్ 2, సావి, ఏక్ చతుర్ నార్ తదితర సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఈ ఏడాది సుధీర్ బాబు నటించిన జటాధర చిత్రంతో తెలుగువారిని దాదాపు 20 ఏళ్ల తర్వాత పలకరించారు దివ్య ఖోస్లా. ప్రస్తుతం హీరో హీరోయిన్ సినిమాలో నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌ని 2005లో దివ్య ఖోస్లా పెళ్లి చేసుకున్నారు. 2011లో ఈ దంపతులకు ఓ కుమారుడు పుట్టాడు. నాటి నుంచి కుటుంబాన్ని చూసుకుంటూనే నటిగా, నిర్మాతగా రాణిస్తున్నారు దివ్య ఖోస్లా.

Divya Khosla Kumar denies divorce rumours with husband Bhushan Kumar

అలియా భట్‌ మూవీపై విమర్శలు
సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ నిత్యం వార్తల్లో ఉంటారు దివ్య ఖోస్లా. ఏ విషయంపై అయినా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం ఆమె స్టైల్. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్‌‌లో బల్క్ బుకింగ్, కలెక్షన్స్ లెక్కలపై సంచలన వ్యాఖ్యలు చేశారు దివ్య. కొద్దిరోజుల క్రితం స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించిన జిగ్రా సినిమాకు టికెట్స్ బుక్ కాకుండా థియేటర్స్ మొత్తం ఖాళీగా ఉండగా.. తాను జిగ్రాను చూసేందుకు వెళ్లానని, థియేటర్ మొత్తం ఖాళీగా ఉందని కానీ కలెక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. ఫేక్ వసూళ్లను ప్రకటిస్తున్న అలియా భట్ ధైర్యాన్ని మెచ్చుకోవాలని, జనాన్ని వెర్రివాళ్లను చేయొద్దని దివ్య మండిపడ్డారు. దీనిపై కరణ్ జోహార్, అలియా భట్‌లు కౌంటర్ ఇవ్వగా.. దీనికి దివ్య ఖోస్లా కౌంటరిచ్చారు.

నన్ను నేను అమ్ముకోను
తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్య ఖోస్లా కీలక వ్యాఖ్యలు చేశారు. అవకాశాల కోసం నేను ఎప్పుడూ ఆత్మగౌరవాన్ని అమ్ముకోను. నిజాయితీగానే ఉంటా. బాలీవుడ్‌లో ఎన్నో మొసళ్లు ఉన్నాయి...ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఓ సినిమా కోసం యూకేలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద దాదాపు 42 రోజుల పాటు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి అని దివ్య ఖోస్లా గుర్తుచేసుకున్నారు.

మేం విడిపోవడమే కావాలి
ఇక తాను తన భర్త భూషణ్ కుమార్‌తో విడాకులు తీసుకోబోతున్నట్లుగా పలుమార్లు ఊహాగానాలు వచ్చాయి. తొలుత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈమె పేరు దివ్య ఖోస్లా కుమార్ అనే ఉండేది. అయితే కొద్దిరోజుల క్రితం ఇందులో భర్తకు సంబంధించిన కుమార్ అనే పదాన్ని తొలగించడంతో పాటు టీ సిరీస్ ఛానెల్‌ని ఆన్ ఫాలో చేసింది. దాంతో దివ్య- భూషణ్‌లు విడిపోతున్నారని రూమర్స్ వైరల్ అయ్యాయి. దీనిపై దివ్య స్పందించారు. నేను నా భర్త నుంచి విడిపోతున్నానన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. కానీ నేను, భూషణ్ విడిపోవాలని మీడియా కోరుకుంటోందని దివ్య ఖోస్లా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశం కాగా.. దివ్య చెప్పిన ఆ మోసళ్లు ఎవరు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Read more about: bhushan kumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X