‘ఆ నటుడు నామీద.... అతని కింద నలిగిపోవాల్సిందే’

సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏదైనా సరే ఇటీవలి కాలంలో బూతు కంటెంట్ ఎక్కువ అవుతోంది. రొమాన్స్ పరిధిని దాటి లిప్‌లాక్‌లు, బెడ్ సీన్స్ వంటివి చక్కర్లు కొడుతున్నాయి. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో మేం అదే తీస్తున్నామని మేకర్స్ చెబుతున్నారు. అయితే ఇలాంటి సీన్స్ తీయడం అంత తేలిక కాదని.. ఇందుకోసం నటీనటులు, దర్శకులు, సిబ్బంది ఎంతో కసరత్తు చేయాలని.. మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలని పలువురు స్టార్స్ చెబుతున్నారు. తాజాగా నటి దివ్య పిళ్లై రొమాంటిక్ సీన్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

ఎయిర్‌లైన్స్‌లో జాబ్
మంగళవారం, తండేల్ సినిమాలతో తెలుగునాట తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళీ ముద్దుగుమ్మ దివ్య పిళ్లై. గ్లామర్ రోల్స్‌తో పాటు పర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యత ఉన్న సినిమాలలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. యూఏఈలో స్థిరపడిన మలయాళీ కుటుంబంలో జన్మించారు ఈ ముద్దుగుమ్మ. సినీరంగంలో అడుగుపెట్టడానికి ముందు ఎయిర్‌లైన్స్‌లో పనిచేశారు. 2015లో అయల్ జనల్లా అనే మలయాళీ చిత్రంతో సినీ రంగ ప్రస్థానాన్ని ప్రారంభించారు దివ్య. ఈ సినిమాతో నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూకట్టాయి.

Divya Pillai Reveals How to Handle Intimate Scenes during shooting

జమీందార్ భార్యగా క్రూరత్వం
మాస్టర్ పీస్, మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్, సేఫ్, ఈజీ గో, కల తదితర మలయాళ చిత్రాల్లో నటించిన దివ్య.. ఆ తర్వాత తమిళ చిత్రాలతో బిజీ అయ్యారు. ఈ దశలో నవీన్ చంద్ర హీరోగా వచ్చిన తగ్గేదే లే మూవీతో తెలుగువారిని పలకరించారు. ఇందులో భార్యగా హుందాగా నటిస్తూనే, లిప్‌లాక్‌తోనూ రెచ్చిపోయింది. ఈ చిత్రంలో నటనతో దర్శకుడు అజయ్ భూపతి కళ్లలో పడిన దివ్య కెరీర్‌ను మంగళవారం మూవీ మలుపు తిప్పింది. ఈ చిత్రంలో జమీందారు భార్య రాజేశ్వరిగా నెగిటివ్ షేడ్స్‌లో ఉన్న పాత్రలో ఒదిగిపోయారు దివ్య. ఇందులో పనిమనిషితో అక్రమ సంబంధం పెట్టుకుని, హీరోయిన్‌ని చంపించే క్రూరురాలిగా కనిపిస్తారు దివ్య.

సాయిపల్లవి అక్కగా ఆకట్టుకున్న దివ్య
ఇక ఈ ఏడాది తండేల్ మూవీలో హీరోయిన్ సాయిపల్లవికి అక్కగా సాఫ్ట్ క్యారెక్టర్‌లో నటించారు దివ్య పిళ్లై. ఈ వెంటనే మమ్ముట్టితో బజూక, విజయ్ సేతుపతితో ఏస్, తెలుగులో భైరవం, మలయాళంలో సురేష్ గోపీతో జానకీ vs స్టేట్ ఆఫ్ కేరళ సినిమాలో నటించారు ఈ ముద్దుగుమ్మ. ఇటీవల మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తోన్న దివ్య పిళ్లై ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంగళవారం మూవీలో రొమాంటిక్ సీన్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నేను తొలిసారిగా కళాపురుష్ అనే మలయాళం సినిమాలో టొవినో థామస్‌తో ఇంటిమేట్ సీన్‌లో నటించా. దర్శకుడు ఈ సీన్ గురించి వివరించగా ఫస్ట్ నో చెప్పా. చుట్టూ జనం ఉండగా.. కెమెరాలలో రికార్డ్ అవుతుండగా నా వల్ల కాదని చెప్పా. కోపం, బాధ ఇలా ఏ ఎమోషన్ అయినా ఓకే కానీ, ఇంటిమేట్ సీన్స్‌లో ఎమోషన్ వేరు అని దివ్య పిళ్లై అన్నారు.

ఏం చేసినా భరించాల్సిందే
అయితే దీనిపై ఒకసారి ఆలోచించా.. నేను నటిని మాత్రమే, ఏ సీన్స్‌లో నటించాలి, ఏ సీన్స్‌లో నటించకూడదు అనేది దర్శకుడి ఇష్టం. ఒకసారి కట్ చెబితే ఆ సీన్‌ అక్కడితో ముగిసినట్లే. కానీ ఇలాంటి సీన్స్‌లో చేస్తే ప్రజలు నా గురించి, నా వ్యక్తిత్వం గురించి ఏమనుకుంటారు. సీన్ గురించి టొవినో థామస్ గురించి చర్చించి షూటింగ్ పూర్తి చేశా. కానీ 75 నుంచి 80 కేజీల బరువు ఉన్న నటుడు నాపై పడుకుని ఉన్నప్పుడు కెమెరా పొజిషన్‌కు తగినట్లుగా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలి. ఆ సమయంలో మైండ్‌లో వేరే ఏ ఆలోచన ఉండకూడదు.. ముద్దును కూడా ఎంజాయ్ చేయలేం. లిప్‌లాక్, ఇంటిమేట్ సీన్స్‌లో నటించేటప్పుడు మనకు ఇబ్బంది అనిపించినా ఆ ఫీలింగ్ ఫేస్‌లో చూపించకూడదు. సహ నటుడు ఏం చేసినా కట్ చెప్పే వరకు భరిస్తూ ఉండాల్సిందేనని దివ్య పిళ్లై బోల్డ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: divya pillai mangalavaram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X