నాకు బట్టలు విప్పి నటించాల్సిన అవసరం లేదు.. న్యూడ్ వీడియో వైరల్ పై నటి కామెంట్స్..
నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు దొరుకుతే కొందరూ నటులు ఆ పాత్రలకు ప్రాణం పోస్తాడు. తమ బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సినిమాలో పాత్ర డిమాండ్ చేస్తే.. ప్రయోగాలు చేయడానికి కూడా వెనకాడరు. అలాంటి సందర్భంలో పాత్రను బట్టి కొందరూ రొమాన్స్ సన్నివేశాలలో లేదా బోల్డ్ పాత్రలలో నటించడానికి కూడా సిద్దమవుతారు. అలాంటి సాహసమే చేసింది ఓ హీరోయిన్. ఓ సినిమాలో తన రోల్ కోసం బోల్డ్ గా నటించింది. అయితే.. ప్రస్తుతం ఆ నటి యాక్ట్ చేసిన ఓ బోల్డ్ సీన్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. ఆ సీన్ పై పెద్ద చర్చ కూడా జరుగుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఈ సినిమా ఏంటీ?
ఆ హీరోయిన్ ఎవరు? కాదు.. మలయాళ నటి దివ్య ప్రభ ( Divya Prabha). ఈ అమ్మడు 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్' (All We Imagine As Light) నటించారు. కని కుశృతి ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీకి పాయల్ కపాడియా (Payal Kapadia) దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ మూవీ రిలీజ్ అయ్యింది. అయితే.. ఈ సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలు వైరల్ గా మారాయి. ఈ అందులో ప్రధానంగా ఈ సినిమాలోని బోల్డ్ సీన్స్ వైరల్‌గా మారడంపై నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అన్ లైన్ లోనూ.. అటు ఆఫ్ లైన్ లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

సినిమాలోని న్యూడ్ సీన్స్ వైరల్ కావడంపై హీరోయిన్ దివ్య ప్రభ స్పందించారు.'ఈ మూవీని ఒప్పుకున్నప్పుడే.. ఇలాంటి కామెంట్స్ వస్తాయని ఊహించాను. నేను ఎన్నో సినిమా కథలు వింటున్నాను. ఆ స్టోరీ నచ్చితేనే ఆ ప్రాజెక్ట్ కు ఓకే చెబుతాను. నేను నటించే పాత్రకు ప్రాధాన్యత ఉండాలని చూసుకుంటా.. అలాంటి పాత్రల్లో నటిస్తాను. అలాంటి ఈ సినిమాలో పాత్ర కూడా నాకెంతో నచ్చింది. ఇక, ఇందులోని ఒక వీడియో ఇటీవల తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలను వైరల్ చేసేవాళ్లు ఎలా ఆలోచిస్తున్నారో అర్థంకావడం లేదు' అని ఆవేదన వ్యక్తం చేస్తారు.
'ఫేమ్, పాపులారిటీ కోసం న్యూడ్ సీన్‌లో యాక్ట్ చేశానని పలువురు అంటున్నారు. అలాంటి ఫేమ్ కోసం బట్టలు విప్పి నటించాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలోని నటించడానికి ముందే నేను ఎన్నో అవార్డులు పొందాను. విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాల్లో నటించాను. ఫేమ్ కోసం సీన్స్ ల్లో నటించాల్సిన అవసరం లేదని నా భావన' అని హీరోయిన్ దివ్య ప్రభ తెలిపారు.

'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్'సినిమా హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఈ సినిమాలో స్త్రీల జీవితాలు, వారి కష్టాల గురించి డిఫరెంట్‌గా చూపించారు. ఈ చిత్రం ఏడాది ప్రారంభంలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాపై సర్వత్రా చర్చ మొదలైంది. పాయల్ కపాడియా (Payal Kapadia) దర్శకత్వం వచ్చిన తొలి ఫీచర్ సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాకు అంతర్జాతీయ పబ్లికేషన్స్‌లో మంచి రివ్యూలు వచ్చాయి.
ఈ బ్యూటీ మాలిక్, అరియప్పు వంటి మలయాళ చిత్రాలలో ప్రాముఖ్యత పాత్రలలో కనిపించింది. దివ్యప్రభ హిందీ, సౌత్ ఇండియన్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ పాత్రల్లో నటించి ప్రశంసలు కూడా అందుకున్నాడు. భవిష్యత్తులో కూడా విభిన్నమైన, ఛాలెంజింగ్ పాత్రలు చేయాలని నటిస్తోందని భావిస్తోంది.


Click it and Unblock the Notifications











