పెళ్లి వద్దు..కానీ తల్లిని కావాలి! లెజెండరీ హీరో కూతురు షాకింగ్ కామెంట్స్

తమిళ సినీ ఇండస్ట్రీలో లెజెండరీ నటుడు సత్యరాజ్‌కు ఎంతటి ప్రత్యేక స్థానం ఉందో తెలిసిందే. విలన్‌గా కెరీర్ ప్రారంభించి.. తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, పాన్ ఇండియా నటుడిగా ఎదిగిన ఆయన.. తన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా 'బాహుబలి' సినిమాలో కట్టప్ప పాత్రతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు సత్యరాజ్ కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది. కారణం.. ఆయన కుమార్తె దివ్య సత్యరాజ్ (Divya Sathyaraj) చేసిన సంచలన వ్యాఖ్యలే.

దివ్య సత్యరాజ్ సినీ రంగంలో కాకుండా సామాజిక సేవ, రాజకీయాల్లో చురుకుగా ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. న్యూట్రిషనిస్ట్‌గా పనిచేస్తూనే 'మగిళ్‌మది' అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. గత కొంతకాలంగా డీఎంకే పార్టీలో చేరి రాజకీయ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే తరఫున విస్తృతంగా ప్రచారం చేసి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యారు.

Divya Sathyaraj Shocking Views on Marriage Motherhood and Love Failure Go Viral

ఇలాంటి సమయంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్య సత్యరాజ్.. తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, పెళ్లి, పిల్లలు, కుటుంబం గురించి చాలా బోల్డ్‌గా స్పందించారు. ముఖ్యంగా పెళ్లి వ్యవస్థపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దివ్య మాట్లాడుతూ.. 'నాకు పెళ్లి వ్యవస్థపై పెద్దగా నమ్మకం లేదు. తాళి కట్టడం, ఉంగరాలు మార్చుకోవడం, సంప్రదాయాల పేరుతో జరిగే ఆచారాలపై కూడా నాకు నమ్మకం లేదు' అని స్పష్టం చేశారు.

పెళ్లి అనే బంధం తప్పనిసరి కాదని, ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ఇష్టపడితే కలిసి జీవించవచ్చని అన్నారు. అందుకు తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అంతేకాదు.. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండాల్సిన అవసరం కూడా లేదని చెప్పడం మరింత చర్చకు దారితీసింది. "ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటూనే తమ బంధాన్ని కొనసాగించవచ్చు. కలిసి జీవించడం అంటే ఒకే ఇంట్లో ఉండడమే కాదు" అంటూ కామెంట్ చేసింది.

ఆధునిక సమాజంలో సంబంధాల నిర్వచనం మారుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంకా పిల్లల విషయంలోనూ దివ్య తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించారు. "పెళ్లి చేసుకున్నాకే పిల్లలను కనాలనే నిబంధనను నేను అంగీకరించను. పెళ్లి లేకుండానే తల్లిని కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని ఆమె చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మహిళ జీవితానికి పెళ్లి ఒక్కటే మార్గం కాదని, తల్లితనం అనేది వ్యక్తిగత నిర్ణయమని ఆమె సూచించినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

జాతకం, సంప్రదాయాలపై కూడా దివ్య ఓపెన్‌గా మాట్లాడారు. "నాకు జాతకం లేదు. ఆ విషయాన్ని నేను గర్వంగా చెబుతాను. మా నాన్నకు దేవుడిపై నమ్మకం లేకపోవడంతో నాకు జాతకం రాయించలేదు. నాకు కూడా జాతకాలపై విశ్వాసం లేదు" అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.ఈ సందర్భంగా తన ప్రేమ వైఫల్యం గురించి కూడా దివ్య భావోద్వేగంగా మాట్లాడారు. "నేను కూడా ప్రేమించాను. కానీ ఆ ప్రేమ విఫలమైంది. ఆ బాధను నా తల్లిదండ్రుల ముందు చూపించలేదు. ఒంటరిగా చాలాసార్లు ఏడ్చాను. ఆ బాధ నుంచి నేనే బయటపడ్డాను" అని చెప్పారు.

తండ్రి సత్యరాజ్ గురించి మాట్లాడుతూ.. "నా జీవిత నిర్ణయాల్లో మా నాన్న ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. ఆయన నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. నేను పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా అది నా ఇష్టం. నేను సంతోషంగా ఉంటే అదే ఆయనకు ముఖ్యం" అని చెప్పారు. ఈ మాటలు సత్యరాజ్ ఓ ప్రోగ్రెసివ్ తండ్రిగా నిలుస్తున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దివ్య వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దివ్య మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X