సుడిగాలి సుధీర్ అలా అవమానించారు.. హీరోయిన్ దివ్యభారతి ఫైర్
Divyabharathi: ప్రముఖ యాంకర్ సుడిగాలి సుధీర్ హీరో గా గోట్ (GOAT) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో తమిళ నటి దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే పలు వివాదాలు చుట్టుముట్టాయి. దర్శకుడు- హీరోయిన్ మధ్య కలహాలు, మధ్యలో సినిమాను వదిలేయడం, సోషల్ మీడియాలో రూమార్స్ ఇలా అనేక సమస్యలు ఈ సినిమాను వెంటాడాయి. ఎట్టకేలకు ఈ మూవీ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. తాజాగా ఈ వివాదంపై హీరోయిన్ మరోసారి స్పందించారు. హీరో సుడిగాలి సుధీర్, డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇటీవలి GOAT సినిమా దర్శకుడు నరేష్ కుప్పిలిపై సోషల్ మీడియాలో హీరోయిన్ దివ్యభారతి షాకింగ్ కామెంట్స్ చేశారు.అంతేకాకుండా ఆమె తన ట్వీట్‌లో సుధీర్ పేరు కూడా ప్రస్తావించడం.దీంతో ఫాన్స్, మీడియా దృష్టి ఈ వివాదంపై పడింది. సోషల్ మీడియాలో భారీ చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం GOAT టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఆశ్చర్యకరంగా డైరెక్టర్ నరేష్ కుప్పిలి, హీరో సుడిగాలి సుధీర్ ఇద్దరూ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఈవెంట్‌లో ప్రధానంగా చిత్రం టీమ్, ముఖ్యంగా హీరోయిన్ దివ్యభారతి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరోయిన్ దివ్య భారతి మాట్లాడుతూ దర్శకుడు నరేష్ కుప్పిలి ప్రవర్తన గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. 'షూటింగ్ సమయంలో వాళ్లు ఎలా ఉంటారో నాకే తెలిసింది.వాళ్ల అటిట్యూడ్ అలాగే ఉంది. పని చేసే ప్రదేశంలో రిస్పెక్ట్ ఇవ్వమని మనం అడగలేం. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. ఒక రోజు షూట్‌లో అందరి ముందు 'ఈ అమ్మాయిని ఎంత అందంగా చూపిద్దాం అనుకున్నా... అంత అందంగా లేదు' అని డైరెక్టర్ అన్నాడు. అది నీ అభిప్రాయం కావచ్చు. కానీ అందరి ముందు అలా చెప్పడం ఎలా? నా మీద జోకులు, కామెంట్స్ చేస్తూ ఆయన, ఆయన అసిస్టెంట్లు నవ్వుకున్నారు. నాకు కన్పిడెన్స్ ను దెబ్బ తీసింది. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను పని చేశారు. సినిమాను పూర్తి చేశాను" అని తన సహనాన్ని వివరించింది.
హీరోయిన్ ఇంకా మాట్లాడుతూ.. 'సోషల్ మీడియాలో 'చిలక' అంటూ అవహేళన చేయడం అత్యంత బాధాకరమైన అంశం. నన్ను 'చిలక' అంటూ నెగిటివ్‌గా ట్రీట్ చేశారు. నాకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది. నన్ను అవమానకరంగా చిత్రీకరించారు. దీంతో నా సెల్ప్ రెస్పెక్ట్ కోసం అలా చేశాను. అందుకే స్పందిస్తూ పోస్ట్ పెట్టాను. నా కోసం నేను నిలబడ్డాను. ఆ ట్విట్ గురించి నన్ను ఎవరూ కూడా ఆడగలేదు. కానీ అంత అటెన్షన్ వస్తుందని అనుకోలేదు' అని తెలిపారు.
సుధీర్ గురించి మాట్లాడుతూ.. 'నన్ను ఇర్రిటేట్ చేయడానికి సుధీర్ గారు చేయబోయే కొత్త సినిమాలో ఐటెం సాంగ్ ఉందని... వేరే డైరెక్టర్ ద్వారా నన్ను అడిగించారు. అలా అడగడం తప్పు కాదు. కానీ, సమస్య ఉన్నప్పుడు మాట్లాడకుండా కావాలనే నన్ను టార్గెట్ చేశారు. అది చాలా పెద్ద తప్పు. ఆ విషయాన్ని విడిచిపెట్టకుండా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో సుధీర్ స్పందించకపోవడంతోనే ఆయన పేరును మెన్షన్ చేశాను" అని వివరించారు.
సుధీర్‌పై ఇంక మాట్లాడుతూ.. "ఇది సుధీర్ గారి సినిమా. ఆయన కూడా ఇందులో పని చేశారు. ఆయన మీ ఫ్రెండ్.. ట్విట్టర్‌లో నాపై పోస్టులు చేస్తే.. ఆయన స్పందించలేదు. ప్రొడ్యూసర్ తో ఇబ్బంది ఉంటే.. వాళ్ల వాళ్లు మాట్లాడుకుంటే సరిపోతుంది. కానీ, నన్ను ఇన్వాల్ చేయడం సరికాదు. అందుకే నేను ఆయన పేరును ప్రస్తావించాను. అంతే కానీ, ఆయన నాకు హెల్ప్ చేస్తాడనో, లేదా ఆయనతో నాకు వ్యక్తిగత సమస్య ఉందనో కాదు." అని ఎమోషనల్ అయ్యారు. తనకు దర్శకుడు లేదా సుధీర్‌తో వ్యక్తిగత విభేదాలు లేవని, కానీ గౌరవం, ప్రవర్తన విషయంలో తాను నిలబడాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.
హీరోయిన్ దివ్యభారతి వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో విస్తృత చర్చ మొదలైంది. సినీ అభిమానులు, సోషల్ మీడియా వేదికలు, ఫ్యాన్ కమ్యూనిటీలు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది దివ్యభారతికి సపోర్టుగా కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు సుధీర్ మాట్లాడకపోవడం కూడా తప్పేనా అంటూ విమర్శిస్తున్నారు. ఇక ఈ వివాదంపై సుడిగాలి సుధీర్ ఎలా స్పందించారోననే ఆసక్తి మరింత మొదలైంది. ప్రస్తుతం ఫ్యాన్స్, మీడియా ఆయన స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











