‘ఇంట్లో గొడవలు అవుతున్నాయి.. దయచేసి వదిలేయండి’
యంగ్ హీరోయిన్ దివ్య భారతీ తనపై వస్తున్న డేటింగ్ రూమర్లపై స్పందించింది. తమిళ చిత్రాలతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ అవకాశాలను అందుకుంటోంది. తర్వలో జబర్దస్త్ ఫేమ్, హీరో సుడిగాలి సుధీర్ అప్ కమింగ్ ఫిల్మ్ 'గోట్' తర్వాత తెలుగు ప్రేక్షకులను త్వరలోనే అలరించబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తూ దివ్య భారతీ బిజీగా ఉంది. ఇక ఈ ముద్దుగుమ్మ తన రాబోయే సినిమాలపై ఫోకస్డ్ గా ఉంది.
ఈ క్రమంలోనే దివ్య భారతీ ఇటీవల తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ తో డేటింగ్ లో ఉందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరిద్దరూ కలిసి గతంలో తీసిన చిత్రాలు, వారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. రీసెంట్ గానూ వీరి ఇద్దరి పెయిర్ గా 'కింగ్ స్టన్' అనే చిత్రం కూడా వచ్చి ఆకట్టుకుంది. సీ అడ్వెంచర్స్ గా వచ్చిన ఫస్ట్ ఇండియన్ సినిమాగానూ గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో జీవీ ప్రకాశ్, దివ్య భారతీ నటనకు ప్రశంసలు కూడా దక్కాయి.

అయితే, కెరీర్ విషయంలో వీరిద్దరికి మంచి మార్కులే పడుతున్నా.. పర్సనల్ లైఫ్ లో మాత్రం వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పూటకో పుకారు పుట్టుకొస్తోంది. రీసెంట్ గా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్, నటి దివ్య భారతీ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ జోరుగా రూమర్లు వ్యాప్తి చెందాయి. అప్పుడు వెంటనే జీవీ ప్రకాశ్ స్పందించి. ఆ రూమర్లలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చారు. తాము మంచి స్నేహితులమని అంతకుమించి ఇంకేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ రూమర్లు మాత్రం ఆగడం లేదు.
ఇక తాజాగా దివ్య భారతీ తమ డేటింగ్ రూమర్లపై కాస్తా ఘాటుగా స్పందించింది. ఇన్ స్టా వేదికన నోట్ రిలీజ్ చేసింది. తను ఎవరితో, ఏ నటుడితో డేటింగ్ చేయలేదని క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ తను పేరును అనవసరంగా లాగుతున్నారని, వ్యక్తిగతమైన కుటుంబ విషయాల్లోకి తన పేరును వాడుతూ రూమర్లు స్ప్రెడ్ చేస్తున్నారని మండిపడింది. తనకు జీవీ ప్రకాశ్ కుటుంబంతో ఎలాంటి సమస్యలు లేవని, వారి ఇంట్లోని సమస్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
ఇంకా కఠినంగా చెప్పాలంటే నేను ఏ నటుడితోనూ డేట్ చేయనని చెప్పుకొచ్చింది. అందులోనూ ఒక పెళ్లి అయిన వ్యక్తితో అస్సలు జరగదన్నారు. ఆధారంలేని రూమర్లేనని ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ గీత దాటి మరీ రూమర్లు వ్యాప్తి చెందుతున్నాయి. దాని వల్ల నా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లనుంది. నేను చాలా ధైర్యమైన మహిళని, ఇలాంటి గాసిప్ లతో నన్ను తప్పుగా చూపించే ప్రయత్నం చేయొద్దు. నెగెటివిటీని వ్యాప్తి చేయడానికి బదులు తమతమ కెరీర్ పైనే శ్రద్ధ వహిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఈ విషయంపై ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ స్టేట్ మెంట్, ధన్యవాదాలు... అని క్లారిటీ ఇచ్చింది. ఇలా దివ్య భారతీ తన డేటింగ్ రూమర్లకు చెక్ పెట్టింది.


Click it and Unblock the Notifications











