Divyansha Kaushik: ఐ లవ్ నాగ చైతన్య, అతనంటే క్రష్.. చైతూతో పెళ్లిపై 'మజిలీ' భామ క్లారిటీ !

టాలీవుడ్ గుడ్ బాయ్ నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ సమంత క్యూట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ అనూహ్యంగా విడిపోతున్నట్లు ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకుంటూ సినిమాల్లో బిజీగా మారారు. అయితే విడాకుల అనంతరం నాగ చైతన్య బ్యాచ్ లర్ లిస్ట్ లో పడిపోయాడు. దీంతో నాగ చైతన్య ఏ హీరోయిన్ తో క్లోజ్ గా ఉన్నా ఆమెతో ప్రేమాయణం సాగిస్తున్నాడని వార్తలు జోరందుకుంటున్నాయి. ఇటీవల శోభితా ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నాడన్న విషయం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో యంగ్ హీరోయిన్ తో చైతూ డేటింగ్ చేస్తున్నాడని రూమర్స్ ఊపందుకున్నాయి. ఈ క్రమంలో నాగ చైతన్యతో పెళ్లిపై అసలు నిజం బయటపెట్టేసింది మజిలీ బ్యూటి దివ్యాంశ కౌశిక్.

సామ్-చై కెమిస్ట్రీ..

సామ్-చై కెమిస్ట్రీ..

అక్కినేని నట వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య జోష్ చిత్రంతో తెరంగేట్రం చేశాడు. ఇక సమంత ఏ మాయ చేశావే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రం ఇద్దరికీ మంచి విజయాన్ని అందించింది. ముఖ్యంగా ఈ సినిమాలో వీరిద్దరి రొమాన్స్, కెమిస్ట్రీ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. తర్వాత అనేక సినిమాల్లో కలిసిన నటించిన ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు.

ఎవరి దారిలో వారు బిజీగా..

ఎవరి దారిలో వారు బిజీగా..

కొంత కాలానికి సమంతను నాగ చైతన్య పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న విషం తెలిసిందే. వారి పెళ్లి అట్టహాసంగా రెండు పద్ధతుల్లో జరిగింది. తర్వాత నాలుగేళ్లకు వారి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ వారిద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వారు ప్రకటించిన తర్వాత కూడా వారి విడాకుల గురించి అనేక చర్చలు జరిగాయి. అనేక ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. ప్రస్తుతం ఎవరి దారిలో వాళ్లు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారారు.

రూమర్స్ కి నవ్వడం తప్పా..

రూమర్స్ కి నవ్వడం తప్పా..

ఈ విడాకుల అనంతరం కొద్దిరోజులకు అడివి శేష్ గూఢచారి ఫేమ్ శోభిత ధూళిపాళతో నాగ చైతన్య ప్రేమలో పడ్డాడని, త్వరలో పెళ్లి కూడా చేసుకునే అవకాశం ఉందని ప్రచారం విపరీతంగా జరిగింది. ఇక ఈ వార్తలపై ఒక వీడియో ద్వారా శోభిత ధూళిపాళ సమాధానం ఇచ్చినట్లు భావించారు నెటిజన్లు. ఇలాంటి రూమర్స్ పై నవ్వి ఊరుకోవడం కంటే ఏం చేయగలం అని కూడా నాగ చైతన్య లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ సమయంలో చెప్పాడు.

ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు..

ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు..

ఇక ఇటీవల మజిలీ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ తో నాగ చైతన్య పెళ్లి జరగనుందని వార్తలు వచ్చాయి. వీళ్లిద్దరు జూబ్లీహిల్స్ లో కొత్త ఇంటిలో కాపురం చేయనున్నారని కూడా పుకార్లు వైరల్ అయ్యాయి. ఈ విషయాలన్నింటిపై తాజాగా స్పందించింది దివ్యాంశ కౌశిక్. సందీప్ కిషన్ హీరోగా నటించిన మైఖేల్ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదల కానుంది.

అతను నాకు సీనియర్..

అతను నాకు సీనియర్..

మైఖేల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్యతో పెళ్లిపై ప్రశ్న అడగ్గా.. ఆసక్తికర సమాధానాలు చెప్పింది దివ్యాంశ కౌశిక్. "ఐ లవ్ నాగ చైతన్య.. అతనిపై క్రష్ కూడా ఉంది. చూడటానికి చాలా బాగుంటారు. అతను నాకు ఒక సీనియర్. సెట్ లో నేను అతన్ని సీనియర్ గా చూస్తాను. అతను రాగానే నేను కుర్చీలో నుంచి లేచి నిల్చొని హీరో గారు రండి అంటూ మాట్లాడతాను" అని దివ్యాంశ కౌశిక్ తెలిపింది.

ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు..

ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు..

నాగ చైతన్య మీకు రామారావ్ ఆన్ డ్యూటి సినిమా ఆఫర్ వచ్చేందుకు హెల్ప్ చేశాడని రూమర్స్ వచ్చాయి అన్న ప్రశ్నకు.. "నేను అలాంటి రూమర్స్ ఎప్పుడూ వినలేదు. లేదు మేము ఏం పెళ్లి చేసుకోవట్లేదు. అలాగే నాకు రామారావ్ ఆన్ డ్యూటి సినిమాకు హెల్ప్ చేయలేదు. అదెప్పుడో వచ్చిన అవకాశం. ఇక నాగ చైతన్య తన జపనీస్ రెస్టారెంట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. బర్త్ డేకు వాటికి వీటికి విషెస్ చెప్పుకుంటాం. కానీ పెద్దగా టచ్ లో లేను" అని దివ్యాంశ కౌశిక్ క్లారిటీ ఇచ్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X